అయ్యప్ప మాల ధారణం నియమాల తోరణం - అయ్యప్ప స్వామి మహత్యం - శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2234 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2269 General Articles and views 2,598,160; 104 తత్వాలు (Tatvaalu) and views 277,425.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ayyappa Maladharanam Niyamala Toranam - Ayyappa Swamy Mahatyam - Sarath Babu, Murali Mohan, Shanmukha Srinivas

*పాటతో పరమార్ధం - మాల ధారణం, నియమాల తోరణం - అయ్యప్ప స్వామి మహత్యం - శరత్ బాబు, మురళి మోహన్, షణ్ముఖ శ్రీనివాస్*

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

+ + +

If we have taken a resolution/ Sankalp to chant God continuously, it should be done with sincerity. Ayyappa Mala Dharanam means an arch of rules. We have to know the reason of our birth and prevent evil deeds. Devotees sing loudly chanting Sharanam, Saranam, Ayyappa Swami Saranam. And youll try, wont you?

దేవుని నిరంతరం జపించడం కోసం ఒక సంకల్పం తీసుకున్నాము అంటే, అది చిత్తశుద్ది తో చేయాలి. అయ్యప్ప మాల ధారణం అంటే, అది ఒక నియమాల తోరణం. మన జన్మకు కారణం తెలుసుకుని, దుష్కర్మలు నివారణం చేసుకోవాలి. శరణం, శరణం, అయ్యప్ప స్వామి శరణం అంటూ భక్తులు గొంతెత్తి ఆర్తిగా పాడుతారు. మరి మీరు ప్రయత్నం చేస్తారు కదా?

ప్రతి రోజూ, ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్ధ త్రయ సాధనలో ఉండాలి. చతుర్వేదముల రక్షణలో కూడా మనం పాత్రత వహించాలి. మన శరీరం, పంచభూతముల పంజర సుఖమై, అరిషడ్వర్గం అనే ఆరు శత్రువుల ఆరడిలో పడి నాశనం కాకుండా, అయ్యప్ప ఏడు జన్మలకు వీడని తోడని, ఆ దైవాన్ని నమ్మిన నిజ భక్తుల, మాల ధారణం, నియమాల తోరణం.

ఆ ఉ మా సంగమనాదంలో ఓంకారం పుడుతుంది, అలాగే హరిహర రూపాద్వైతంలో అయ్యప్ప మనకు లభించారు. అష్టవ్యసనాలను వదలి, కఠిన నిష్ఠుర నిగ్రహ యోగంలో, మండలపూజా మంత్ర ఘోషలో, మన సంచిత పాప కర్మ అన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తులా, మాల ధారణం, నియమాల తోరణం.

కాబట్టి అత్యంత నియమ నిష్టలతో మనము మండల దీక్ష పూర్తి చెయ్యాలి. ప్రాపంచిక బ్రమలలో మునిగి, మనడల రోజుల కన్నా తక్కువ సమయం కేవలం నటించడానికి తీసుకుంటే, దానివలన్ చెడు ఫలితాలు మనకు వస్తాయి మిత్రమా.

+ + +

మాల ధారణం, నియమాల తోరణం 2
జన్మ కారణం, దుష్కర్మ వారణం.. 2
శరణం, శరణం, శరణం, శరణం
అయ్యప్ప స్వామి శరణం 4
మాల ధారణం నియమాల తోరణం 2

ఉదయాస్తమ్ముల సంధ్యలలో.., పురుషార్ధ త్రయ సాధనలో.
చతుర్వేదముల రక్షణలో., పంచభూతముల పంజర సుఖమై.
ఆరు శత్రువుల ఆరడిలో పడి., ఏడు జన్మలకు వీడని తో.డని.
నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా.. ||మాల ధారణం||

ఆ ఉ మా సంగమనాదంలో, ఓం ఓం ఓం,
హరిహరరూపా అద్వైతంలో, శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో.., హరిహరరూపాద్వైతంలో..
నిష్ఠుర నిగ్రహ యోగంలో.., మండలపూజా మంత్ర ఘోషలో..
కర్మ అన్న కర్పూరం కరిగే 2, ఆత్మహారతులు పట్టిన భక్తులా.. ||మాల ధారణం||

శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం 2
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం

Song Name : Maladaranam; Album Name : Ayyappa Swamy Mahatyam; Music : K.V.Mahadevan; lyrics : Veturi; Singer : S.P.Balasubramanyam; Directed by : Satyadev.J  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2269 General Articles and views 2,598,160; 104 తత్వాలు (Tatvaalu) and views 277,425
Dt : 25-Dec-2024, Upd Dt : 25-Dec-2024, Category : Songs
Views : 136 ( + More Social Media views ), Id : 2215 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Maladharanam Niyamala Toranam , Ayyappa Swamy Mahatyam , Sarath Babu , Murali Mohan , Shanmukha Srinivas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content