Host a National Flag, స్వేచ్చా భారతం, ఇంటి పై మువ్వన్నె జాతీయ జండా - Jan 26, Aug 15 - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,443; 104 తత్వాలు (Tatvaalu) and views 225,152.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Spirituality requires gratitude, trustworthiness, responsibility, selflessness, practicality, devotion and sacrifice, without which we cannot be devotees of God.

If we have love, responsibility, gratitude on our aged Mom and Dad then we will have same love on elders, partner, kids, mother tongue, place (Town/ District/ State/ Country) of birth, friends, relatives, native language guru and God.

If we have love on one thing or person only then something wrong in mind, it may be acting, for opportunity and need.

As usual every year from 2019, we are reminding about keeping country flags on or at home always or at least for 2 important dates. Please remind your people, friends and relatives.

Both Jan 26 and Aug 15 are the biggest festival days, for true patriotic Indian folks.

Can we try to host a small national flag on or at our home for Independence day Aug 15th and Jan 26th?

Every village in America will have an national flag on most of the homes always. Public will celebrate that special day as a biggest festival. Particularly for independence day (July 4th), they will try to keep the American National flag on their houses.

Each village/city also may have fireworks to celebrate the Independence day. We are following many western cultures even for unnecessary things like jeans, burger, pizza.

Can we follow this simple tradition for good to keep our Indian national flag on our house on Aug 15th and Jan 26th?

We can buy and keep a small national flag on our house for 20-50 rupees and distribute to others. Please share with friends relatives and encourage them.

July 2022 Update - We started this program sometime in 2019. Now the central government also wants the same.

Participate in Har Ghar Tiranga Abhiyaan grand program as part of Azadi Ka Amrit Mahotsav Azadi Ka Amrit Mahotsav. Let's hoist the national flag on our house and honor the Tricolor flag from 13th to 15th August.

ఆధ్యాత్మికతకు క్రుతజ్ఞత, విశ్వసనీయత, బాధ్యత, నిస్వార్ధం, ఆచరణ, స్తితప్రజ్ఞత, త్యాగం ఉండాలి సుమా, అవి లేకుండా, దేవుని భక్తులము కాలేము. దేశ భక్తులము కాకుండా, దైవ భక్తులము కాలేము.

కని పెంచిన ముదుసలి తల్లి తండ్రి మీద ప్రేమ బాధ్యత క్రుతజ్ఞత ఉంటే, భాగస్వామి మీద, పిల్లల మీద కూడా ఉంటుంది. అలాగే కన్న సొంత భూమి (ఊరు), జిల్లా, రాష్ట్రం, దేశం, భాష, స్నేహితులు, బంధువులు, తెలుగు గురువు, దేవుని మీద కూడా ఉంటుంది.

అది ప్రతి రోజూ, ప్రతి పనిలో మాటలో బయటపడుతుంది. అలా కాకుండా, కేవలం కొంత మంది మీదే, కొన్నిటి మీదే, ప్రేమ బాధ్యత ఉంది అంటే, అది కేవలం సమయానుభవ నటన అవసరం అవకాశవాదం. ఫలితాలు తప్పవు ఆ నటనకు, కాలచక్రము లో.

మాత్రుమూర్తి కన్నా మాత్రుదేశం గొప్పది అంటారు విజ్ఞులు. అందుకే, 2019 నుంచి ఏళ్ళు గా మీకు గుర్తు చేస్తూనే ఉంటాము విసుక్కున్నా తిట్టుకున్నా, సొంత మాటలతో మాత్రుభాష లో.

మీరు కూడా, మీ స్నేహితులు బంధువులకు ఇంట్లో వారికి గుర్తు చేసి, ఇంటి మీద, ఇంట్లో కూడా, జాతీయ జెండాలు పెట్టిస్తారు కదూ ఎప్పుడూ లేదా, కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా?

ఎంతో మంది అమర వీరుల మరణంతో, మనము ఈ రోజున స్వేచ్చా వాయువులు పీలుస్తున్నాము. బయట దేశాలతో పోలిస్తే, మనకున్న స్వేచ్చ, ఎక్కడా లేదు. భరత మాత ముద్దు బిడ్డలుగా, మనము గర్వించాలి.

జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) మరియు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినం, మాత్రు దేశభక్తి గల ప్రజాస్వామ్య భారతీయులకు, ప్రత్యేకమైన పండుగ రోజులు. ఆగస్ట్ 15 ని చాక్లెట్ల పండుగ అంటారు, స్కూల్ కు వెళ్ళే చిన్న పిల్లలు ముద్దుగా.

