కలిసి ఉంటే కలదు సుఖం - నా వరాల తండ్రీ, ముద్దబంతి పూలు బెట్టి, మేలిమి బంగరు, మంధర మాట - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,966; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కలసి ఉంటే కలదు సుఖం 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. అద్భుతమైన ఆ సినిమాను అందులో పాటలను మాటల అర్ధాన్ని చూడండి. ఉమ్మడి కుటుంబములో కలహాలతో పాటుగా, ఓ దివ్యాంగుడు పడే అవమానాలు కష్టాలు కన్నీళ్ళు ఎంతో హృదయవిదారకం గా చూపించారు.

దివ్యాంగుడిని ఓదారుస్తూ, ఆ యువతి ఇచ్చిన ధైర్యాన్ని చూడండి. అందరికీ ఎన్నో లోపాలు ఉంటాయి, వాటిని మరిపిస్తూ తగ్గించి చూపుతూ, వారిలో ఉన్న మంచిని బయటకి తెచ్చినవారే దేవుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి, భక్తుడు కూడా, అదే దైవ పూజ. బంగారము ఎన్ని మెలికలు వంకరలు పోయినా, దాని విలువ తగ్గదు కదా? దేహములో, చిరు లోపములున్నా, ప్రేమ కరువగునా అంటూ అతనికి ధ్యర్యం ఇస్తుంది. సిమ్హము కాళ్ళు చిక్కుకున్నా, శౌర్యము తగ్గదు కదా? అంటూ ధైర్యం నింపింది.

పెళ్ళి కి కావలసింది, ఆస్తులు అంతస్తులు కాదు, మనసులు అని, ముద్దబంతి పూలు పెట్టి అన్న పాటలో ఎంత బాగా చెప్పారు. పుట్టింటి అరణాలూ, ఘనమైన కట్నాలూ, అత్తవారింట నిండా వేసినా, అవి అభిమానమంత విలువజేసునా? కానీ ఈనాడు ఈ మాటలకు విలువ ఉందా? లేనంత మాత్రాన వీరు సుఖముగా ఉన్నారా? ఆ మాటలలో సత్యం తగ్గుతుందా?

అభిమాన మాభరణం, మరియాదె భూషణం, గుణము మంచిదైతే చాలయా, మన గొప్పతనము చెప్పుకోను వీలయా. చూడండి, మంచి గుణము ఉంటే, పది మందికి దాని గురించి చెప్పుకోవచ్చు, వారినీ ప్రోత్సహించవచ్చు, ధర్మాన్ని కాపాడవచ్చు. దానిని ఎవరూ తప్పు పట్టలేరు. గుణము లేని వారు, కేవలము ఆస్తులు అంతస్తులు ఆడంబరాలు ఆర్భాటాల గురించి మాత్రమే చెపుతారు, ఎందుకంటే వారి దగ్గర అసలైన దేవునికి నైవేద్యం బంగారు గుణం లేదు.

తనే ఓ దివ్యాంగుడు, తనకు ఓ బిడ్డ, ఆ బిడ్డను నిద్రపుచ్చుతూ, లాలిస్తూ, తన పరిస్థితి కష్టాలు ఎలా చెపుతున్నారో చూడండి. నా వరాల తండ్రీ నీవేల పుడితివీ, మా ఇంట అంటూ. నా జన్మమెందుకనీ, నేనే చింతించ, నీవేల పుట్టావూ, బంగరు కొండా అంటూ మన గుండెను పిండేస్తాయి ఆ మాటలు. ఓర్చుకొను సుగుణములో, భూమాత నే మించే, ఉత్తమా ఇల్లాలూ, నీ తల్లీ అంటూ, నువ్వు ఎదిగితెనే మా ఇద్దరి కష్టాలు తీరుతాయని భవిష్యత్ ఆశను చూపించారు.

కలిసి ఉంటే కలదుసుఖం, వేరుబడితే తీరని దుఖం, చెడు బోధలు విన్నారంటే., ఎవరికైన తప్పదు కష్టం అంటూ విడిపోతే వచ్చే కష్టాలు, ఇతరులకు మనము ఎంత చులకన అవుతాము అన్నదానిని ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ మాటలు ఈ నాటికీ నిజము. మనము 1 రాష్ట్రముగా ఉంటే, 100 సమస్యలు ఉంటే, ఇప్పుడు 2 రాష్ట్రాలు గా, చెరో 100 మొత్తము 200 సమస్యలు అయ్యాయి. మరలా ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోవడము, కేంద్రానికి కాగితాలు, వీలైనన్ని అప్పులు. కేంద్రం ముందు బలహీన తిప్పలు.

మంచి సినిమా, మంచి పాటలు గురించి, మంచి మాటలు రాసి, మీలో కూడా చైతన్యాన్ని ఆత్మ విమర్శను కలిగించడము కూడా, మనసుతో దైవానికి పెట్టే నైవేద్యమే. ఆయనకు నివేదించిన ప్రసాదాన్ని, మీకూ పంచి పెడుతున్నాము, పాటలు మాటలుగా. మీరూ అదే బాటను పాటిస్తూ, విలువలను పాటిస్తూ, అరిషడ్వర్గాలను జయిస్తూ, మనశ్శాంతి తో ఉంటారని ఆశిస్తూ . . .

