Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
2 min read time.
మొన్న కధనము లో, కోకిల కన్నా, కాకి గొప్పతనము ను గురించి చదివాము. 1981 లో వచ్చిన వారాలబ్బాయి సినిమాలో పాట విన్నారా? మురళీమోహన్, మాధవి, జానకి. ఆ కన్నీటి పాట వినండి, సినిమా చూడండి, కింద వీడియోలో.
ఇప్పుడు ప్రశ్న, ఈ లోకాన ఏకాకి ఎవరు? చాలా పెద్ద ప్రశ్న అది, తేలిక కాదు సమాధానము.
ఎవరిని అడిగినా, టక్కున చెప్పేస్తారు, ఓ పెళ్ళి కాని అబ్బాయి అనో అమ్మాయి అనో, కాని అది మాత్రమే నిజము కాదు, అది ఓ భాగము మాత్రమే.
పెళ్ళైన వారు కూడా, వ్యాపార జీతాల కోసమో లేక భాగస్వామిని భరించ లేకో, ఇంట్లోనో విడిగానో, ఒంటరిగా మౌనముగా ఉంటున్నారు, ఉన్నారు జీవచ్చవములా.
అలాగే పిల్లలు పట్టించుకోని తల్లి దండ్రులు కూడా, ఒంటరి వారే కదా? తల్లి దండ్రులు పట్టించుకోని పిల్లలు, దేవుళ్ళు సినిమాలో చూసాము కదా? ఎన్ని ఇళ్ళలో, ఇలాంటి ఒంటరి బ్రతుకులు ఎన్ని చూడటము లేదు?
చదువు ఉద్యోగము కోసం, వేరే ఊళ్ళలో ఎంత మంది తనవారికి, దూరముగా ఒంటరి గా బతకడము లేదు, అన్ని ఉన్నా? ఇక జీవిత భాగస్వామి గతించిన వారు ఎందరో కదా?
అంతెందుకు, గతములో ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అధికారి గా చేసిన వారు, పదవి పోగానే, వారూ ఒంటరి బ్రతుకే కదా, ఇంటికి ఎప్పుడులా 100 మంది రారు కదా, బోసి పోతుంది.
కాబట్టి, ఎటు చూసినా, భౌతిక మాయలో పడి, మన అందరివి ఒంటరి నటనా బ్రతుకులే. అందరమూ అద్దెకు కొంతకాలని కే వచ్చి, ఈ భూమి మీద పడి, అన్ని దోచుకుని తిని బతికి, ఎప్పుడైనా ఉత్తచేతులతో, కావు కావు మంటూ ఏడుస్తూ, ఎగిరిపోయే ఒంటరులమే. అది గ్రహిస్తే, ఇన్ని మోసాలు మాయలు కుట్రలు ఉండవు కదా?
కాకమ్మ కాకి కలవళ్ళ కాకి లోకాన ఏకాకి 2
ఏ వాడ నుంచో, ఈ వాడ కొచ్చి,
కడవళ్ళ కన్నీళ్ళ కధ చెప్పుకుంటుంది. ||కాకమ్మ కాకి||
బతుకంత చితుకేరి గూడేసినా, జత లేని తన గుండె చితి రేగినా, - 2
రాకాసి ఆకాశమే ఉరిమినా, జడి వానతో గూడు తడిపేసినా,
తడి రెక్కలు ఆరని పూట, తన డొక్కల ఆకలి పాటా - 2
కావు కావు మంటూనే, కాలం గడిపేస్తుంది - 2
అరగాగి పోతున్న మాకడుపులో, కొరగాని మీ పిడచ పిండాలతో - 2
నరజాతికే వరము లిస్తామురా, పరలోక సుఖశాంతి తెస్తాము రా
ఈ ఆకలి కాకుల పాటా, లోకానికి వేకువ బాటా 2
ఏ పూటా పాడాలంటా, కాకెంగిలి కావాలంటా - 2
song in the movie Varalabbai - Murali Mohan, Madhavi, Janaki, satyanarayana.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,838,032; 104 తత్వాలు (Tatvaalu) and views 221,656
Dt : 09-Mar-2021, Upd Dt : 09-Mar-2021, Category : Songs
Views : 2179
( + More Social Media views ), Id : 1018
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
kakamma kaki ,
kalavalla kaki ,
lokana ekaki ,
kaki ,
crow ,
single ,
alone ,
varalabbayi ,
telugu ,
movie ,
songs ,
Murali Mohan ,
madhavi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments