ముందడుగు - ప్రేమకు నేను పేదను కానూ, ఆకలని దప్పికని అడగకు- కృష్ణ, శోభన్, శ్రీదేవి, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,891,748; 104 తత్వాలు (Tatvaalu) and views 227,069.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కడుపు నిండిన వారికి తిన్నది అరగదు, దానికోసం జాగింగ్ లు, బరువు జాగ్రత్తలు, కొవ్వు టాబ్లెట్ లు. మరి కడుపునిండని వారికి? పేదవారికి? ఏ రోజు కారోజు, పూట కూలి తో బతికే వారికి?

అబ్బే మాకు అవి తెలియదండి, అంత సమయం లేదండి, యమా బిజీ మా ఇంటిల్లిపాదే స్వయం గోతులతో అంటారా? మీరు పంపినవే మేము నెలకి ఒకటి చూడం అనే కదా, ఆ నవ్వు? గతములో నే ఒక పాట పంపాము, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని. ఇప్పుడు మనము చుట్టూ చూడకపోతే, చివరలో ఎవరూ మనవైపు చూడరు సుమా.

మాకు ఆ అవసరం లేదు, పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, కలసి వచ్చిన అద్రుష్టాలు ఉండాయి అంటారా? అవన్నీ మనకన్న ఎక్కువ ఉండి కూడా జిల్లాలు రాష్ట్రాలనే గడగడ లాడించినవారు, రాత గీత మారి, అహంకార ఫలితానికి, గత పాపాలకు, ముదుసలి వయస్సులో, ఇంటివారు అంటే పిల్లలు, ముద్ద వేయక ఆకలికి అల్లాడి కుమిలి కుమిలి ప్రాణం విడిచిన దీనులు ఎందరో.

మరి మనము అన్నిటికీ సిద్దముగా ఉండాలి అంటే? నేల నిద్ర, స్వయం వంట శాఖాహారభోజనం, తక్కువ సౌకర్యాలు, ముదుసలి వారి సేవ, ఉత్త పాదాలతో 108 ప్రదక్షిణలు చేస్తే నే కదా కష్టం తెలిసేది, అలవాటు అయ్యేది, మనము నేల మీద నడిచేది, పాపం తగ్గేది?

మరి బీదరికములో ఉన్న ఈ అక్క, ఇంట్లో తిండిలేక అల్లాడుతున్న, తన తమ్ముళ్ళకు ఎలా ధైర్యం చెపుతుందో చూడండి. కసితీరా నవ్వేందుకు లోకం ఉంది, కడుపారా ఏడ్చేందుకు శోకం ఉంది, అన్నమై పుడతాను ఆకలి వేళా.

ఆ బాధలు మనలో ఎంత మంది పడ్డారు, అలా ఓదార్చే ఓర్పు నేర్పు ఎంత మందికి ఉంది మనలో, ఆత్మవిమర్శ చేసుకుందామా, కష్టం సుఖం అలవాటు చేసుకుందామా?

నిజం గా ఆకలిగా ఉంది అక్కా
ఆ... ఆ...ఆ... ఆ..
ప్రేమకు నేను పేదను కానూ.. 2
ఆకలని దప్పికని అడగకు, నాన్నా..
వేకువలు వెన్నెలలు లేవుర కన్నా

భవతీ భిక్షామ్ దేహి

కసితీరా నవ్వేందుకు లోకం ఉంది..
కడుపారా ఏడ్చేందుకు శోకం ఉంది - 2 సార్లు మొత్తము
భవతీ భిక్షామ్ దేహి
అక్కరకే రా.ని, ఒక పాశం ఉం.ది
అక్క అని, తమ్ముడనీ బన్ధం ఉంది...
ఈ బాధలో . . ఆ బంధమే
కడుపు నింపుతోం.ది,
కనులు తుడుస్తుం.ది 2
ఆరారో..ఓ..ఆరారో..ఓ..
ఆరారో..ఓ..ఆరారో... ఓ..

ప్రేమకు నేను పేదను కానూ, ఆకలని దప్పికని అడగకు నాన్నా, వేకువలు వెన్నెలలు లేవుర కన్నా.

ఎవ్వరికీ అందనిదా చుక్కల లోకం
చీకటికి చింతలకి ఎంతో దూరం - 2 సార్లు మొత్తము
అక్కగా పుట్టినా, అమ్మను నాన్నా
అన్నమై పుడతాను ఆకలి వేళా
ఆకాశమై.., నీకోసమే..
తారలన్ని నేనై
ఎదురు చూచు వేళ 2

ఆరారో... ఆరారో..ఓ..ఆరారో..ఓ..
ఆరారో..ఓ..ఆరారో... ఓ..
. . .
premaku nenu pedanu kanu, Mundadugu, Krishna, Shoban Babu, SriDevi, Jayaprada

చిత్రం : ముందడుగు (1983), సంగీతం : చక్రవర్తి, గీతరచయిత : వేటూరి, నేపధ్య గానం : సుశీల, కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,748; 104 తత్వాలు (Tatvaalu) and views 227,069
Dt : 03-Oct-2022, Upd Dt : 03-Oct-2022, Category : Songs
Views : 371 ( + More Social Media views ), Id : 1554 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : premaku , pedanu , mundadugu , krishna , shoban , sridevi , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content