ఎమ్మెల్యే తో చీరాల అధికారుల సమీక్ష ఒంగోలు లో, అధికారుల ఆరోగ్యం, కానరాని కరోనా బస్సు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,948; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చీరాల నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖ అధికారుల సమీక్షా సమావేశం, ఒంగోలు పట్టణం లోని ఎమ్మేల్యే కరణం గారి నివాసం నందు(కలెక్టర్ భవనం లో కాదు) జరిగినది, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిఇ, చీరాల వేటపాలెం ఎంపిడివో లు, పంచాయితీ రాజ్ డీఈ, మరియు ఏఈ లు, ఈఈ మరియు స్థానిక ఎపిఎం లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అని తెలిసింది.

కరోనాను జయించి, కరణం గారి ఆరోగ్యము గా ఉన్నారు అన్న వార్త సంతోషము, ఆనందము. చీరాల నియోజక వర్గ సమీక్ష కూడా ఆనందము. పూర్తి కొత్త అభివ్రుద్ది వివరాలు తెలీదు, ఎమ్మెల్యే గారి ఫేస్బుక్ లో రాయలేదు.

మరి మన చీరాలకు కూడా 100 పడకల ఆసుపత్రి వస్తుంది ఏమో త్వరలో, తెలీదు. మొన్న ఎక్కడో కలెక్టర్ గారి సూచనగా చదివాము, ప్రతి నియోజక వర్గములో ఉండాలి అని, ధన్యవాదములు.

ఎమ్మెల్యే గారు మరియు అధికారులు, చీరాలకు కేటాయించిన, కరోనా సంజీవిని బస్సు వైద్యుల పనుల గురించి, ఇప్పుడు ఫోటోలు ఎవరు పెట్టడము లేదు. కొంత మంది, అసలు బస్సు ఆ రోజు ప్రారంభ ఫోటోలకు తెచ్చారు, తర్వాత ఇక్కడ లేదు ఆ బస్సు అంటున్నారు, వాస్తవాలు తెలీదు. దయచేసి, అధికారులు ఎమ్మెల్యే గార్లు, సంజీవిని బస్సు వైద్య విశేషాలు ప్రతి రోజు లేదా వారానికి, ఎంత మంది కి వైద్యం చేసారు లాంటివి ప్రజలు చెప్ప గలరు.

మనము దాదాపుగా 6 నెలల పైన, చీరాలకు వారములో 4 రోజులైనా దయతో కేటాయించమని, ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా మంత్రులకు విన్నపాలు పెట్టాము. అది జరగక పోగా, చీరాల అధికారులనే తన కోసము, ఒంగోలు పిలవడము, ప్రజలు విస్తుపోతున్నారు.

చీరాల వాసుల దైవాలు, అందుబాటులో ఉన్న అధికారులను, ఈ కరోనా పరిస్తితి లో, ఇలా గంట దూరము పిలవడము ప్రజలకు అందుబాటులో లేకుండా భావ్యము కాదని, అధికారుల ఆరోగ్యమును వారి కుటుంబాలను పరిగణలోకి తీసుకుని, ఎమ్మెల్యే గారే చీరాల రావడము లేదా, ఆన్లైన్ మీటింగ్ పెట్టడము మంచిదని, పలువురి భావన.

ఆరోగ్యము బాగోక పోతే, ఇన్ని రోజులు వాయిదా పడ్డది, ఇంకొన్ని రోజులు ఆగుతుంది. అసలు ఎమ్మెల్యే ఊళ్ళో ఉంటే, ఈ బాధలు ఉండవు అని పలువురి అభిప్రాయము.

మన రాజన్న, జగనన్నలు కూడా, తమ బిడ్డలు బంధువులను, అధికార కార్యక్రమాలకు దూరము గా పెట్టి, బంధు ప్రీతి లేదు అని, అలాగె, అధికార జోక్యము లేదు అని, నిరూపించారు. కాబట్టి నాయకుల పిల్లలు కూడా, అధికారుల సమీక్షలలో వేలు పెట్టకుండా, ఆదర్శము గా ఉండాలి అని పలువురి కోరిక.

---

సుతిమెత్తగా విమర్శలు చేసినా కూడా, నాయకులు మరియు అధికారులు ఆరోగ్యం ముఖ్యం. వెంటనే పలికే మంచి అధికారుల నాయకుల క్షేమం, అందరం కోరాలి కోరుతాము. అలాగే వారు జవాబు ఇస్తే, దానిని ప్రజలకు తెలియజేయడం, మా బాధ్యత.

అందరికన్నా గట్టిగా, నాయకులు అధికారులు ది తప్పు లేదు, ఎన్నుకున్న ప్రజలదే తప్పు అని ఎప్పుడూ చెపుతున్నాము. గమనించాలి.

ఉదాహరణకు ఈ ఆర్టకల్ లో చెప్పిన వాటికి సంబంధించిన అధికారులు నాయకులు వివరణలు ఉంటే, పబ్లిష్ చేస్తాము. ఇవి ఉదాహరణకు మాత్రమే సుమా, మనకు జవాబు రాలేదు.

1. ఎమ్మెల్యే గారు చీరాలలో నే వాస్తవం గా ఉంటున్నారు , ఇవిగో అడ్రసు ఫోటోలు

2. ఎమ్మెల్యే గారి అబ్బాయి అధికారులు సమీక్షలు లో ఏనాడూ పాల్గొనలేదు వేలు పెట్టలేదు. అవాస్తవం

3. కరోనా బస్సు అక్కడ నే ఉంది , ఇదిగో లింకు, డైలీ చీరాల సంజీవని బస్సు స్టేటస్

అలాంటి వి వారు చెప్పిన, వెబ్సైట్ లో పెట్టగలము.

అంతిమంగా, చీరాల ప్రజలకు మంచి జరగాలి, గుంటూరు ఆసుపత్రికి పరుగులు లేకుండా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,948; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185
Dt : 23-Sep-2020, Upd Dt : 23-Sep-2020, Category : Politics
Views : 781 ( + More Social Media views ), Id : 720 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : review , chirala officers , mla , karanam , ongole , health , invisible , sanjeevini bus
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content