ఆత్మాభిమానం లేని 4 గురు టీడీపీ ఎంపీలు, బీజేపీలో చేరడం తప్పు అయితే, మరి బీజేపీది తప్పు కాదా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,964; 104 తత్వాలు (Tatvaalu) and views 225,004.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏమండీ, ఆత్మాభిమానం లేని 4 గురు టీడీపీ ఎంపీలు, బీజేపీలో అవకాశవాదముతో చేరడం తప్పు అయితే, మరి వారిని చేర్చుకున్న బీజేపీది తప్పు కాదా?*

జవాబు - చాలా మంచి ప్రశ్న. ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి, ఒక పదం మీరే ఒప్పుకున్నారు - ఆత్మాభిమానం లేదు అని, సంతోషం. 4 పార్టీలు మన పిల్లలే సుమా, మన గుణాలే. మన విశ్లేషణలు ఎక్కువశాతం గుణం ను బట్టి, నిష్పక్షపాతముగా మాత్రమే ఉంటాయి.

అది అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం గా కనపడుతుంది, ఆ నాయకుల ప్రవర్తన గమనిస్తే, సోషల్ మీడియాలో. వారు దానిని దాచుకోలేరు. వారి సోషల్ మీడియా చూసి, వారి జాతకము చెప్పవచ్చును.

మన మాటలు 20 మందే చదివినా, 80 మంది అంగీకరించకపోయినా, నిజము మారదు, పంచభూతాల శిక్షలు తప్పవు. జిల్లా మంత్రికి, ఆయన నాయకునికి జరిగిన విషయము చూసాము.

ముందు మన నాయకుల తప్పులు ఒప్పుకుని, తర్వాత బీజీపీ తప్పునో ఒప్పునో చూద్దాము.

ఎంటీయార్ తెదేపా లక్ష్యం, కాంగ్రెస్స్ కు వ్యతిరేకముగా పోరాడుతూ ఉండటం, డిల్లీ వీధుల్లో తెలుగు వారి ఆత్మాభిమానం తాకట్టు పెట్టవద్దు, అని మంచి ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యం కు అందరమూ అనుకూలం.

కానీ చంద్రన్న తెదేపా లో, అసలు ప్రారంభమే వెన్నుపోటు, ఆ తర్వాత వీలైనన్న సార్లు అవసరానికి, ఆత్మాభిమానం లేదా దేనినైనా తాకట్టు పెట్టు. ఆత్మ చంపుకో, అవసరానికి అవకాశానికి లొంగిపో, లొంగితాము.

తెలంగాణా ఎన్నికల్లో, చంద్రన్న సోనియమ్మ తో ఫోటోలు చూసాము, ముక్కున వేలేసుకున్నాము. సీబీఐ నిషేదం, మోదీ గోబాక్ లాంటి విచిత్రాలు ఎన్నో చూసాము.

నానీ వంశీ లాంటి ఉత్తమ సంస్కార మాటలు గలవారిని పెంచి పోషించింది చంద్రన్నే. ఇప్పుడు వారే చంద్రన్న, నిజ స్వరూపము బయటపెడుతున్నారు వాడి వేడి మాటలతో. వీరిద్దరి మాటలు కొంత కటువుగా కష్టముగా ఉన్నా, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు.

మన లాగా, మెత్తగా చెపితే ఎవరూ వినరు కదా? వారి లాగే చెప్పాలని, చంద్రన్న పాఠాలు నేర్పారు, ఇప్పుడు అవే తిప్పి అప్పగిస్తున్నారు.

ఇప్పుడు ఈ 4 గురు ఎంపీలు. వీరు కడు పేద వారు, చూడండి వారి ఆదాయము.

టీడీపీ ఎంపీలు వై ఎస్ చౌదరి (189 కోట్లు+), సిఎం రమేష్ (258 కోట్లు+), గరికపాటి మోహన్ రావు (38 కోట్లు+), టీజీ వెంకటేష్ (86 కోట్లు+) ఆ రోజు బీజేపీలో చేరారు.

