Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ఆరోజుల్లో చీపురు, షార్ట్ రేంజ్ మరియు లాంగ్ రేంజ్ ఆయుధం, ఎంత పవర్ ఫుల్ అంటే, అమ్మలు విసిరే యాంగిల్ ను బట్టి, నేరుగా వీపు మీద పడి మోత మోగేది లేదా కాలి మోకాలి కింద భాగం వెనుక వైపు తగిలేది. అంత గురి చూసి రామబాణం లాగా వదిలే వారు, పిల్లల వెంట పరుగులు తీయలేక, ఆయాసం తో. గురి తప్పదు ఎట్టి పరిస్థితుల్లో.
ఓ రెండు సార్లు అలా తగిలితే, ఇంక పిల్లలు చచ్చినా పరుగులు తీయరు. ఎందుకంటే చీపురు కూడా వెనకే పరుగులు తీస్తుంది, అని తెలివైన వాళ్ళ కు బాగా తెలుసు. ఇంకా కష్టం అయిన బాధ చివుక్కుమనేది ఏమిటి అంటే, దెబ్బ పడిన తర్వాత ఏడుస్తూ కూడా ఆ చీపురు ఆయుధం, మరలా మనమే వెనక్కి తేవాలి, అమ్మ చేతిలో పెట్టాలి, లేకపోతే ఇంకోటి పడుతుంది. అంత తల్లుల భయం భక్తి ఉండేవి, ఆరోజుల్లో, పాత రోజుల్లో. అప్పుడు కూడా, మాట వినని పిల్లలు ఉంటారు. మరి ఈ రోజుల్లో?
నాన్న లు కూడా చూస్తూ దూరంగా గమ్ముగా ఉంటారు, నోరు ఎత్తితే, వద్దు లే పాపం అంటే, రెండు ప్రమాదాలు వారికి. ఒకటి వాళ్ళు కూడా తినాలి, సొంఠి మనతో పాటుగా. రెండో ప్రమాదం, ఆ చీపురు ఆయుధం, ఇటు తమ వైపు కూడా రావచ్చు ఏమోనని, సందేహం.
తర్వాత కాలంలో, ఓపిక తగ్గి, అమ్మలు పిల్లలను వదిలి విసుగు తో, భర్తల మీదకు పప్పు గుత్తి, అప్పడాల కర్ర, అట్లకాడల ప్రయోగం, దగ్గర మరియు దూరం రేంజిలో, అవసరాన్ని బట్టి ఉపయోగించేవారు. సూర్యకాంతమ్మ గారి సినిమాలో చూడవచ్చు.
ఆ తర్వాత, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, ఒకరు నొకరు పట్టించుకోకుండా, ఇంటిల్లి పాది ఆరోగ్యం క్రమశిక్షణ గాలికి వదిలి, హయిగా ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ ఉన్నాము.
పిల్లలు వారి మాట వినక, ఎవరూ ఎవరి మాట వినక, పెళ్లి అయినా కూడా సహజీవనం చేస్తున్నట్లు లేదా అద్దెకు ఉన్న జంట లాగా, విడివిడిగా లేక విడి గదుల్లో ఉంటూ, అద్దె లేదా పరాయి పిల్లలు లాగా సాకుతూ, కాపురాలు ముక్కు తూ నెట్టుకొస్తున్నాము. కుయ్యో మొర్రో హైలెస్సా హైలెస్సా అంటూ ఆయాసంతో ఎటువైపు పోతున్నమో తెలీక. ధన మోహం లో, బంధాల విలువ పూర్తిగా పోయింది.
కుదిరితే , పెద్దలైన తమ తల్లి దండ్రులు దగ్గర పిల్లల ను వదిలేసి దూరంగా పెట్టి, మీ బతుకు కూడా చివరకు ముదుసలి తనం లో ఇదేనని, ముందే సిగ్నల్స్ ఇస్తున్నారు.
పిచ్చి తల్లి దండ్రులు అది అర్థం చేసుకో లేక, మత్తులో వ్యామోహం లో, మనవళ్లు ను పెంచి, ఉన్న కొంత చివర శక్తి పోగొట్టుకున్న తర్వాత, హయిగా ఒంటరిగా అనాధలు లాగా లేదా ఆశ్రమం లో, విలువ లేని సత్తువ లేని బతుకు కు సిద్ధమవుతున్నారు. హతవిధీ.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,568; 104 తత్వాలు (Tatvaalu) and views 221,535
Dt : 20-Mar-2020, Upd Dt : 20-Mar-2020, Category : General
Views : 794
( + More Social Media views ), Id : 424
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
moms go after dads
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments