APLatestNews.com top Banner

Social Media links
జగన్ గారు, ఆ ఊరు ఎమ్మెల్యే ఎంపీ గారిని, ఆ జిల్లా అధికారులని, డిప్యుటేషన్ పై తేగలరా? - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

జగన్ గారు, మీరు చాలా కష్టపడుతున్నారు, ధన్యవాదములు. గాడి తప్పిన, ఆంధ్రా ను, గాడిలో పెడతానికి ఎంతో క్రుషి చేస్తున్నారు, అధికారుల మీటింగ్ ల లో మీ ప్రయత్నాలు గమనించాము. మీది తప్పు ఏమీ లేదు. కానీ అధికారులు ఎమ్మెల్యేలు మాత్రము, మీ మంచిని మరియు కష్టాన్ని, తాము పాటించి, చూపలేక పోతున్నారు. అందుబాటులో లేరు లేదా జవాబు లు చెప్పరు.

మీరు కరోనా ఆసుపత్రి బెడ్లు దొరకడము లేదు, లెక్క పెట్టమంటేనే, అప్పుడు లెక్క పెడుతున్నారు అధికారులు. కెమేరాలు, మీరు పెట్టమంటేనే పెడుతున్నారు.

మా వూరు మా జిల్లా వారిని ఏమన్నా అంటే, వారికి కోపము వస్తుంది. విన్నపాలు వినవలే అని వాట్సాప్ ఈమైల్ లో పెట్టినా, జవాబు చెప్పరు చూడరు, లేదంటే వాట్సాప్ ఫోన్ ఆపుతున్నారు.

కాబట్టి, ఇతరుల గొప్ప తనాన్ని పొగిడి, వారి చేతనన్నా మా జిల్లాను అభివ్రుద్ది బాటలో తెస్తారు అన్న ఆశతో అడుగుతున్నాము తప్ప ఇంకో ఉద్దెశ్యము లేదు, మన్నించ గలరు. జగన్ గారు, మాపై దయవుంచి ఆ ఊరు ఎమ్మెల్యే ఎంపీ గారిని, ఆ జిల్లా అధికారులని, డిప్యుటేషన్ పై తేగలరా? రీకాల్ అవకాశము లేదు, అది వచ్చేసరికి, చాలా సమయము పడుతుంది, ఇది తెలిక గదా.

చిత్ర విచిత్రమైన కోరికే అయినా, అసాధ్యమని తెలిసినా, ఏమి చెయ్యాలో తెలియక అడిగే విన్నపము ఇది. కనీసము, వీరిని నచ్చచెప్పి అయినా పని చేయించాలి లేదా, కొత్త వారిని తెప్పించి పని చేయించాలి. జగనన్న కు మంచి పేరు తేవాలి కదా.

ఒక గవర్నర్ 2 రాష్ట్రాలకు, ఒక కలెక్టర్ లేదా అధికారి, 2 జిల్లాలకు మరియు పనులకు, నియమించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే, ఎమ్మెల్యే డిప్యుటేషన్ అనేది, కొత్త విషయము ఇక్కడ.

** గౌరవ బాపట్ల లేదా తిరుపతి ఎమ్మెల్యే గారు - మా చీరాల నియోజక వర్గానికి, వీరు డిప్యుటేషన్ మీద ఓ 2 యేళ్ళు వస్తే, స్థానికము గా ఎమ్మెల్యే నివాసము ఉండటము ఎలా? జనము తో కలసి పని చేయడము, తిరగడము ఎలా? కొత్త జిల్లా, హార్బర్, చేనేత పార్క్, రింస్ నింస్ లాంటి అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి, తేవడం ఎలా? అభివ్రుద్ది అంటే ఏమిటి? అని ఒక 2 ఏళ్ళు ఇక్కడ ఉండి, అభివ్రుద్ది చేయించి, ప్రజలకు అప్పగించి వెళతారు.

తెలంగాణా సీతక్క గారు కావాలి కాని, పక్క రాష్ట్రము కాబట్టి, కేసీయార్ గారితో మాట్లాడాలి కాబట్టి, ప్రస్తుతానికి వద్దు.

** గౌరవ ఎంపీ గారు - ఇంకా ఎంపిక చేయలేదు, మన్నించాలి. తర్వాత తెలియపరుస్తాము.

** గౌరవ చిత్తూర్ కలెక్టర్ గారు - వీరు మా ప్రకాశం జిల్లాకు వస్తే కనీసము కొంత కాలము, జిల్లా మరియు స్థానిక అధికారుల చేత ఎలా టీం వర్క్ చేయించాలి? సోషల్ మీడియాలో ప్రభుత్వ పధకాల సమాచారం ఎలా ప్రజలకు అందించేటట్లు చేయాలి? తాను కష్టపడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇతర అధికారులను ఎలా ఉత్సాహ పరచాలో చేసి చూపించి నేర్పుతారు.

** గౌరవ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గారు - వీరు మా ఒంగోలు కి వచ్చి దానితో పాటుగా చిన్నదైన చీరాల అభివ్రుద్ది కి సూచనలు సలహాలు అందిస్తూ, సోషల్ మీడియా సమాచారం ప్రజలకు, ప్రజలతో కలసి, ప్రజలతో తిరుగుతూ కష్టపడటము చేసి చూపించాలి ఓ 2 సంవత్సరములు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 753 General Articles, 46 Tatvaalu
Dt : 14-Sep-2020, Upd Dt : 14-Sep-2020, Category : Request
Views : 81 ( + More Social Media views ), Id : 698 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , mla , mp , municipal commissioner , collector , district officer , deputation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content