మహాభారతం - స్నేహం ఎన్ని రకాలో చూడండి - విఫల, సఫల, సుఫల స్నేహలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,893; 104 తత్వాలు (Tatvaalu) and views 224,922.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మన వాట్సాప్ స్టేటస్, ప్రతి రోజూ చూడటం మానవద్దు. ఎలా చూడాలో గతము లో మాటలు పంపాము, ఇతరులను అడిగి తెలుసుకొనవచ్చు. దొంగచాటు గా చూడవద్దు వద్దు సుమా, నీతిగా ధైర్యముగా రీడ్ రిసీప్ట్ తో చూద్దాం. ప్రొఫైల్ ఫోటో కనీసం దేవుడు ప్రక్రుతి ది అయినా పెట్టి, మనము, బాధ్యత గల మనుషులం అని మిత్రులకు తెలుపుదాం.

మహాభారతం లో లేని విషయ పరిజ్ఞానం లేదు, ఈ రోజు జరిగే ప్రతి విషయాలు, మంచి చెడు, కుట్రలు కుతంత్రాలు ఆనాడే వివరము గా చెప్పారు.

మనకు స్నేహితులు చాలా మంది ఉంటారు, అవకాశ అవసర వాదులు గురించి కాదండి, మాట మీద గౌరవ మర్యాద తో ఉండేవారు, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా, మాట తప్పరు, దూరం పోరు.

స్నేహం ఎన్ని రకాలో కూడా, భారతం చెప్పింది, మన గరికపాటి గురువు గారి మాటల నుంచి, మన సొంత మాటలు లో చదవండి.

1) *విఫల స్నేహం* - ద్రోణుడు మరియు దృపదుడు, చదువుకునేటప్పుడు ఇద్దరూ స్నేహితులు. ద్రుపదుడు కాబోయే యువరాజు. నేను రాజు అయిన తర్వాత, నీకు ఏమి కావాలన్నా సహాయం చేస్తాను అన్నాడు. కానీ మాట తప్పాడు. గతి లేక, 2 ఆవులకోసం వెళ్ళి అడిగిన, ద్రోణుడిని అవమానించాడు. తర్వాత, అర్జుని సహాయముతో మరలా, ద్రుపదుడి పై పగ తీర్చుకున్నాడు. అందుకే రాజకీయాలలో లేదా ఐశ్వర్యం లో, మాట తప్పడం ఆనవాయితి.

అంటే, ఇది పరిస్తితులను బట్టి, మాటలు మార్చే స్నేహము కు, ఉదాహరణ. ఇప్పుడు మన చుట్టూ, ఇలాంటి వారే, ఎక్కువ మంది ఉంటారు. ఒకసారి వారి కష్టాలు తీరినాక లేదా అమిత ఐశ్వర్యం వచ్చిన తర్వాత, ఎవరినీ లెక్క చేయరు, ఎవరి మాట వినరు, గతం మరుస్తారు.

2) *సఫల స్నేహం* - దుర్యోధనుడు మరియు కర్ణుడు, చెక్కు చెదరని గట్టి అవకాశవాద స్నేహం. అయితే ఇద్దరిలో స్వార్ధం ఉంది, ఇద్దరూ పతనం అయ్యారు. కర్ణుని తో అర్జునుని ఓడించ వచ్చు అని, రారాజు ఆశ, అందుకే చేరదీశాడు. కర్ణునికి కూడా, రారాజు నుంచి, గౌరవం మర్యాద, అధికారం, ఐశ్వర్యం, రాజ్యం అన్ని వస్తున్నాయి. కాబట్టి దీనిని కూడా అవసర అవకాశవాద స్నేహం అనవచ్చు. కానీ అందులో కూడా, నీతి గా కలసి ఉన్నారు ఒకరికొకరు చేదోడు వాదోడుగా చివర వరకు, విడిపోకుండా.

కానీ వీరిద్దరు ఉంది చెడు వైపు, వీరి స్నేహము వలనే భారత యుద్దం వచ్చింది, లక్షల మందికి నష్టం. వీరిద్దరికి తప్ప, ఇంకొకరు కు ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఇది గట్టి స్నేహము అయినా కూడా, ధర్మ ఉత్తమ స్నేహము కాదు.

3) *సుఫల స్నేహం* - కృష్ణుడు మరియు అర్జునుడు. ఇలాంటి స్నేహాలు మనకు ఉండాలి. ఇవి వారికి మంచిది, అలాగే ఇతరులకు కూడా ఎంతో మేలు. వారిద్దరికి కూడా, భేధాభిప్రాయాలు వచ్చాయి. క్రుష్ణార్జున యుద్దం వచ్చింది, కానీ విడిపోలేదు. కలిసే ఉన్నారు. ఇద్దరూ, నీతి ధర్మం తప్పరు.

వీరిద్దరి స్నేహం వలన, ధర్మం గెలిచింది. భగవద్ గీత మనకు దక్కింది.

మరి నేడు అన్ని విఫల స్నేహాలే 75 శాతం. సఫల స్నేహం ఉన్నా, అది స్వార్ధము తో ఉంది. కాబట్టి, సుఫల స్నేహం, అందరికీ జీవితాంతం మేలు.

స్నేహం కోసం కనీసం ఓ 108 ప్రదక్షిణలు, ఉదయం 5 కి లెగవడం, రామకోటి రాయడం, కాకర రసం తాగడం, తల్లి దండ్రులను దగ్గర ఉంచడం, తాను చదివి పిల్లల కు భగవద్గీత రామాయణం భారతం నేర్పడం, కూడా నేడు లేదు, చేసే పరిస్థితి లో లేరు. ఇంక ఎందులో స్నేహ నమ్మకం, ఎన్ని రోజులు ఉంటుంది మీరే చెప్పండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,893; 104 తత్వాలు (Tatvaalu) and views 224,922
Dt : 18-Sep-2021, Upd Dt : 18-Sep-2021, Category : General
Views : 987 ( + More Social Media views ), Id : 1251 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mahabharata , friendship , types , failed , selfish , successful , karna , duryodhana , krishna , arjuna , drupada , drona
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content