APLatestNews.com top Banner

Social Media links
మన లక్ష్యం, లోకం లోని మోహం వైపా, మన లోని లోకేశ్వరుడు వైపా, నిర్ణయం మనదే - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇప్పుడే శ్రావణ శుక్రవారం, మహా లక్ష్మీ దేవి పూజ, శ్రీసూక్తం, మంత్రపుష్పం, అష్టోత్తరం తో పూర్తి అయింది. రోజూ చేస్తున్నాము కాబట్టి, ఏమీ మార్పు ఉండదు, ఇంకో 4 ఎక్కువ స్త్రొత్రాలు తప్ప. మంత్రం మన మనసు కోసం. మనసు లోని మాలిన్యాలను తొలగిస్తుంది. మానసిక శక్తి ని ఇస్తుంది. ఉచ్చారణ సరిగ్గా స్పష్టంగా అంటే, రాగ యుక్తం గా ఉంటే, మనసు పులకరిస్తుంది, తరంగాలు అంటే వైబ్రేషన్స్ వస్తాయి, సన్నటి వణుకుతో.

ఇవి ఎవరికి వారు, అనుభూతి పొందాలి, నిరంతర ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో. కళ్ళు వెంట నీరు ధారలుగా వస్తుంది. ఏదో తెలియని అలౌకిక ఆనందం, అది భౌతిక ప్రపంచానికి సంబంధించిన ది కాదు సుమా, బయట దొరకదు. డబ్బు పెట్టి అది కొనలేము, ఒకే రోజులో అది నేర్చుకోలేము. చుట్టూ ఉన్న భ్రమలు, మాయలు, విషయ చీకటి, స్పష్టంగా కనపడతాయి, కనులు మూసి చూస్తే.

మన లక్ష్యం, లోకం లోని మోహం వైపా, మన లోని లోకేశ్వరుడు వైపా, నిర్ణయం మనదే. ఏది ఆశించినా, దాని ఫలితాలు తప్పక అనుభవించాలి. అంటే దైవ పూజ కైనా గులాబీ కావాలంటే, దాని ముళ్ళు గుచ్చు కుంటాయి. అందుకే ఆకు అయినా, నీళ్ళు అయినా చాలు అన్నారు, ఆ దేవ దేవుడు. దేవుని కి కావలసినది, మన మనసు అనే మంత్రపుష్పం, దానినే నైవేద్యంగా మాత్రమే, ఇతర ఆర్భాటాలు ఆయనకు అవసరము లేదు.

లక్ష్మీ దేవమ్మ ను అడిగా, అమ్మా అందరూ అలంకరించి చేసినట్టు వైభవంగా చేయలేదు, అని కోపగించుకోకు తల్లి అని. పిచ్చి వాడా, ఏ తల్లి అయినా బిడ్డ తనకు గొప్పగా ఏదో చేయలేదు అని అనుకోదు. అంతెందుకు మీ అమ్మ, ఇది నాకు చేయలేదు అని అందా, ఈ ఆరేళ్ళుగా. నువ్వు సంతోషముగా మనస్ఫూర్తిగా చేసిందే చిన్నదైనా, ఆమె కి సంతోషం. లోకమాత నైన, నేనూ అంతే కదా.

నీ చేతులు నీ తల్లి పాదాలు తాకినంత కాలం, ఆ అమ్మ చేతి ముద్ద నీ నోటిలో జారినంత కాలం, నువ్వు నాకు వైభవంగా పూజ చేసినట్టే. త్రికరణ శుద్ధి గా ఏ చిన్న పనైనా చాలు రా, పిచ్చి మాలోకం అంది, ఆ దయగల తల్లి.

మరి అందరూ గౌరి, వరలక్ష్మీ అంటే, నువ్వు అలా అనవే రా మరి? అమ్మా, మా అమ్మను కొందరు పిన్ని, అక్క, చెల్లి, తల్లి, పెద్దమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా అంటారు. నిజముగా ఇంత మంది ఉన్నారా, లేరు, అన్ని ఒకరే కదమ్మా, ఎవరి భావన భక్తి గౌరవం వారిది.

సరే అందరికీ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి మరి మీకు, ఏం కావాలో కోరుకో, ధనమా, భోగమా, ఐశ్వర్య మా, కీర్తి ప్రతిష్టలా, కుటుంబ మా?

అమ్మా, మా అమ్మా నాన్న ను, ఆఖరికి మిమ్మల్ని కూడా, ఇది కావాలని ఏదీ ఎప్పుడూ అడగలేదు. ఎంత ఇవ్వాలో, ఎంత అవసరమో, అంత వారు మరియు మీరు ఇచ్చారు, ఇంక అడిగే అవసరము ఏముంది.

ఇందాక అనుకున్నట్లుగా, నా చేతులు మా అమ్మ పాదాలను తాకుతూ, ఆ అమ్మ చేతి ముద్ద, నోటిలో జారితే చాలు తల్లి. మీ బిడ్డలుము అయిన అందరి మంచి కోసం, మేము కర్పూరం అయితే చాలు, మీ మీద మనసు నిలిపి.

బిడ్డా, మీరు మాకు కూడా అర్థం కారు. నారాయణుడు నేను అదే అనుకుంటాం. కానీ ఇదే నిజం కోరికలు కు దూరంగా ఉంటేనే, కోదండ రాముడు కి దగ్గర ఉన్నట్టు. సమస్త భోగాలు ఎదురు గా అందుబాటులో ఉన్నా, మనం వాటిలో చిక్కుకో కూడదు. ఆ సుడిగుండములో పడితే, అసలు దోవ మరచి, పక్కదోవ పడతాము పరుగులు తీస్తాము, చివరకు శూన్యం అంటాము. ఎందుకంటే మాయలో భ్రమలు కలిగిస్తాయి. సరే కానీ మీ ఇష్టం, అమ్మ జాగ్రత్త.

మీ దయ ఉన్నంతకాలం, ఈ పడవ అలాగే ముందుకు సాగుతూ ఉంటుంది తల్లి. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 674 General Articles, 46 Tatvaalu
Dt : 31-Jul-2020, Upd Dt : 31-Jul-2020, Category : Devotional
Views : 72 ( + More Social Media views ), Id : 623 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : our goal , passion in world , god in us , sravana , friday , vara , lakshmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content