నవగ్రహ స్తోత్రం NAVA GRAHA STOTRAM नवग्रह स्तोत्रम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 54 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1580 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల, ఆలయాలు కూడా ఉన్నాయి.

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.

సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.

సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు.

సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.


నవగ్రహ ధ్యాన శ్లోకం dhyāna ślōkam - ముందు గా అన్ని గ్రహాలను ఒకటే శ్లోకములో నమస్కరించడం.

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

ādityāya cha sōmāya maṅgaḻāya budhāya cha ।
guru śukra śanibhyaścha rāhavē kētavē namaḥ ॥

आदित्याय च सोमाय मंगलाय बुधाय च ।
गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः ॥

1. రవిః raviḥ - సూర్య దేవుని శ్లోకం
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

japākusuma saṅkāśaṃ kāśyapēyaṃ mahādyutim ।
tamō'riṃ sarva pāpaghnaṃ praṇatōsmi divākaram ॥

जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम् ।
तमोऽरिं सर्व पापघ्नं प्रणतोस्मि दिवाकरम् ॥

2. చంద్రః chandraḥ దేవుని శ్లోకం
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

3. కుజః దేవుని శ్లోకం
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

4. బుధః దేవుని శ్లోకం
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

5. గురుః దేవుని శ్లోకం
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

6. శుక్రః దేవుని శ్లోకం
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

7. శనిః దేవుని శ్లోకం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

8. రాహుః దేవుని శ్లోకం
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

9. కేతుః దేవుని శ్లోకం
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।

Nava Graha Stotram aditya soma mangala budha guru sukra sani rahu ketu namah  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1580 General Articles, 54 Tatvaalu
Dt : 18-Sep-2022, Upd Dt : 18-Sep-2022, Category : Songs
Views : 67 ( + More Social Media views ), Id : 53 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : navagraha , stotram , dhyana , slokam , aditya , soma , mangala , budha , guru , sukra , sani , rahu , ketu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు