APLatestNews.com top Banner

Social Media links
పొరలు కమ్మిన కళ్లు భ్రమలలో ఉంటాయి, తెరలు తొలగితే అంతా శూన్యం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మంచి తల్లి దండ్రులు లేదా మన మంచి కోరే పెద్దలు/ స్నేహితులు, 10 ఏళ్ల ముందు చూపుతో జాగ్రత్తలు చెపుతారు. వాళ్ళు బంగారు నిధి లాంటి వారు. ఆ మంచిని 50 ఏళ్ళ దాకా చాదస్తం అంటాం, కళ్ళు నెత్తి పైన ఉండి.

తర్వాత వయసు పెరిగో లేక రోగాన పడో, మన కళ్ళు కిందకు దిగే సరికి, మనల్ని చాదస్తం మనిషి అంటారు మిగతా వారు. పేరెంట్స్ లేదా మంచి వారి విలువ, దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు.

మనం వేరే వాళ్ళ కు ఇచ్చినది ఏదైనా రెట్టింపు అయి వెనక్కు వస్తుంది, గౌరవం, మర్యాద, సహాయం, మంచి తనం. అలాగే దగా, మోసం, ద్రోహం, కృతఘ్నత కూడా అంతే రెట్టింపు తో వెనక్కు వస్తాయి. జాగ్రత్తలు మరి ఎవరి మాట వినకపోతే. మనమే తర్వాతి, ముసలి వాళ్ళం. ఇప్పుడు లేని మనసు మీద పట్టు, చర్మం ముడతలు పడ్డాక రాదు.

ఒక్క కుటుంబం కే, లొంగిపోయి నిన్నే మరచి, నీవు మోహం లో పడి, దాసుడు వి అయితే, మరి నాకు 100 కుటుంబాలు. ఎవరికీ నేనేమి కాను, కానీ అందరూ నా వారే, నా పిల్లలే.

జీవితం కనపడేది కాదు, కనపడంది చాలా ఉంది మిత్రమా. పొంచి ఉన్న ప్రమాదాలు లెక్కలేనన్ని, మెలుకువతో అడుగులు వెయ్యి. పొరలు కమ్మిన కళ్లు భ్రమలలో ఉంటాయి, తెరలు తొలగితే అంతా శూన్యం, బూడిదే, ఖాళీ చేతులు.

ఇంద్రుడు లేదా యముడు వచ్చినా, వేరే ఆలోచనలు లేక భయాందోళనలు లేక, ఏక్షణమైనా నవ్వుతూ వారితో వెళ్ళే వాడే, జీవితాన్ని సాధించినవాడు, సార్ధకత పొందిన వాడు, జీవన్ముక్తుడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 30-Sep-2019, Upd Dt : 30-Sep-2019, Category : General
Views : 166 ( + More Social Media views ), Id : 178 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : good parents , well wisher , illusions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content