APLatestNews.com top Banner

Social Media links
ఫాన్ గాలిలో సేదతీరబోతున్న గంటా, కొనసాగుతున్న వలసలు, నవరత్నాలు మీద నమ్మకం లేకనా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు గంటా చేరికపై, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని... అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెపుతున్నారు.

గతంలో కూడా చంద్రన్న, వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ తమ వైపు తెచ్చుకుని, జగనన్న ను ఏదో ఇబ్బంది పెడదాం అనుకున్నారు. అందరినీ ఆహ్వానించి, పదవులు ఇచ్చారు. పార్టీలో నే, ప్రతి ఊరు లో, రెండు వర్గాలు వైరంతో కొనసాగేటట్టు చేశారు.

చివరకు ఫలితాలు ఆయనకు అనుకూలంగా లేవు. ఏ పధకాలు పని చేయలేదు. ఎందుకంటే ప్రజల మీద శ్రద్ధ కన్నా, పక్క వారిని ఎలా లోనికి లాగాలి, ఎదుటివారి ని ఎలా ఇబ్బందులు పెట్టాలి, అవతల వైపు మొత్తం ఖాళీ చేయాలి అన్న ద్యాస ఎక్కువ అయింది. అంటే ఆయన సలహా దారులు, ఆయనను దారుణంగా వంచించారు.

మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, అదే కధ తిరిగి జరుగుతుంది, పాత్ర ధారులు పార్టీలు వేరు. నేటి జగనన్న సలహదారులు కూడా, అదే దోవలో నడుస్తున్నారు. ప్రజలు 150 పైగా స్ధానాలలో అఖండ విజయం ఇస్తే, అభివృద్ధి వైపు పూర్తిగా దృష్టి పెట్టాలి.

పక్క పార్టీ ఎమ్మెల్యేలు తో అసలు అవసరమే లేదు. అందులో ఏరు దాటాక తెప్ప తగలేసే వారు, పార్టీ కి ఎటూ ప్రయోజనం లేదు. సరైన అభ్యర్ధి లేని చోట, కొత్త వారికి అవకాశము ఇచ్చి, అభివ్రుద్ది పనులు చేయించి, వారికి సాన పట్టాలి, జనము ఇతనే తగిన ప్రత్యర్ధి అనుకోవాలి మిగత 4 ఏళ్ళలో.

మొదటి నుంచి పార్టీలో లేదా ఎన్నికల ముందు నుంచి ఉన్న వారికి మనస్ధాపం కలిగిస్తే, రేపు ఎన్నికల్లో పాతవారు, కొత్త వారు ఇద్దరూ పార్టీ కి నష్టం చేస్తారు. పాతవారికి ఎటూ కోపం, కొత్త వారు అవకాశవాదులు పార్టీ అంటే, ఎటూ అభిమానం ఉండదు, మనస్పూర్తిగా పని చేయరు. గెలిచినా, మరలా దూకేస్తారు.

నవరత్నాల ఫలాలు మంచిగా జనం కు అందేలా చేసి, తప్పులు సరిదిద్దు కుంటూ, కరోనా ను సమర్ధ వంతంగా ఎదుర్కొంటు, వాలంటరీ వ్యవస్థ ను పటిష్టం చేసుకుని, ప్రజల గుండెల్లో చిరకాలం ఉండేలా ఉంటే, తర్వాత ఎన్నికల్లో మరలా విజయం సాధించవచ్చు, అని పార్టీ శ్రేయోభిలాషుల ఆలోచన.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 674 General Articles, 46 Tatvaalu
Dt : 23-Jul-2020, Upd Dt : 23-Jul-2020, Category : Politics
Views : 96 ( + More Social Media views ), Id : 608 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : no confidence , navratnas , ganta , ysrcp , jagan , party jumps , after election
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content