అమెరికా ఎన్నికల పద్దతి చూడండి, ఎంత విధానం ఉంటుందో - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,431; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అమెరికా ఎన్నికలు పద్దతి చూడండి. ఏ పార్టీ కూడా ఒక కుటుంబం కి అంటుకొని ఉండదు ఎల్ల కాలం.

4 ఏళ్ళ పాలన బాగుంటే , ఇంకో 4 ఏళ్ళు అంతే. తర్వాత అయినా కుటుంబం మారాలి. క్లింటన్ తప్పు చేస్తే మధ్యలో నే రాజీనామా చేయించారు. ఒబామా కు నీరాజనాలు పట్టారు. రాజకీయం తెలియని ట్రంప్ ను గెలిపించారు చూద్దాం అని. హిల్లరీ ని ఒప్పుకోలేదు జనం.

జనం చైతన్య వంతులు. వారిని మెప్పించటానికి ప్రతి పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులు నిలబడతారు. మాటలతో మెప్పించి తమ పార్టీలో నే ఎమ్మెల్యే, ఎంపీ , అధ్యక్ష అభ్యర్థి గా గెలవాలి. ఈ సొంత పార్టీ అభ్యర్దుల ప్రక్రియ, జనరల్ ఎలెక్షన్ కు, సంవత్సరం ముందే మొదలు పెడతారు.

ఇవి పబ్లిక్ గా జరుగుతాయి జనం ముందు. రికమండేషన్ కుదరదు. ఆస్తులు, కేసులు అంతా పబ్లిక్ కి తెలుసు.

ఎలక్షన్ అంటే నాయకుల కు దడ వణుకు. సొంత పార్టీ వాళ్ళు, అన్ని తప్పులు జనం లో పెడతారు, తూర్పార పడతారు , తాము గెలవాలి అని. అవతల పార్టీ ప్రత్యర్ది ఇవన్ని గుర్తు పెట్టుకుంటారు, జనరల్ ఎలక్షన్ లో దుమ్ము దులపటానికి.

ఆ తర్వాత జనరల్ ఎన్నికల లో ఎదురు పార్టీ అభ్యర్థి తో పోటీ పడాలి. వామ్మో ఎంత కష్టమో. సామాన్య జనం , హపీగా తాపీగా వారి ఆటలను, పాట్లు చూసి నచ్చిన మంచి వారికి ఓటు వేస్తారు. మనలా జనం గుడ్డలు చించుకోరు, ఏదో కొద్ది మంది అభిమానులు తప్ప.

ఉదాహరణ కు డెమొక్రాట్ పార్టీ తరుపున 4(లేదా ఎంత మంది అయినా) నిలబడతారు, 2018 సంవత్సరం చివరలో మొదలూవుతుంది, 2019 నవంబర్ జనరల్ ఎన్నికను. కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంత పార్టీ ఫండ్ కలెక్ట్ చెయ్యాలి అని. ముందు వాళ్ళ పార్టీ జనం ముందు కొన్ని సార్లు, టౌన్ హల్ లేదా టీవీ మీటింగ్ ల లో ప్రత్యర్ధులతో పోరాడాలి తెలివైన మాటల తూటాల సమాధానాలతో. తరువాత, ఆ పార్టీ సభ్యత్వం ఉన్నవారు, ఆ నలుగురిలో ఒకరిని ఎన్నుకుంటారు. పోయిన సారి, హిల్లరి నెగ్గారు వీరి తరుపున.

అలాగే రిపబ్లికన్ పార్టీలోను జరుగుతుంది, ఇదే విధానము. పోయిన సారి, ట్రంప్ నెగ్గారు వీరి తరుపున. ఆ తర్వాత, హిల్లరి మరియు ట్రంప్ అదే విధంగా డిబేట్ చేస్తారు. జనరల్ ఎన్నికలలో ప్రజలందరు వీరిలో ఒకరిని ఎన్నుకుంటారు. పోయిన సారి, ట్రంప్ నెగ్గారు అధ్యక్షునిగా.

ఇంకా చాల ఉంది చెప్పాలి అంటే, కాంగ్రెస్స్ సభ్యులు, మెజారిటి, ఎలక్టోరల్ కాలేజ్, అబ్బో.

ప్రతి వ్యవస్థ లోనూ లోపాలు ఇబ్బందులు ఉంటాయి, కాకపోతే దాని శాతం(ఉదాహరణకు 10 %) చాలా తక్కువగా ఉండాలి. మన దగ్గర అది 50% పైనే ఉంటుంది.

ఇంటింటికి తిరిగి జనం టైం వేస్టు చేయరు. అన్ని ప్రకటనలే, వాటికే ఎక్కువ ఖర్చు.

గెలిచిన ప్రభుత్వం ప్రతి వ్యక్తి కి అండగా ఉంటుంది. అవినీతి, గొడవలు, హత్య లకు ఎంత వాడైనా జైలుకే. అదీ నిజమైన ప్రజాస్వామ్యం అంటే.

ఆలోచన చెయ్యండి , అమెరికా లాగ మారటానికి మొదటి ప్రయత్నం మీ ఓటు మిత్రమా. మనం మారందే సమాజం మారదు, నాయకులు మారరు, మన బిడ్డల భవిష్యత్ మారదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,431; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067
Dt : 05-Apr-2019, Upd Dt : 12-Apr-2019, Category : America
Views : 2583 ( + More Social Media views ), Id : 76 , Country : USA
Tags : America , election process , vote , voter , Trump , Hillary

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content