గురువులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. తెలుగు లో శుభాకాంక్షలు మరియు అరిషడ్వర్గ సాధన ఆచరణలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,330; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గురువులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అందరికీ తెలుగు లో సొంతముగా శుభాకాంక్షలు మరియు మన అరిషడ్వర్గ సాధన ఆచరణలో చెపుతారు కదూ, కన్న తల్లి మీద క్రుతజ్ఞతతో.

మన మంచి గుణములు, విశ్వసనీయత క్రుతజ్ఞత సత్వగుణం, బయటపడటానికి అదొక మార్గం కూడా సుమా.

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామ నామ వరాననే. మానవుడే మాధవుడు, సాత్విక గుణముల ఎలా ఉండాలి అని, ఆ పరంధాముడే, మనిషిగా వచ్చి, ఆచరణలో చూపించి, మనకు మార్గ నిర్దేశకం చేసి వెళ్ళారు.

ఆ మార్గాన్ని వదలి, హేళన చేసి, కరోనా వంటి వాటితో గాలిలో తేలికగా కలసిపోతున్నాము, మనపై అధారపడిన వారిని పాతాళానికి పడేసి.

రామా అని పలికితే చాలు, తనువు పులకరిస్తుంది. అలాంటి ఉత్తముడు, తమ పుత్రుని గా (విశ్వామిత్రునితో దుష్ట శిక్షణకు అడవికి పంపే తండ్రి గా మనం ఉండాలి), అన్న గా (భరతుడిలా అన్న చెప్పుల తో రాజ్యం చేసే మంచి మనలో ఉండాలి), భర్త గా (మరి భార్య, సీత లాగా అడవికైనా సిద్దముగా మనం ఉండాలి), నాయకునిగా (హనుమాన్ లాగా రమ సేవకుడిగా నిశ్వార్ధముగా మనం ఉండాలి) పొందాలని, సాత్విక మనసులు పరితపిస్తాయి. వారికి అలాంటి వారే, ఖచ్చితము గా దొరుకుతారు.

చూడండి అమ్మకు 8 ఏళ్ళుగా, మనము మధ్యతరగతి కుటుంబము అయినా కూడా, ప్రపంచ ఉత్తమ వైద్యం అందుతుంది కదా? 3 ఏళ్ళు పైగా రూపాయి ఆదాయం లేకపోయినా, తల్లి సేవలో వైద్యములో, ఒక్క చిన్న లోపము లేదు కదా? ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కదా?

సకల గుణాభి రాముడు, అయోధ్యా పురి వాసుడు, రారాజు కూడా. రాజ పదవిని, క్షణము లో కేవలము, తండ్రి మాట కోసము త్యజించారు. అడవికి వచ్చి, ఆఖరుకు కైక మరియు భరతుడు వెనక్కు రమ్మని అడిగినా బతిమాలినా, రాలేదు. మరి మనకు ఆ గుణాలు ఉన్నాయా?

మంచి గుణము ఎలా తెలుస్తుంది, ప్రతి మనిషిలో? ఖచ్చితము గా తెలుస్తుంది, కానీ మనము చూడటానికి ఇష్టపడము, ఎందుకంటే, మనకు ఆ లక్షణాలు లేవు, ఇతరులకు మంచి గుణము ఉంటే, వారిని పిచ్చి వారి కింద, జమ కట్టి, దూరముగా ఉండి, మన పతనమును పరిపూర్ణముగా పూర్తి చేస్తాము.

పాత రోజుల్లో, రాజు అయినా సరే, అదే మంచి గుణాలు ఉన్న వ్యక్తి కి ఏ కష్టము వచ్చినా, అన్ని సమకూర్చి మమ్మల్ని కనికరించమని స్వీకరించమని, ధనవతులతో సహా, బతిమాలి, ఇచ్చేవారు.

ఎందుకంటే, ఆ సహాయము, తమ వంశ పాపాలను, కొంతైనా తగ్గిస్తుంది, అలాగే అతని ఆలోచనల వలన, మనము కూడా మంచి పాటించి, మోక్షము పొందుతామని వారి మంచి భావన.

మరి మన మంచి, మన రాత మాటల్లో, పలికే పలుకులో, పాడే పాటలో, నడిచే నడతలో, పది మందిని పలకరింపులో, పెద్దల సేవలో మర్యాదలో పలకరింపులో, సజీవ గురువులు ముదుసలి తల్లి తండ్రుల సేవలో, తాము చేసే మంచి పనులలో, పదిమందికి మంచి పంచే ప్రయత్నములో, స్పష్టముగా ప్రతి రోజూ, కనపడుతుంది.

కాని వ్యామోహములో మనము వాటిని గమనించము. ఎందుకంటే, కలి కి బద్దులమై, అరిషడ్వర్గాల బానిసత్వములో, చెడునే మంచి గా, బ్రమ పడి, చెదల వలే, కష్టాల అగ్నికి ఆహుతి అవుతూ, పతనము అవుతున్నాము.

మనము మంచి వారమైతే, ఆదిశంకరులు, రామానుజులు, బ్రహ్మం, వేమన, రాఘవేంద్ర లాగా, స్వార్ధం వీడి, పదిమంది తో, మన మంచి చెబుదాం, ఆచరణలో చూపుదాం, ఆదర్శము గా ఉందాం. రాముని క్రుప పొందుదాం.

మరి శ్రీ రామ నవమి కి, లవకుశ పద్యాలు, ఇతర పాటలు బిగ్గరగా పాడి వినిపిద్దాం. మన పిల్లలు, మాయలో పడకుండా, రామ నామం కాపాడుతుంది మిత్రమా..

1. ఇంతకు బూని వచ్చి - లవకుశ, లక్ష్మణుడు. అపవాదభుషిత - సీతమ్మ, ఇదే మన ఆశ్రమము - వాల్మీకి పద్యం
2. సీతా రాముల కల్యాణము చూదము రారాండి
3. ఎన్నాళ్ళు వేచేను ఓ రామా
4. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ

మీరు ప్రయత్నం చేయగలరు. పాటల లింక్ లో వాట్సాప్ స్టేటస్ లో మరియు వెబ్సైట్, సోషల్ మీడియా లో, మొన్న లింక్ లు ఇచ్చాము కదా.

మా దేవుని దయచేసి నమ్మండి, అని హైందవుల ఇళ్ళ వెంటపడే ప్రాధేయ వారికి, మా దేవుని నమ్మకపోతే మీకు బతికే యోగం లేదు అనే వారికి, మతాలు మార్చేవారికి మారేవారికి, ఇలాంటి వి తెలీదు, బుర్రకు ఎక్కదు. సీతమ్మ లాంటి తల్లి గురించి వారు చెప్పరు చెప్పలేరు. ఎందుకంటే, మతం మార్చడం అంటే, మన తల్లిని మార్చడమే, అంటే మూర్ఖత్వమే కదా అంటే, వారు అంగీకరించరు, వారు ఏదైనా ఇలాగే మాలో మాయతో మారుస్తారు.

shri Rama Navami wishes to Gurus. Greetings in Telugu and our Arishadvarga practices details  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,330; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144
Dt : 08-Apr-2022, Upd Dt : 08-Apr-2022, Category : General
Views : 498 ( + More Social Media views ), Id : 1335 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ramanavami , greetings , rama , telugu , sita , arishadvarga , character , practice , guna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content