APLatestNews.com top Banner

Social Media links
మహాలయ పక్షాలు - పితరులు సంస్మరణ - వీలైన పద్దతిలో గౌరవించడం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మహాలయ పక్షాలు(పితృపక్షము) లో పితరుల రుణం తీర్చుకోవాలి. పితరులు అంటే తల్లి దండ్రులు, తాత ముత్తాతలు, అమ్మమ్మ నాయనమ్మ లు. గతించిన ముందు తరాల వారు అందరూ.

వారి భిక్షే, ఈరోజు మనము అనుభవిస్తున్న సంపద లేదా తెలివి తేటలు. మాత్రు దేవోభవా, పిత్రు దేవోభవా అంటారు కదా, వారి రుణం తీర్చుకోవాలి, క్రుతజ్ఞతతో.

పితృయఙ్ఞం చేసిన పిల్లకు అన్ని మంచి జరగాలి అని ఆనందంగా ఉండాలనీ, పెద్దలు దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారిని కోపముతో, బాధతో శపిస్తారు అని కూడా అంటారు.

ఇప్పుడే ఆదివారం, పొద్దున్నే తలస్నానం చేసి, దీపారాధన, రోజూ లాగే పూజ, వారిని కన్నీళ్ళతో తలచుకొని క్రుతజ్ఞతతో నమస్కరించి, కొబ్బరికాయ కొట్టి, బెల్లపన్నం నైవేద్యం పెట్టి( అరటిపండు ), పూజ పూర్తి చేసుకున్నాము. తర్వాత పక్కన ఉన్న ఓ రెండు కుటుంబాలకు ప్రసాదం, పండ్లు ఇచ్చాము. తర్వాత కాకి, పిచ్చుక, పిల్లి, ఏదో ఒక జీవి వచ్చి తినాలని బయట కొంచెము అన్నము/ ప్రసాదము.

ఓపిక ఉండి అందుబాటులో ఉంటే, పూజారితో మంచిగా క్రతువు చేయించుకోవచ్చు. దగ్గర వారిని పిలిచి భోజనం పెట్టవచ్చు, గారెలు, పిండి వంటల తో. వీలును బట్టి బీదలకు/ అవసరమైన వారికి దానాలు లేదా గుడిలో జమ చేయవచ్చు. ఏదైనా కనీస మాట దానం , రూపాయ దానం వస్తు దానం , అన్నదానం, వెనక్కు ఆశించకుండా. ఇక్కడ పెద్దల మీద మనసు, ప్రేమ, గౌరవం ముఖ్యము. ప్రాంతాలను బట్టి, కొన్ని సాంప్రదాయాలు మారుతాయి.

సాధారణముగా పెద్దలకు, వారు స్వర్గస్తులైన తిధి గుర్తుపెట్టుకొని చెయ్యాలి. కాని, ఈ రోజులలో అంత సమయము కాని గుర్తు కాని ఉండటము లేదు. వారందరి కోసమే, ఈ మహాలయ పక్షాలు.

ఈ 15 రోజులలో, భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు, మన వీలును బట్టి, మన పెద్దలను తలచుకొని, నైవేద్యము పెట్టవచ్చు ఎవరికి కుదిరిన పద్దతిలో వారు. తిధి, నక్షత్రాలతో పని లేదు. మనకు స్నేహితులకు, గురువులకు కూడా పెట్టుకోవచ్చు. అలాగే గతించిన భార్య, భర్త, పిల్లలకు కూడా.

పాత పద్దతులు అంటారు, నాగరికత విపరీతముగా పెరిగి చేసే ఓపికల లేదు. కాని, మన పెద్దలు పెట్టారు అంటే, దాని వెనక చాలా కధ ఉంటుంది. సరే, నమ్మకపోయినా, కనీసం మనమే కదా అవి తినేది చివరకు. నష్టము లేదు.

పక్కవారితో పంచుకుంటే, ఇరుగు పొరుగుతో బాగుంటాము కదా. ఆ మనము పెట్టినవి వారికి చేరతాయా? ఏమో మనకు నష్టము లేనప్పుడు, చేస్తె ఇబ్బంది ఏముంది?

చూడండి, అమెరికాలో డాలర్లు వేస్తే అక్కడ బాంక్ లో, ఎక్కడో వేరే దేశములో ఉన్న తమ బంధువులకు రూపాయలలో బాంక్ చేరింది లేదా పోస్ట్ మాన్ తెచ్చి ఇస్తున్నాడు కదా? ఆదివారము మంచిది, అమావాస్య మంచిది, రెండూ కలసి వస్తే ఇంకా మంచిది.

కానీ, పక్షం రోజులూ అనుకూలమైనవే. తమ సంతానము, తమని తలుచుకుంటున్నారో లేదే అని పితరులు ఎదురు చూస్తారు అంటారు. అలాగే వారు వేరే జన్మ ఎత్తినా కూడా, మనము చేసే ఈ పని, వారికి శక్తిని సంపదను ఇస్తుంది అంటారు.

మరి మీ పెద్దలు, తాతలు మీకు ఇంకా ఎక్కువే చేసి ఉంటారు, మీరు వారికి ఈ అమావాస్య లోపు, మా కన్నా గొప్పగా, వారిని తలచుకుంటారు అని ఆకాంక్ష.

తల్లి దండ్రులు ఇద్దరూ బతికి ఉంటే వారికీ గుర్తు చేయండి, తాత లకు పెట్టమని, మతి మరుపు తో మరువచ్చు.మనమూ పెట్టవచ్చు. వారి లో ఒకరు లేకపోతే , మనం తప్పకుండా పెట్టాలి. ఆస్తి పంపకాలు జరిగితే, అందరూ పెట్టాలి.

పిల్లల కు, మిత్రులు కు, బంధువులు కు తమ పెద్దల గురించి మననం. మనస్పూర్తిగా తలచుకోవాలి, వృధా నటన కాసేపు ఆపి , ఎందుకంటే పైన ఉన్న వారికి మన బుద్ధి తెలుసు.

బతికి ఉన్న తల్లి దండ్రులకే ముద్ద పెట్టము, ఇంక పోయిన వాళ్ళకా? మావల్ల కాదూ అనే వాళ్ళూ ఉన్నారు. కృతఘ్నుడు ని కాకి కూడా ముట్టదు. రేపు మన పరిస్తితి అదే. మరువకు సుమా , అని గోపి, రాముతో చెప్పాడు.

The performance of Shraddha by children(or relatives/ friends to friends/ students for Guru) during Pitru Paksha is regarded as compulsory by Hindus, to ensure that the soul of the ancestor goes to heaven.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 15-Sep-2019, Upd Dt : 15-Sep-2019, Category : General
Views : 366 ( + More Social Media views ), Id : 166 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Pitri paksha , mahalaya paksha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content