అనంత చంద్రుడి తేజం కు కారణం ఏమిటి, ప్రకాశం సూర్యుని కి లేనిదేమిటి? చెప్పగలరా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,238; 104 తత్వాలు (Tatvaalu) and views 225,902.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* చంద్రుడు ఎప్పుడూ వెన్నెల ను విరజిమ్ముతూ ఉంటారు, కనీసం 15 రోజులు కు అయినా. అందరికీ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి వారికి, జనరంజకంగా ఉంటుంది.

కొంత క్షీణించినా, మరలా ఖచ్చితంగా 15 రోజుల లో, శక్తి పుంజుకుంటారు. వెలగడానికి కావలసిన శక్తి, మనసు నుంచి దైవం నుంచి అందుతూనే ఉంటుంది.

దొంగలు, అలాగే దొంగ వ్యాపారం చేసేవారు కు, చంద్ర కాంతి వెలుగు పడదు, చాల ఇబ్బందిగా కష్టము గా ఉంటుంది. ఎందుకంటే దట్టంగా చుట్టుపక్కల అమావాస్య చీకటి అలుముకుని ఉంటేనే, వారి తప్పుడు పనులు, నిరాటంకంగా సాగుతాయి.

ప్రజలను ఇంకా ఎక్కువ, మాయ మోసం చేయగలరు. అందుకే వారికి, చంద్ర కాంతి వద్దు, సమస్తం చీకట్లో మగ్గాలి. తమ దొంగ వ్యాపారాలు, కుల తగాదాలు, పెత్తందారీ వ్యవస్థ హాయిగా నడవాలి.

* భాస్కరుడు అంటే సూర్యుడు కూడా, తన తేజోవంతమైన శక్తి తో, బ్రహ్మాణ్డం ను ఉత్తేజ పరచాలి. అది తన సహజ లక్షణం.

కానీ చెడ్డ నాయకులు అనే, కారు చీకట్లు చుట్టూ కమ్మాయి, అప్పుడు సూర్యుడు కు కూడా, ప్రపంచం బాధ కనపడదు వినపడదు. ఆ అనంత శక్తి కూడా, ఆ కారు మబ్బుల చాటున దాగి, ఒదిగి ఉంటుంది.

ఆ నిస్తేజ స్ధితి వలన ప్రపంచం కు ఉపయోగం లేదు, సూర్యుని శక్తి కూడా వృధా. కనీసం కారు మబ్బులు కు కూడా, ఉపయోగం లేదు, తర్వాత అయినా భంగ పాటు తప్పదు. కానీ గర్వంగా మబ్బులు అనుకుంటాయి, మేము ఏదో సాధించామని, ప్రజలను ఇబ్బంది పెట్టి వారి కన్నీళ్ళతో.

కానీ ఒక్క సారి, కారు మబ్బులు అడ్డు తొలగగానే, సూర్యుని కి తన బాధ్యత గుర్తు రాగానే, మరలా ప్రచండ శక్తి తో, తన జగత్తు కార్యాన్ని, విజయవంతం గా బాధ్యత గా నిర్వహిస్తారు.

* ఎవరు చంద్రుడు? అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు గారు. తనకు బాధ్యత, కృతజ్ఞత, లక్ష్యం, నిజాయితీ, నిబద్ధత ఉంది.

తాను 2 సోషల్ మీడియా ఎకౌంటు లు నడుపుతూ, జిల్లా అధికారులు అందరి చేత నడిపిస్తూ ఉన్నారు. జగనన్న ఖ్యాతిని, పధకాలు అమలు ను, తన ఉద్యోగ బాధ్యతలను, రోజూ వినయంగా, మనందరికీ తెలియజేస్తున్నారు.

గ్రామ పట్టణ అధికారులు చేత కూడా, బాధ్యత గా సోషల్ మీడియా, చేయించమని గతంలో కోరాము, ఇంకా జవాబు రాలేదు.

మీ లేదా మా, మిగతా జిల్లా లలో సోషల్ మీడియా వస్తే, దయచేసి లింక్ పంపగలరు.

అది ఇష్టం లేని నాయకులు, పూర్తిగా అనంతపురం ను అమావాస్య చీకట్లు లో నింపాలని, తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, చేస్తారు. మనం గతంలో కూడా అడిగాము, వ్యక్తి గత సమస్యలు వద్దు. అధికారిగా తప్పులు ఉంటే, రుజువు లతో ప్రకటించండి, మేమూ స్వాగతిస్తాము అని.

* ఎవరు సూర్యుడు? ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ గారు. కారు మబ్బులు అనే చెడ్డ నాయకులు వెనక ఉండి, ఏ ఒక్క పనీ సరిగ్గా, ప్రజలకు ఉపయోగకరముగా చేయలేకపోతున్నారు. బాధ్యత నిబద్ధత ఏదీ, సోషల్ మీడియా లో కనపడవు, రేపు మరలా కనపడని వార్తా పేపర్లు లో తప్ప. ప్రభుత్వ సోషల్ మీడియా నే లేనప్పుడు, ఇక సొంతంగా తన గురించి తాను చెప్పేదేముంది?

గతంలో వివరంగా ఆయన బాధ్యత లు గుర్తు చేస్తూ కధనాలు రాశాము. ఆ లింక్ లో ఉన్నవి, ఈ సమాచారం అన్ని జిల్లాల అధికారులు కు ఉపయోగపడుతుంది. ఆయన లేదా ఇతర జిల్లా కలెక్టర్ లు మంచి పట్టించుకోరు, ప్రజలకు జవాబు చెప్పరు. సరిగ్గా అమలు చేయరు. link.

అలాంటి బాధ్యత లేని అధికారులు ను బదిలీ చేయాలి, రెండు ఏళ్లుగా.

కానీ కారు మబ్బులు కాపాడుతూ, తమ చాటున ఉంచి, ఆయన ఆత్మాభిమానం ను ప్రతిష్ట ను దెబ్బతీస్తూ, తమ ప్రతిష్ట ను కోల్పోతూ, జగనన్న కు, అలాగే ప్రజా ప్రభుత్వం కు అన్యాయం చేస్తున్నారు 2 ఏళ్ళు గా, సోషల్ మీడియా అప్పి తిరిగి మొదలు పెట్టకుండా.

ఇప్పుడు అయినా, పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మేల్కొని, ప్రకాశం జిల్లాలో కారు మబ్బులు చాటున దాగిన సూర్యుని, కాపాడి నచ్చ చెప్పి, బయటకు తీసుకుని రాకపోతే, ప్రజలకు సంక్షేమం సంతోషం సమాచారం అందదు, ఇంకో 3 ఏళ్ళు, అంధకారమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,238; 104 తత్వాలు (Tatvaalu) and views 225,902
Dt : 29-Apr-2021, Upd Dt : 29-Apr-2021, Category : Politics
Views : 792 ( + More Social Media views ), Id : 1140 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reason , brightness , ananta , chandrudu , moon , prakasam , bhaskar , collector , sun , balineni , magunta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content