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

1) ఆరుద్ర, ఘంటసాల

నా వరాల తండ్రీ నీవేల పుడితివీ? 2
ఏ ఇంట పుట్టినను, హాయిగా మనగలవు
మా ఇంట పుట్టావా, నా పిచ్చి తండ్రీ ||నా వరాల తండ్రీ||

నా జన్మమెందుకనీ, నేనే చింతించ
నీవేల పుట్టావూ, బంగరు కొండా - 2 లైన్లు 2 సార్లు ||నా వరాల తండ్రీ||

భర్త యను పదమున కు, భరియించు వాడనుచు
అర్ధము చెబుతారు లోకాన - 2 లైన్లు 2 సార్లు
భార్యకు భారముగా, భూమికి భారముగా
బ్రతుకును విధిలేక.., నీ తండ్రి ||నా వరాల తండ్రీ||

ఓర్చుకొను సుగుణములో.., భూమాత నే మించే
ఉత్తమా ఇల్లాలూ.., నీ తల్లీ - 2 లైన్లు 2 సార్లు
నీవెదిగి ఇరువురికీ, నీడ ఇచ్చేవరకూ
నీ తల్లికీ పాట్లు, తప్పవురా
జోజో నా బాబూ, జోజో బాబూ 2

2) పల్లవి :
ముద్దబంతి పూలు బెట్టి, మొగిలి రేకులు జడను చుట్టి,జడను చుట్టి...
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా... చిట్టెమ్మా...
మా ఇంటికేమి తెచ్చావమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా... ||ముద్దబంతి పూలు||

అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది... వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా... కిట్టయ్యా...
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా... చెప్పయ్యా... ||అద్దమంటి మనసు||

తందానె తానెననే, తందానె తానెననే, తనెననేనానే తానేనా హోయ్..
చరణం : 1
పుట్టింటి అరణాలూ... ఘనమైన కట్నాలూ... 1
అత్తవారింట నిండా వేసినా
అవి అభిమానమంత విలువజేసునా, అభిమానమంత విలువజేసునా ||ముద్దబంతి పూలు||
చరణం : 2
అభిమాన మాభరణం.. మరియాదె భూషణం.. 2
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా, గొప్పతనము చెప్పుకోను వీలయా ||అద్దమంటి మనసు||
చరణం : 3
కాలు చెయ్ లోపమనీ... కొక్కెరాయి రూపమనీ...2
ఒదినలు నన్ను గేలి చేతురా, పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా... పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా

ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి 2
నవ్విన నాప చేనె పండదా, నలుగురు మెచ్చురోజు ఉండదా 2 ||అద్దమంటి మనసు|| ||ముద్దబంతి పూలు||

3)
మేలిమి బంగరు, మెలిక తిరిగినా., విలువ తరిగేనా..
నీ దేహములో, చిరు లోపములున్నా., ప్రేమ కరువగునా... ||మేలిమి బంగరు||

సింహము కాళ్ళు, చిక్కుపడిననూ., శౌర్యము కొరవగునా...2
చేతలు మాటలు, ఒకటే ఐతే., త్యాగము కరువగునా...
త్యాగము కరువగునా...||మేలిమి బంగరు||

కాళ్ళే లేని, కమ్మని చంద్రుడు., నిరతము పయయనింతునే...2
కరములు చాపే, కలువను చేరి, ముదము కలిగింతునే...
ముదము కలిగింతునే...||మేలిమి బంగరు||

పతిపద సేవా, భాగ్యము నేనే., సతతము నోచితినీ...2
నీ చల్లని మదిలో, సౌఖ్యము లొసగే, స్వర్గము చూచితినీ...
స్వర్గము చూచితినీ...||మేలిమి బంగరు||


4) మంధర మా.ట విని, మౌడ్యమున కైకే.యి, రామలక్ష్మణులను అడవికి పంపేగదా.
శకుని మా.యలు నమ్మి, జూదమున ఓ.డించి, కౌరవులు పాండవుల కష్టపెట్టిరి గా.
పరుల బోధకు లొంగి, పండువంటి సంసారాన్ని, భాగాలుగా చీల్చి పంచుచుండిరి గదా

కలిసి ఉంటే కలదుసుఖం.., వేరుబడితే తీరని దుఖం
చెడు బోధలు విన్నారంటే., ఎవరికైన తప్పదు కష్టం ||కలిసి ఉంటే||

చిట్టి చీమల.న్ని మూగి., పెద్ద పుట్ట పెట్టును రా 2
శిల్పులందరు కట్ట గా ఉండే., తాజ్మహల్ కట్టెను రా
జనులెందరో త్యాగం చేసి., స్వారాజ్యం తెచ్చిరి రా
తగవులతో తన్నుక చస్తే., పతనము ప్రాప్తించును రా||కలిసి ఉంటే||

పది కట్టెలు ఒకటిగ ఉంటే.., పట్టి విరువ లేరు రా 2
ఒక కట్టె గ ఉంటేనే., వికలము చేసేరు రా
కర్ణుడొకడు చేరకపోతే., భారతమే పూజ్యమురా.
యాదవులే ఒకటిగ ఉంటే., నాశనమై ఉండరురా. ||కలిసి ఉంటే||

కలిసి ఉంటే కలదుసుఖం, మాస్టర్ వేణు
నటీనటులు - నందమూరి తారక రామారావు (NTR), సావిత్రి, యస్వీ రంగారావు, పట్టాభిరామయ్య, హరనాథ్

కలసి ఉంటే కలదు సుఖం 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, సావిత్రి, ఎస్. వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ శ్రీ సారధి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. మాస్టర్ వేణు సంగీతం అందించాడు.

Kalasi Vunte Kaladu Sukham - na varala tandri muddabanti pulu petti melimi bangaru mandhara mata vini  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,966; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185
Dt : 05-Jul-2022, Upd Dt : 05-Jul-2022, Category : Songs
Views : 878 ( + More Social Media views ), Id : 1452 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kalasi , sukham , varala , tandri , muddabanti , pulu , melimi , bangaru , mandhara , ntr , savitri , svr , ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content