ప్రజలకే రిపోర్ట్ చేస్తున్న ప్రధాని మోదీ, సీఎం జగన్, డీజీపీ - మరి ప్రకాశం కలెక్టర్ మరియు అధికారులు? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,936; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ప్రజాస్వామ్యములో, ప్రజలే ప్రభువులు. అధికారులు మరియు మంత్రులు అందరూ, ప్రజా సేవకులు. వీరంతా కూడా, ప్రజలు కట్టే పన్నులతో నే, పెద్ద జీతాలు తీసుకుంటూ సర్వ సౌకర్యాలు అనుభవిస్తూ, ఉద్యోగాలలో మరియు పదవులలో ఉన్నవారు. అంటే, వారు తినే ప్రతి గింజ లో కూడా, ప్రజల పైన అభిమానము ప్రేమ దయ క్రుతజ్ఞత ఉండాలి. మా యజమానులు ప్రజలే. అందుకే మోడీ గారు అన్నారు, నేను చౌకీదారుని మాత్రమే అని. అంటే ధర్మ కర్త లా ఒక కాపలా దారుని మాత్రమే అని. ఎంత మంచి గొప్ప మనసు ఉంటే, ఆ మాటలు గుండెల్లో నుంచి వస్తాయి.

అందుకే పెద్దలు ముందు తాము ఆచరించి తమ కింద అధికారులకు మంత్రులకు ఆదర్శ ప్రాయము అయ్యారు. తమ రోజు వారి పనిని, నేరుగా ప్రజలకే రిపోర్ట్ చేస్తున్నారు. తమ సిబ్బంది త్యాగాలను పొగుడుతున్నారు ధైర్యం కలిగిస్తున్నారు, తమ సొంత సోషల్ మీడియాలో, పేపర్, టీవీలు ఉన్నా కూడా. మన భారత ప్రధాని మోదీ, సీఎం జగన్, ఆంధ్రా డీజీపీ, ప్రకాశం ఎస్పీ గార్లు , మొదలుగు వారు, సవినయముగా, ప్రజలకు, తమ సిబ్బంది త్యాగాలను చెపుతున్నారు.

PMOIndia , PMO Report , Narendra Modi , YS Jagan , AP DGP , Andhra Police , Prakasam Police - Daily updates for public

మరి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు (Sri Pola Bhaskar., I.A.S., Collector and District Magistrate) మరియు ఇతర ప్రకాశం అధికారులు అంటే రెవెన్యూ, పంచాయితీ, మున్సిపాలిటీ, హెల్త్, డీఎస్పీ స్థాయి పొలీస్ డిపార్ట్మెంట్ అధికారులు. అంటే ఆర్డీవో, తహ్సిల్దారు, మున్సిపాలిటి కమీషనర్, ఎంపీడీఓ, ఎండీవో, గ్రామ సెక్రెటరీ గారు, మండల పట్టణ గ్రామ హెల్త్ ఆఫీసర్, డీఎస్పీ, సీఐ కూడా, ప్రజలను గౌరవించి ప్రేమించి, బాధ్యతగా, రోజూ ప్రజలకు సోషల్ మీడియాలో, కరోనా లేదా సాధారణ పరిపాలనలో ఉన్న జాగ్రత్తలు మార్పులూ చెపుతున్నారా?

తమ నాయకత్వములో అధ్వర్యములో, పని చేసే సిబ్బంది త్యాగాలను, ప్రజలముందు పెడుతూ, వారి సిబ్బంది శ్రమను తెలియచేస్తున్నారా? ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా ఉండాల్సిన అధికారులు, తమ సొంత లేదా ప్రభుత్వ సోషల్ మీడియాను వాడి, కింది అధికారులకు మార్గదర్శకము కారా?

జిల్లాకు కలెక్టర్ అంటే ప్రధమ పౌరుడు, జిల్లా మెజిస్ట్రేట్ గారు. భారత ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము కూడా, ఆయనను నమ్మి, గురుతరమైన బాధ్యతను అప్పగించాయి.

కలెక్టరు గారు, ప్రజలు మరియు అధికారులకు తండ్రి వంటి వారు. కాసేపు ప్రజల క్షేమము మరియు డైలి స్టేటస్ రిపోర్ట్ గురించి పక్కన పెడితే, కనీసము తన దగ్గర మరియు తన నాయకత్వములో పని చేసే, అధికారులను అభినందించాలి ఈ కష్ట సమయములో, ప్రజల అందరి ముందు, సోషల్ మీడియా లో.

