తనను తాను జయించిన వానిని, ఎవ్వరూ అధిగమించలేరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,872; 104 తత్వాలు (Tatvaalu) and views 225,177.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

స్వార్థ చింతనతోనే, సమస్త దుఃఖాలు ఆరంభమౌతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి, మోహము వ్యామోహము లో పడ్డాక, ఆ విషయాన్ని తర్వాత దాని ఫలితాలను మరచిపోతాము.

ప్రపంచ బ్రాంతిలో మునిగి పోతాము. ఏమీ కాదులే అనుకుంటాము, తప్పు దోవలో నడుస్తూ.

స్వార్థం మనలో అనిశ్చితిని, వ్యాపార ధోరణిని కలుగజేస్తుంది. వాస్తవానికి దూరముగా తీసుకెళుతుంది. ఏవిధముగా అయినా, తేలికగా లాభాలు ఆర్జించాలి, పెద్ద పదవి ఉద్యోగము ధనం సంపాదించాలి అన్న తాపత్రయం పెరిగి, ఉచ్చ నీచాలు మరచి, పూర్తిగా, అరిషడ్ వర్గాలకు బానిస అవుతున్నాము.

ఎటువంటి ఎత్తు పల్లాలకు, కష్ట నష్టాలకు గురి అయినా, నిలకడ కలిగిన పట్టుదలతో, భగవంతుని పై ఆశ నమ్మకం, ఉన్నవాడు అదృష్టవంతుడు.

కష్టాలకు భయపడడు, అవి దేవుని పరీక్షగా భావించి, రుజు మార్గము లోనే పయనించి, ఆ కష్టాలను ఓర్చుకుని, ముందుకు సాగుతాడు.

ఎందుకంటే, భగవంతుడు కరుణామయుడు, ఖచ్చితముగా, మనకు తగిన దోవను చూపుతాడని, అతని నమ్మకము.

అతడు తనకు తాను సహాయం చేసుకున్నవాడే కాక, ఇతరులకు కూడా సాయపడగలవాడు. తన అనుభవముతో, ఇతరులకు మార్గ దర్శనం చేయగలడు.

కొన్ని సమస్యలు, ఇతరులకు పరిష్కారం లేని, పెద్ద సమస్యలు గా ఉంటాయి. కాని అతనికి, అవి ఓ తేలికైన పరిష్కారాన్ని సూచిస్తాయి.

జీవించడంలోని మెళకువలు, తెలియకపోతే స్థిరత్వం లభించదు. అయితే, దానికి మనసు పై పట్టు ఉండాలి. మనసు మనల్ని ఆడిస్తే కోరికలతో, మనము అదుపు తప్పి, పతనము చెందుతాము.

కాని మనసును మనమే జయిస్తే, సామాన్య జీవనము ఉండవచ్చేమో కానీ, నిండైన మనశ్శాంతి ఉంటుంది, పరమాత్మ సన్నిది లో.

అది బయట ఎక్కడో ఎవరి వలనగానీ, ఏదో ప్రదేశంలో గానీ లభించేది కాదు. తోటివారు మాట సహాయం చేయగలరు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మనకు మనమే పెంపొందించుకోవాలి.

అది ఒక రోజు తో రాదు, నిరంతర సాధనతో ఏళ్ళు గా శ్రమిస్తేనే, అది సాధ్యం. బడి లో గుడి లో ఇవి చెప్పరు, చెప్పినా, మనము మాత్రమే సాధన చేయాలి సుమా.

ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే అవకాశాలను తరచుగా మనం కోల్పోతుంటాం. నిద్రలోనూ, మెలకువలోనూ మనం స్పృహను కలిగి ఉండి, ఆ స్పృహ మనలోని స్వార్థాన్ని, అహాన్ని నిర్మూలించగలగాలి.

అంటే, అరిషడ్ వర్గాలను జయించాలి.

రావణుడు, వీటిని జయించి శివుని పొంది కూడా, మరలా అదుపు తప్పాడు. అంటే, నిరంతర సాధన ముఖ్యము, దేవుని పొందిన తర్వాత కూడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,872; 104 తత్వాలు (Tatvaalu) and views 225,177
Dt : 06-Sep-2021, Upd Dt : 06-Sep-2021, Category : General
Views : 695 ( + More Social Media views ), Id : 1246 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : surpass , win , conquer , himself , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content