జగన్ గారు, ఎమ్మెల్యే, అధికారులు, ఎంపీలు, మంత్రులుకు, ప్రతిపక్షమునకు రాష్ట్రం లోనే ఉత్తమ వైద్యం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,460; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జగన్ గారు, మన ఎమ్మెల్యేలు, అధికారులు, ఎంపీలు, మంత్రులు ను, ప్రతిపక్ష నాయకులు ను, మన రాష్ట్రం దాటి వెళ్ళడానికి అనుమతించవద్దు, కరోనా లేదా ఇతర వైద్యం కు, అత్యంత ప్రాణాపాయ స్ధితిలో తప్ప, అని ప్రజల భావన, మన ప్రభుత్వ వైద్యం కు మంచి పేరు రావాలంటే. మనవాళ్లు రెండు వారాలు ఇతర రాష్ట్రంలో గొప్ప వైద్యం తో తిరిగి వస్తే, ఇతర రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం మన దగ్గర చాటుతున్నట్లే గదా, నోటి తో చెప్పకపోయినా.

అలాగే ఇతర రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు నాయకులు నుంచి, తమ ఆంధ్రా రాష్ట్రంలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు కాబట్టి, మీ రాష్ట్రం కు వస్తున్నాము అని కాగితం రాపించి అనుమతి ఇస్తే, ఆ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు గర్వంగా, ఇంతమంది ఆంధ్రా అధికారులు మరియు శాసనసభ్యులకు మేము వైద్యం చేసామని ప్రకటిస్తే, మన పరిస్థితి ఏమిటి? పేపరు వార్తలు కూడా, చాలు కదా నిరూపణకు.

ఎందుకంటే మన ప్రభుత్వ పరువు, మనం తీసుకున్నట్లే కదా? మన నవరత్నాలతో, మార్పులు రాలేదని ఒప్పుకున్నట్లే కదా? మన ప్రభుత్వం, ప్రజల ధనం తో సౌకర్యాలు మరియు హోదా వాడుకుంటూ, అధికారులు నాయకులు ఇతర రాష్ట్రాల్లో వైద్యంకు ఎలా వెళతారు, తమ నియోజకవర్గ ప్రజలను ప్రభుత్వం ని వదలి? మన నాయకులు ఎందుకు ఇలా, చెడ్డ పేరు, తెస్తున్నారో తెలీదు. మీ పట్ల, మన ప్రభుత్వం పట్ల మరియు ప్రజల పట్ల కృతజ్ఞతలు చూపడం లేదు కదా దీని వలన.

దీనిని చూసి భయపడి, ప్రజలు కూడా అలాగే ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే, మన వైద్యం మీద నమ్మకం లేనట్లే గదా? మన ఆదాయం బయటకు వెళుతుంది కదా? సంవత్సరం గా, మనమూ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ మరియు అపోలో స్ధాయిలో కట్టలేకపోయాము అంటే, అందరము ప్రజలను ఎంత మభ్య పెడుతున్నామో కదా? చంద్రన్న, ఐదేళ్లు గా ఆ పని చేయలేదు, బహుశా చేయరు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు.

కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే, వీరంతా తమ ఇళ్ళు లో, తమ ఊర్లలోన ఉండాలి కదా? స్ధానిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ, రోజూ ఆసుపత్రిలో సౌకర్యాలు ను భోజనం ను వారే ఫోటోలు వీడియో లు తీస్తూ, స్ధానిక తమ సోషల్ మీడియా లో, మన ప్రభుత్వం ను పొగుడుతూ పెడితే, ఇక ప్రతిపక్ష నేతలకు నోరు పెగలదు. అధికారులు కూడా బుద్ధి గా, అన్ని సౌకర్యాలు బాగు చేస్తారు.

ప్రతి పక్ష నాయకులు కూడా చీటికి మాటికి, వ్యాపార లావాదేవీలు కోసం, కుటుంబం కోసం, ఆంధ్రా ప్రజలను వదిలి హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ పెడితే ఎలా? మీకు అవి ముఖ్యంగా ఉంటే, అక్కడనే ఉండాలి. ఒక కాలు ఇటూ, ఒక కాలు అటు వేస్తే ఎలా? ప్రజల ప్రాణాలు, అవసరాలు, మీకు అవసరం లేదనేగా? హైదరాబాద్ లో ఉండి, 3 రాజధానుల గురించి మాట్లాడితే ఎలా. అమరావతి రైతులు కు దగ్గర ఇక్కడ ఉండాలి కదా మీరు ఎల్లప్పుడూ, అని ఎవరూ గట్టిగా అడగరా?

మరి బీజేపీ, జనసేన కూడా ప్రజలకు అండగా ఉండటం లేదు అనిపిస్తుంది, రోజూ ఈ తప్పులు ఎత్తి చూపుతూ, ఇవన్నీ జగన్ గారి మరియు ప్రజల దృష్టికి తీసుకెళుతూ, పోరాడితే కదా కొన్ని స్ధానాలైనా వచ్చేది, తెలంగాణ బీజేపీ లాగా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,460; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604
Dt : 05-Aug-2020, Upd Dt : 05-Aug-2020, Category : General
Views : 782 ( + More Social Media views ), Id : 630 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , best medicine , corona , treatment , andhra , state , hospital , mla , officials , mp , ministers , opposition
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content