కన్న తండ్రి, బిడ్డల గొప్పను తాను చెప్పకపోతే, బయట వారు ఎవరు ఎందుకు చెపుతారు? ఒంగోలు ఆర్డీవో గారు బాగా పని చేస్తున్నారు, అని సోషల్ మీడియాలో వారు చెపితే బాగుంటుంది కదా. ఆ సిబ్బంది కూడా, ఆనందపడతారు కదా, ఇంకా గొప్పగా పని చెస్తారు కదా. చాటుగా ఆఫీస్ లో అభిందించడము వేరు, సోషల్ మీడియాలో వేరు. ఆ పని, తోటి కలెక్టర్లు మరియు ఇతర అధికారులు చేస్తున్నారు, ఎవరెవరితో మీటిగులు జరిగాయో, ప్రజలకు నివేదిస్తున్నారు కూడా.

Guntur Collector , E Godavari Collector , Kadapa Collector , E Godavari Press Release - Daily updates for public

అలాగే ఒంగోలు ఆర్డీవో గారు కూడా, చీరాల, పర్చూరు మరియు వేటపాలెం తాహ్సిల్దారు ఇంత కష్టపడుతున్నారు, అని చెపితే బాగుంటుంది కదా సోషల్ మీడియాలో. అలాగే చీరాల తాహ్సిల్దారు గారు, తమ తోటి ఉద్యోగులు లేదా సిబ్బంది త్యాగాలను చెప్పాలి. అలాగే చీరాల డీఎస్పీ గారు, తమ సిబ్బంది గురించి గొప్పగా చెప్పాలి ఫోటోలు, వీడియోల తో సహా. అది ప్రజాస్వామ్యము యొక్క గొప్పతనము. ప్రజలు కూడా, అయ్యో ఇన్ని పనులు చేస్తున్నారు మన కోసము అని సంతోషిస్తారు, సహకరిస్తారు.

మరి మన జిల్లా కలెక్టర్ గారి ఫేస్బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్ లు ఏవీ పని చేస్తున్నట్లు గా లేవు, రోజూ వారి కార్యక్రమములను ప్రజలకు నివేదించడములేదు. ఇక కింద సిబ్బంది నుంచి సోషల్ మీడియా అప్డేట్లను ఆశించగలమా? గూగుల్ లో మాకు దొరకలేదు, వేరే లింక్ లు ఉంటే, మీరు ఇవ్వగలరు.

Prakasam Collector - Twitter , Facebook , Press Release - No updates after Aug, 2019

తమ సిబ్బంది త్యాగాలను, శ్రమను అధికారకముగా తామే తెలిపి, మిగతా వారిని కూడా అలాగే చేయమని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.

పాత రోజుల్లో పేపర్, టీవీల పై ఆధారపడాలి. కానీ నేడు, సొషల్ మీడియా పేజీలు ఉచితము, వాడటము తేలిక. మరి, ప్రజా సేవకులైన అధికారులు, ఈ ఉచిత తేలిక పద్దతిలో, ప్రజలకు తాము తమ సిబ్బంది చేస్తున్న, ప్రభుత్వ లేదా సొంత సోషల్ మీడియాను వాడుతూ, మంచి గురించి వివరించరా?

ఈరోజుల్లో సోషల్ మీడియాను వాడుతూ దానిని ఉపయోగించి, పదవ తరగతి పిల్లలు కూడా ఫోటోలు, మెస్సజ్ లు పెడుతున్నారు. అధికారులు నేర్చుకోవడం చాలా తేలిక, వారి పిల్లల నుంచి కూడా. కొంతమంది అధికారులు చేస్తున్నారు కూడా, తమ ప్రజలకు తమ సిబ్బంది గురించి వివరిస్తున్నారు.

ప్రభుత్వ నిధులు లేదా సాంకేతిక మనుషులు లేరు అని సాకు చెప్పే బదులు, తేలికగా తామే ఒక సోషల్ అకౌంట్ తెరిచి ఒక పేజ్ తయారు చేసి, తమ సిబ్బంది లో ఆ పని వచ్చిన, ఒకరి చేత 10 ఫోటోలు పెట్టించిన చాలు. అమ్మ, పని మనిషి రాలేదు అని కూరలు దొరకలేదు అని, వంట మానుతుందా? ఏదో విధముగా, తయారు చేసి తన బిడ్డలకు అన్నము పెడుతుంది. మంచి బాధ్యత గల అధికారి కూడా, ఏదో ఒక రకముగా, తమ సిబ్బంది త్యాగాలను ప్రజలకు తెలియచేయాలి.

ఉదాహరణకు చీరాల, పర్చూరు మరియు వేటపాలెం మండలము చూద్దాము : సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా? అఫీషియల్ లేదా అన్ అఫీషియల్ ఉంటే తెలుపగలరు.

* ఒంగోల్ ఆర్డీవో గారు, తమ రెవెన్యూ సిబ్బంది, త్యాగాలను కష్టాలను ప్రజలకు నివేదిస్తున్న, సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

There are 20 mandals in Ongole revenue division. The present Revenue Divisional Officer is M Prabhakar Reddy.

Mandals Addanki, Ballikurava, Chimakurthi, Chinaganjam, Chirala, Inkollu, Janakavaram Panguluru, Karamchedu, Korisapadu, Kothapatnam, Maddipadu, Martur, Naguluppalapadu, Ongole, Parchur, Santhamaguluru, Santhanuthalapadu, Tangutur, Vetapalem, Yeddanapudi.

* చీరాల, పర్చూరు, వేటపాలెం తహసిల్దారులు, తమ నాయకత్వములో అధ్వర్యములో, పని చేసే సిబ్బంది త్యాగాలను, ప్రజలకు రోజూ నివేదిస్తున్నారా? సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

* చీరాల డీఎస్పీ గారు, తమ నాయకత్వములో అధ్వర్యములో, పని చేసే సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ త్యాగాలను, ప్రజలకు రోజూ నివేదిస్తున్నారా? సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

* చీరాల హెల్త్ ఆఫీసర్ గారు, తమ నాయకత్వములో అధ్వర్యములో, పని చేసే సిబ్బంది మరియు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరు నర్సుల త్యాగాలను, ప్రజలకు రోజూ నివేదిస్తున్నారా? సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

* చీరాల మున్సిపల్ కమీషనర్, వేటపాలెం ఎంపీడీఓ, ఎండీవో, సెక్రటరీ, నాయకత్వములో అధ్వర్యములో పని చేసే ఉద్యోగులు, లేదా పారిశుధ్య కార్మికుల కష్టాన్ని, శ్రమను, గొప్పతనాన్ని ప్రజలు కు చెపుతున్నారా? సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

Chirala Municipality - No updates from 2019

* చీరాల, పర్చూరు, వేటపాలెం, గ్రామ వాలంటీర్, అంగన్వాడీ మరియు ఉపాధ్యాయుల సేవలను, ఎక్కడ ప్రజలకు రోజూ నివేదిస్తున్నారు? సోషల్ మీడియా లింక్ లు ఉన్నాయా?

మరి తమ సొంత సిబ్బంది గొప్పతనాన్నే చెప్పలేనప్పుడు, ఇంక ప్రజలు రోజూ వారి కార్యక్రమాల గురించి, స్టేటస్ మనము ఆశించడము తప్పు అవుతుందా? తమ సిబ్బందిని మరియు ప్రజలను గౌరవిస్తూ, ఎప్పుడు వారి సోషల్ పేజీలు మొదలు అవుతాయి?

అలాగే మిగతా ప్రకాశం పట్టణాలు, మండలాలు, గ్రామాలు కూడా, ఎప్పుడు తమ సిబ్బందిని మరియు ప్రజలను గౌరవిస్తాయి?

కలెక్టర్ గారు, ఆర్డీవోలు, తాహ్సిల్దార్లు, ఎంపీడీవో, హెల్త్ ఆఫీసర్లు మరియు డీఎస్పీలు పెద్ద మనసు చేసుకుని, తాము సోషల్ మీడియాను వాడుతూ వివరాలు ప్రజల ముందు పెడుతూ, తమ సిబ్బందిని కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తూ, నిజమైన ప్రజల ప్రజాస్వామ్యాన్ని, మన ప్రకాశం జిల్లాలో కూడా నిలబెడతారు, అని ఆశిద్దాము.

Sent message to : MLA, MLC, District Minister, MP

Update : 2nd reminder on May 11

Respected Prakasam DT Collector,

Good Morning! Few days back, we requested about the Prakasam district social media page updates for public, like facebook and twitter, which are not updating from long time. Even press releases also not updating regularly.

As public knows that, India PM Sri Modi, Andhra CM Sri Jagan, Prakasam SP, other respective District collectors are updating and reporting daily updates to the public. Because they are respecting and treating public as God, most of these responsible government officers/ officials are feeling as public servants.

We gave the existing links to the Prakasam district social media pages. If you have any other new links, please let us know.

As a district collector if you are updating district people by social media then all other department folks will start giving daily updates to the public, like Muncipal, Panchayat, Revenue , Health and Police departments and their local officers like RDO, MRO, MPDO, MDO, Village Secretary, Muncipal Commissionar, DSP, CI, etc.

Please reply with positive answer for the Prakasam District Public. Public waiting for positive answer from you and local officers.

Thanking you Sir,
We appreciate your help in this regard,
Journalist.

Update : May 13 - Sent email to other media, CS, CM, AP Spandana, Human Rights Commission, AP Lok Ayukta, Dept. of I & PR, chairman_apat

Update : Oct 1 - Sent whatsapp msg to District Collectors, officers, ministers, mps, mlas, party leaders, public.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,936; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185
Dt : 04-May-2020, Upd Dt : 04-May-2020, Category : Request
Views : 1494 ( + More Social Media views ), Id : 532 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : prime minister modi , cm jagan , andhra dgp , reporting to public , but prakasam collector and other officials , ongole rdo , chirala , vetapalem , tahsildar , municipal commissioner , mdo , mpdo , secretary
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content