నిమిషంలో 7 పేపర్లు వార్తలు ఒకే చోట, ఎంత సమయం మిగులుతుంది మనకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,634; 104 తత్వాలు (Tatvaalu) and views 225,612.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గుర్తు ఉందా ఓ రెండు ఏళ్ల క్రితం, ఈ సైట్ లో వార్త బిట్స్ లింక్ ( న్యూస్ టెక్స్ట్ -> న్యూస్ బైట్స్ - > గూగుల్ న్యూస్ ) పంపాను. న్యూస్ పేపర్ తో పని లేదు. లింకు గుర్తు ఉంచుకోండి. అన్ని పేపర్ల వార్తలు సింగిల్ లైన్లు లో చదివి, అది నచ్చిన, వార్త లింక్ తాకితే, ఓ మొదటి పేరా చదవచ్చు. అదీ నచ్చితే, ఆ పేరా చివర, లింక్ తాకితే పూర్తి వార్తలు చదవవచ్చు.

ఈ ఒక్క పేజీ లోనే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, మిగతా అన్ని పేపర్లు, లేటెస్ట్ ముఖ్య వార్తలు వస్తాయి. ప్రతి 3 నుంచి 5 గంటలకు మారతాయి, రిఫ్రెష్ చేస్తే లేదా మరలా ఆ లింక్ తాకితే. ఆన్లైనా మజాకా మరి?

బయట న్యూస్ పేపర్ తాకితే, ఏమౌతుందో అని భయం వద్దు అంటున్నారు జనం. ఎలా సర్ది చెప్పాలో తెలీక, పేపర్ వాళ్ళు తలపట్టుకున్నారు. ఆన్లైన్లో చూస్తే, జేబు ఖర్చు వద్దు, పక్కవారు ఎవరినీ పేపర్ కోసం అడగవల్సిన పని లేదు కదా.

ఇంక కాగితము ప్రింట్ న్యూస్ పేపర్లు బతకడం కష్టం, జర్నలిస్ట్ లకు గడ్డు రోజులే. పేపర్లు ఉండి కూడా, ఏదో ఒక పార్టీ కి కొమ్ము కాస్తున్నాయి, ప్రజలకు నీతి గల అధికారులు కు తప్ప, అంటున్నారు జనం మరి. మరి కాలమే జవాబు చెపుతుంది.

ఈ సైట్ లో వార్తా బిట్లు లింకు కొట్టి చూడండి. డబ్బు ఉన్నా 5 పేపర్లు కొనలేము. కొన్నా, గంటలు గంటలు చదవలేము, నిమిషంలో 7 పేపర్లు వార్తలు ఒకే చోట, ఎంత సమయం మిగులుతుంది మనకు.

ఒక్కోసారి నవ్వు వస్తుంది, పక్కన పక్కనే వేరు పేపర్లు వార్తలు లైన్లు చూస్తే. ఇవి కేవలము ఉదాహరణకు మాత్రమే చూడండి, నిజము కాకపోవచ్చు.

వార్త 1 - ప్రభుత్వం మంచి బియ్యం సరఫరా చేస్తోంది, జనం ఆనందం - అనుకూల పత్రికలు

ముక్కిపోయిన బియ్యం తినలేక కడుపు నొప్పి తో బాధలు - ప్రతికూల పత్రికలు

వార్త 2 - పింఛను ఇంటికి తెచ్చిన వాలంటీర్, జనం సంతోషం - అనుకూల

ఫించన్ అందక, వాలంటీర్ కనపడక, ఆర్తి గా ఎదురు చూస్తున్న జనం - ప్రతికూల

వార్త 3 - రాష్ట్రం ను ముందుకు తీసుకుని పోతున్న జగనన్న - అనుకూల

రాష్ట్రం ను అధోగతి పట్టిస్తున్న జగన్ - ప్రతికూల

రేపు ఒకవేళ, చంద్రన్న వస్తే, ఇటువైపు రివర్స్, అలాగే అటువైపు రివర్స్ అవుతుంది.

ఇది అన్ని చోట్లా ఉన్నదే, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రము లో అయినా. మన ఇళ్ళు లో లేవా, రెండు నాలుకలు, రెండు మాటలు. మనకు నచ్చిన, పిల్లాడు బుద్ధిమంతుడు. నచ్చకపోతే లేదా అడిగింది ఇవ్వకపోతే, ఛీ పాడు పిల్లాడు, అందరితో తగవులే. అవ్వ, అలాగే వ్యవస్థ లు అంతే కదా మిత్రమా

వార్త 4 - ప్రజల రక్షణ ముఖ్యం, వెంటనే చర్యలు తీసుకోండి, ముఖ్యమంత్రి కేసీఆర్ - అనుకూల

ప్రజా దైవ సచివాలయం గిట్టని కేసీఆర్, నిర్లక్ష్యంగా సొంత ఫార్మ్ హౌస్ నుంచే, అర్ధరాత్రి ఆదేశాలు జారీ - ప్రతికూల

వార్త 5 - చికెన్ తినండి ఇలా నాలా, మీకేమీ కాదు, మాది హామీ - కేటీఆర్ - అనుకూల

ఫౌల్ట్రీ పరిశ్రమ తో కుమ్మక్కు, ప్రజల ప్రాణాలు గాలికి వదిలిన, కేటీఆర్. సామాన్య జనం కు కార్పోరేట్ వైద్యం దొరుకుతుందా - ప్రతికూల

అంటే ఏది నిజమో , ఏది అబద్ధాలో తెలీక జుట్టు పీక్కుంటున్న జనత. సరెలే పోనీ ఇంగ్లీషు పత్రికలు, నేషనల్ లెవల్ లో చూద్దాం అంటే, ఇవి చూడండి, గుండె దిటవు చేసుకుని.

వార్త 6 - కాశ్మీర్ లో ప్రశాంతత, మెచ్చుకుంటున్న ప్రపంచం - అనుకూలం

కాశ్మీర్ లో అణిచివేత, నిర్భంధం, దుమ్మెత్తి పోస్తున్న ప్రపంచం - ప్రతికూలం

వార్త 7 - టెర్రరిస్టులు పై ఆకస్మిక దాడి, కాంపులు ధ్వంసం అన్న ప్రధాని - అనుకూలం

ముందస్తు హెచ్చరికలు లేకుండా, అర్ధరాత్రి పిల్లల, మహిళలు ను, ప్రకృతి ని నాశనం చేసిన బలగాలు - ప్రతి కూలం

ఇవి చూసి మతి పోయి, ఇంక చొక్కాలు చింపుకుని, ఛీ జీవితములో ఇక మేము, ఏ వార్తలు పేపర్లు చూడమని ప్రజలు అనుకుంటే మరియు నిజముగానే చూడకుండా ఉంటే, మరుసటి రోజు పేపర్లో,

ప్రభుత్వం పత్రికల ద్వారా ఎంత మొత్తుకున్నా, రోడ్లు పైకి వచ్చిన జనం, లాఠీచార్జి తో మరలా ఇంటికి పంపిన నగర పోలీసులు

అంటే పేపర్ చూసినా తలనొప్పే, చూడకపోయినా తలనొప్పే. కాబట్టి, తప్పు ఎవరిది, మనదా, ప్రభుత్వం, పేపర్ వాళ్ళదా? వారెవ్వరిదీ కాదు. మనదే? నమ్మము కదా?

ఎందుకంటే మనం అమ్ముడు పోయి, మత్తులో ఓటేశాం కదా? ఇంట్లో నిద్ర పోయి, అసలు ఓటు కూడా వేయలేదు కదా? మన కులం, వర్గాల వారికే వేశాం కదా, మంచి చెడు చూడకుండా? మనం మారనంత కాలం, వారూ లేదా ఎవరూ మారరు,. మారలేరు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,634; 104 తత్వాలు (Tatvaalu) and views 225,612
Dt : 27-Mar-2020, Upd Dt : 27-Mar-2020, Category : General
Views : 1169 ( + More Social Media views ), Id : 450 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , english , news papers difficult time , double standard
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content