వెళితే వెళ్ళండి కానీ, ఆస్తి మొత్తం నాకే రాసి ఇచ్చి, ఓ లక్ష తీసుకుని వెళ్ళండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,510; 104 తత్వాలు (Tatvaalu) and views 225,917.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒరే పనికిమాలిన చవట, మీ నాన్న కు ఎటూ ఎక్కదు, ధన మత్తులో చెవిలో దూరదు, నువ్వు అయినా, మీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడురా.

ఏందమ్మా ఎప్పుడూ లేనిదే తిడతావు అలా, మర్యాద లేకుండా, పెళ్ళాము ముందు.

ఒరే త్రాష్టుడా, పిల్లల తండ్రి వి, ముప్పై దాటినా, వ్యాపారం చేయడం రాదా? మాట్లాడటం రాదా? యదవలా ఇంట్లో దాంకుంటావు. మేమొచ్చి షాపులో కూర్చుని, ఈ వయసు లో, నీకు ఊడిగం చేయాలా?

మా నాన్న గానీ, మొగుడు కానీ, మాకీ ఖర్మ పట్టించలేదు, ఏనాడూ బయటకు వచ్చి కనపడలేదు. నీ చేతగాని తనం వలన కదరా, మాకీ పాట్లు, జనం తో చీవాట్లు.

అమ్మా, చిన్నప్పుడే తిట్టిన కొట్టిన, బాగుపడే వాడిని కదా. ఇప్పుడు, ఒకేసారి అన్ని నేర్చుకోవాలి అంటే కష్టం కదా.

అవును రా, మేము తప్పు చేశాం కాబట్టే, ఇప్పుడు అనుభవిస్తున్నాము. మేము బతికున్నప్పుడే ఇప్పుడు అయినా, మంచి మర్యాద నేర్పాలి. కనీసం ఇప్పుడు అయినా, బుద్ధి గా నేర్చుకో.

సరే, ఓ పక్కన మా ఇంట్లో మరియు బయట తగువులు. ఇప్పుడు నువ్వు మొదలెట్టావు తలనొప్పి, దూరంగా ఇంకో ఇంట్లో ఉంటూ కూడా. సరే చెప్పు అమ్మా. ఏం చేయమంటావో, చేస్తాను.

మీ అన్నకు ఫోన్ చేసి చెప్పు. మా పరువు పోతోంది, మా ముసుగు తొలుగుతుంది, మా నాటకాలు బయట పడుతున్నాయి. మేం చుట్టాలు, పిల్లలు, ముదుసలి వారి ధనం దొంగిలించడాని కైనా వెనకాడం అని, వడ్డీ ఇవ్వము, వేరోచోట తెచ్చుకోనివ్వము అని. నాన్న మరియు మన కుటుంబ, నిత్య అబద్ద లేదా మౌన వ్రతాల రంగు తెలిసిపోతుంది. ఇంక మెసేజ్ లు పెట్టవద్దు, ఊరు జిల్లా రాష్ట్ర జనానికి. మీ డబ్బులు ఎక్కడ కు పోవు, మీకు మొత్తం లెక్క కట్టి ఇస్తాము, మేము కూడా హామీ అని. ఇప్పుడు కావాలంటే వెంటనే, 50 ఇస్తాము అని చెప్పు.

నాకు ధనం ఉన్న బడాబాబుల, గాలి పిల్లలతో గాలికి తిరగడం తప్ప, బాధ్యత గల వారితో మాట్లాడటం రాదు కదా అమ్మా. కనీసం గుమస్తాలు ను కూడా, మనిషి గా చూడను. మన చుట్టాలు అయినా, మన కన్నా తక్కువ ఆస్తి అంతస్థుల వారితో, ఎప్పుడూ సరిగ్గా మాట్లాడనే. నా వల్ల కాదు, ఇలాంటి వి.

తప్పు రా, బయటకు జనము వినేటట్టు అలా అనకు. మీ అన్న విదేశాల్లో ఉండీ, గుమస్తాలు దేవుళ్ళు అని, దండం పెడుతున్నారు. అందుకే ముందు చుట్టాలు తో మాట్లాడు అంది.

సరేనమ్మా, వాళ్ళు 10 లేదా 15 అంటుంటే, నువ్వు 50 ఇస్తామని చెప్పమంటావేంది. గబుక్కున అలాగే ఇవ్వమంటే, మనకు నష్టం కదా. ఊరక జనం సొమ్ము దొబ్బాలి కానీ, మన సొమ్ము ఊరక ఇవ్వడం ఏమిటి? తిక్కా?

ఒరే పనికిరాని వాడా, నీకు మంచి పెంపకం, సంస్కారం, మర్యాద, నీతి నేర్పాలి అని అలా చెప్పాను. బయటవారిని అడగమనను కదా. నువ్వు అడిగి చూడు, మీ అన్న ఏమంటాడో తెలుసా, విను?

మీ లాగా ఊరకొచ్చే, జనం డబ్బు కు కక్కుర్తి పడం. మాది లెక్క గట్టి, వచ్చిన వరకే ఇవ్వండి. మీది రూపాయి ఎక్కువ, మాకు వద్దు అంటారు. అదీ సంస్కారం అంటే. అలాంటి వారు, తిట్టినా, మనకు దీవెనే. మనం నమ్మదగిన వ్యక్తులు వాళ్లు, మన చుట్టూ ఉండి గోతులు తీసే జనం చుట్టాలు కన్నా.

కనీసం, ఇప్పుడు అయినా బాధ్యత, సంస్కారం, పెద్దలు అంటే గౌరవం, ఎవరితో ఎలా మాట్లాడాలి, నేర్చుకోవాలి కొడుకా. ముందు చుట్టాలు తో మాట్లాడుతూ నచ్చ చెప్పు, తర్వాత బయట జనం. ఆ తర్వాత, నీ తల్లి దండ్రులు అయిన, మా ఇద్దరి కీ విశ్రాంతి ఇవ్వు. మా చివరి రోజుల్లో నరకం చూపించకు. మేము జనం కు మోసం చేస్తున్న, నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు. లేదంటే, మేమూ వెళ్లి వాడితోనే ఉంటాము. మంచి గా నీకు తిక్క కుదురుతుంది.

అమ్మా, వెళితే వెళ్ళండి కానీ, ఆస్తి మొత్తం నాకే రాసి ఇచ్చి, ఓ లక్ష తీసుకుని వెళ్ళండి, దారి ఖర్చులు కు.

ఓరి నాయనో, నిన్ను మీ నాన్న ను, ఆ ధన వ్యామోహం నుంచి, ఎవరం బయటకు లాగలేము. కళ్ళు తెరవరా ఇప్పుడు అయినా, చివరలో ఎవరూ, మూట వెంట తీసుకుని పోలేదు రా పైకి, దరిద్రుడా అని తల్లి మందలించింది.

తల్లి దండ్రులు ఇలా మొదటినుంచి బాధ్యత నేర్పితే, ఆ పిల్లలు నేర్చుకుంటే, అందరూ ఎంత హాయిగా సంతోషముగా ఉంటారో కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,510; 104 తత్వాలు (Tatvaalu) and views 225,917
Dt : 05-Mar-2020, Upd Dt : 05-Mar-2020, Category : General
Views : 907 ( + More Social Media views ), Id : 381 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mother son discussion about values
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content