ఓ గురువు సేవ కు అవకాశం, సమయానికి సరైన సలహా నే, కోటి రూపాయల విలువ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,105; 104 తత్వాలు (Tatvaalu) and views 224,938.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అధికారి సమాచారం
* ఏవీ సమయానికి గుర్తు
* సమయానికి సరైన సలహా
* ఆస్తులు అన్ని అమ్మినా
* అందరము సాత్విక ఆత్మల
* అనాధాశ్రమములో బేధాలు
* డొనేషన్ చదువు వైద్యులే
* అమ్ముడుబోయి, కళ్ళుమూసుకుని ఓటు
* త్యాగం లేని పూజ ధ్యానం
* చేయకుండా ఉండటమే, జంతువులకు
2 min read time.

ఇప్పుడే ఒక గురు అధికారి ఫోన్ చేసి, ఆరోగ్య జాగ్రత్తలు గురించి, అన్ని అడిగి చెప్పించుకుని రాసుకున్నారు. దేవుని దయవలన వారింట్లో వారు తొందరగా కోలుకోవాలి - ఇది సోమ వారం ఉదయం సంగతి.

అధికారి నుంచి సమాచారం వచ్చింది, క్షేమము, ధన్యవాదములు, చాలా మార్పు వచ్చింది, తిరుగుతూ పనులు. - ఇది సోమ సాయంత్రం సంగతి.

అన్ని తెలిసిన దినుసుల వైద్యమే, ఏవీ సమయానికి గుర్తు రావు లేదా నమ్మకం ఉండదు, గట్టిగా చెప్పిన దాకా. దేవుని సహాయం కు ధన్యవాదాలు, మీలో ఓ గురువు సేవ కు అవకాశం ఇచ్చినందుకు. అందరి ప్రైవసీ కాపాడాలి కదా, అంత కన్నా ఎక్కువ వద్దులే.

సమయానికి సరైన సలహా నే, కోటి రూపాయల విలువ. మరి మనకు జీవిత కాలము గుర్తు ఉంటుందా? గుర్తు లేకపోయినా పర్లేదు, దేవుడు, మనకు ఇంకొకరి తో అదే మంచి చేయిస్తారు. కర్మ ఫలితము తప్పక ఉంటుంది సుమా.

ఏముంది ఇందులో ఈ వైద్యములో, అన్ని మన ఇంట్లోవే, అన్ని మనకు తెలిసినవే. కానీ మనకు ఉన్న ప్రాపంచిక మోహము లో, ఏమి చెయ్యాలో తెలీదు, ఖంగారు పడతాము. ఇతరులు ముందే చెప్పినా, వినము, తెలికగా తీసేస్తాము, కానీ పోయాక లేదా విషయము పెద్దగా అయినాక, పరిస్తితి మార్చ గలమా?

ఎవరితో చెపితే ఏమౌతుందో అని ఇంకో భయము. ఎవరిని నమ్మాలో తెలీదు, మనకు ఎవరి మీదా నమ్మకము ఉండదు. జాగ్రత్తలు తీసుకోము, ప్రాణం మీదకు వచ్చిందాకా? అంతేనా?

చిన్న దానికి కూడా ఆసుపత్రి కి వెళితే, ఈ పరిస్తితి లో, ఆస్తులు అన్ని అమ్మినా కూడా, మనిషి వెనక్కు వస్తారని నమ్మకము లేదు కదా? ఎన్ని కన్నీటి గాధలు చూస్తున్నాము. మన దేవుడు ఇచ్చిన గురువులు మీరు ఎవరూ ఆ పరిస్తితిలో ఉండకూడదు.

అందుకే, నోర్తు ఎత్తి, తప్పొ ఒప్పో మనం చేస్తున్న మంచి పనుల గురించి అందరికీ చెప్పాలి.

మీకు నేను పంపే ప్రతిదీ, వాట్సాప్ స్తేటస్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే, అందరికీ ఒకటే మాట, నా మిత్రులు బంధువులు అధికారులు నాయకులు, అందరము సాత్విక ఆత్మలమే కదా. మనిషికి ఓ చాటు మాట గా ఉండకూడదు కదా, మంచి లో, పదిమందికి పనికి వచ్చేదాని లో.

వచ్చేటప్పుడు పోయేటప్పుడు, హోదా ఐశ్వర్య అధికార బేధాలు లేవు. అఖరికి పిల్లలు, మనల్ని వదిలే అనాధాశ్రమములో కూడా, బేధాలు లేవు. అందరూ వదిలేసిన/ వదిలేయబడే, ఒంటరి వాళ్ళమే కదా, నేడో రేపో?

ఎందుకంటే, రోగము కొత్త, సౌకర్యాలు మందులు మనసులు లేవు. మనసు లేక పూర్తి సంపాదన ధ్యేయము. బయట రాష్ట్రాల్లో లేదా ఇంకో చోట డొనేషన్ తో, చదివిన అరకొర చదువు వైద్యులే. వారి వెనక అండగా, మనము అమ్ముడుబోయి, కళ్ళుమూసుకుని ఓటు వేసిన మన నాయకులే.

మిగతా వాటిలో ఎలాగో సర్దుకుని, ఉత్తి డాము లు కట్టి పడవేసినా, లేని రోడ్లు ఉత్తుత్తివి వేసినా, మరలా కొత్త గా కట్టవచ్చు, కానీ మన ఇంట్లో మనిషి ప్రాణం కష్టం కదూ, వెనక్కి తేవడం?

మనిషికి మనిషి సహాయపడినప్పుడే, ఆదుకున్నప్పుడే, నిస్వార్ధము గా ఇతరులకు కొంత సమయం వెచ్చించినప్పుడే, మన దైవిక పూజకు మంత్రాలకు ధ్యానాలకు విలువ. లేకపోతే, నిష్ప్రయోజనం.

త్యాగం లేని పూజ ధ్యానం వ్యర్ధము, అందుకే చిత్తశుద్ది, త్రికరణ శుద్ది తో అంటారు. మన చేతలు మాటలు అన్ని కలవాలి.

గొంతు పెగల్చి వేళ్ళు కదల్చి, మంచో చెడో మాట్లాడండి. మనము చెప్పెవి అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ధైర్యముగా చెప్పే ప్రయత్నం చేయాలి. అయితే, మనకు నిబద్దత కూడా ఉండాలి సుమా.

అందరమూ తప్పులు చేస్తాం, మరలా అదే తప్పు చేయకుండా ఉండటమే, మనకూ జంతువులకు తేడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,105; 104 తత్వాలు (Tatvaalu) and views 224,938
Dt : 31-May-2021, Upd Dt : 31-May-2021, Category : General
Views : 689 ( + More Social Media views ), Id : 1185 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : opportunity , guru , officer , service , advice , worth , life , crore , rupees
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content