1950 జనవరి 26 న, భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం, అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు 15 న, భారతదేశం, వందల ఏళ్ళ ఆంగ్లేయుల బానిసత్వ సంకెళ్ళ నుండి విముక్తి పొందింది.

అమెరికాలో ప్రతి గ్రామంలో, అత్యధిక గృహాల మీద, అమెరికా జాతీయ జెండా ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రజలు, అమెరికా స్వాతంత్ర దినం రోజు, ఒక ఉత్సవం లేదా పండగ లాగ జరుపుకుంటారు.

ముఖ్యంగా అమెరికా స్వాతంత్ర దినం రోజు (జూలై 4), వారు ఇంటిపై జాతీయ జెండా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ప్రతి గ్రామంలో/ నగరంలో స్వాతంత్ర దినం రోజు, బాణాసంచా కాలుస్తారు.

మనము అనేక పాశ్చాత్య సంస్కృతులు, పద్దతులు అవసరం లేకపోయినా అనుసరిస్తున్నాము కదా. మాడు పగిలే ఎండలో కూడా, చలి దేశాల్లో వాడే, మనకు అక్కరలేని జీన్స్ వాడతాము. చక్కని ఆరోగ్య ఇడ్లి పుల్కా పెరుగు అన్నం ఉన్నా కూడా, పిజ్జా బర్గర్ తిని రోగాల పాలు అవుతాము. వారిని చూసి, సంవత్సరానికి ఒకసారి అవసరం లేని, తల్లి తండ్రి ప్రేమ దినాలు కూడా జరుపుతాము.

మరి అలాగే, మంచి పని లో భాగము గా, మనము భారతదేశం లో, మన ఇంటిపై మన ఇంట్లో కూడా, మన భారత జాతీయ జెండా ఉంచేందుకు, ప్రయత్నిద్దామా, కనీసము ఆగస్ట్ 15 న, జనవరి 26 న?

బోర్డర్ లో యుద్దం చేయలేము, అధర్మానికి ఎదురు నడవలేము, చుట్టుపక్కల వారికి ఇంట్లొవారికి మంచి చెప్పలేము సంస్కారం నేర్పలేము, కనీసం ఇంట్లో జెండా పెట్టడానికి కూడా, మన దేశానికి మనము పనికి రామా?

మనము 20-50 రూపాయలకు, చిన్న జాతీయ జెండా కొని, ఇంటిపై పెట్టలేమా, పదిమందికి పంచలేమా? ఆలోచించండి. స్నేహితులతో బంధువులతో ఇరుగుపొరుగు తో ఈ విషయాన్ని పంచుకొండి, వారిని ప్రోత్సహించండి.

రిపబ్లిక్ డే రోజు, ముందు చూపుతో 6 నెలల ముందు గుర్తు చేసుకుందాము. పోయిన సారి కొంత మంది అన్నారు, నిన్న చెప్పిన, కొని పెట్టేవాడిని అని, పండగ సగం అయినది ఈరోజు ఆదివారం అని. మరి ఇప్పుడే 4 జండా లు కొని ఇంట్లో ఉంచండి. నాలుగు వైపులా ఉంచవచ్చు లేదా నలుగురు కి పంచవచ్చు.

మన జాతీయ జెండా త్రివర్ణ పతాక రూపశిల్పి, పింగళి వెంకయ్య గారు , 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించారు.

ఒక్క సారి మధ్యధరా సముద్ర దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఇతర మత దేశాలలో సామాన్య జనం బతుకులు, స్వేచ్ఛ ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. మనం ఎంత స్వేచ్ఛ గా బతుకుతున్నామో. ఆఖరికి పాశ్చాత్య దేశాల లో కూడా మన కున్న స్వేచ్ఛ లేదు.

ఇటువంటి చిన్న పనులతో నైనా, దేశ భక్తిని క్రుతజ్ఞతలను చాటి, పిల్లలకు ఆదర్శముగా నిలబడలేమా?

జులై 2022 సమాచారం - మనం ఎప్పుడో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, 2019 లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే కోరుతుంది.

ఆజాది కా అమృత్ మహోత్సవ లో భాగంగా జరుగుతున్న, హర్ ఘర్ తిరంగా అభియాన్ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆగష్టు 13 నుండి 15 వరకు, మన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందాం.#harghartiranga

https://harghartiranga.com/  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,443; 104 తత్వాలు (Tatvaalu) and views 225,152
Dt : 13-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 2341 ( + More Social Media views ), Id : 36 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : indian national flag , independence day , keep a flag at home , pingali venkayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content