నీతి నిజాయితీ సంస్కారము క్రుతజ్ఞత గల వారు, వీరికన్నా బీదవారు ఇంకెవరూ ప్రజాసేవ చేయలేరు అని చంద్రన్న టిక్కెట్లు ఇచ్చారు. వీరిని, ఎట్టి పరిస్తితిలోనూ చంద్రన్న బినామీలు అని ఎవరూ అనరు సుమా, అంత నిబద్దత గా ఉంటారు. ఈ రెండు పద్దతిలో ఒకటి అని అందరూ అనుకుంటున్నారు.

1) దోవ 1 - కేసులకు భయపడి వెళ్ళారు 2) దోవ 2 - చంద్రన్నే వారికి బొట్టు కాటుక పెట్టి పంపారు

ఉదాహరణకు 2 వ దోవలో, నాని వంశీ కేశినేని లాంటి వారిని, మీరు ఆ పార్టీ సభ్యులు గా నటించండి అంటే, వారు ఒప్పుకుంటారా? బహుశా పార్టీ అయినా వీడతారు గానీ, అలాంటి తప్పుడు పనులకు, ఆత్మాభిమానం చంపుకుని ఒప్పుకోరు. అలా చేస్తే ఆత్మను చంపుకుని, ఇంట్లో బంధువులలో స్నేహితులలో, విలువ ఉండదు. విడిచేసింది, వీధికి పెద్ద అన్న సామెత ఉంది కదా?

చంద్రన్న కే, మంచి చెడు చెప్పడానికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్న, ఎంపీ కేశినేని మీద, ఎన్ని వంకర ప్రయత్నాలు చేస్తున్నారో, మనము చూసాము. ఆఖరికి కుటుంబములో కూడా చిచ్చు పెట్టారు.

పాము తన గుడ్లను తినడానికి అయినా, వెనకాడదు.

చంద్రన్న తన మూర్ఖత్వాన్ని వీడరు. మనము కూడా, తెదేపా భవిష్యత్ సంక్షేమం కోసము, కొన్ని పాయింట్లు అందరితో పంచుకున్నాము. కానీ, వారు వినరు. అధికారం లో లేనప్పుడే వినరు అంటే, ఇక ఉన్నప్పుడు వింటారా?

మా చీరాల ఎమ్మెల్యే కరణం కూడా, ఇదే బాటలో, రాజీనామా చేయకుండా, వైసీపీ నీడ లోకీ చేరారు. చూస్తున్నారు కదా, మాకు చీరాల జిల్లా, నింస్ లాంటి ఆసుపత్రి, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్ అన్ని తెచ్చేసారు/ ఇంకో 10 ఏళ్ళు కైనా తెస్తారు కదూ? కేవలం వీటి కోసమే గోడ దూకారు అని మేము ఇంకా వెర్రి ఆనందములో ఉన్నాము.

సరే, పై 2 దోవలు లో ఏది నిజమైనా, మన చంద్రన్న ఏమి చేయాలి? వీరు అంతా తెదేపా ద్రోహులు అని ముద్రవేసి, పచ్చ మీడియాలో నిరంతరము ప్రచారము చెయ్యాలి. మరి చేసారా? వారిని బహిష్కరించమని, ధర్నాలు చేయాలి, చేసారా?

ఏదీ లేదు, అంతా తోడు దొంగలు గా, ప్రశాంతముగా ఉన్నారు. ఆత్మాభిమానం అవమానం నీతి నిజాయితీ అన్న పదాలు పాతేసారు. కేవలము కుట్ర, కుతంత్రము, మోసము, అవసరము, అవకాశము, ఇవే మన నినాదాలు.

ఇతర వర్గ మహిళ, పోతుల సునీత తో రాజీనామా చేయించారు, పట్టుబట్టి సుమా.

పార్టీ లో ఎవరైనా ఎదురు తిరిగితే, వారిని పిచ్చి వారిగా చూపించి తొక్కెస్తారు.

ఒక గుడ్డును తిన్న పాము, మిగతా గుడ్లను మాత్రం ఆకలేసినప్పుడు అవసరానికి, వదులుతుందా? సమయం వచ్చినప్పుడు తన బుద్ది చూపిస్తుంది కదా? అదే మొన్న మనము రాసిన కధనము, పాము పులి ల లో దేనిని ముందు వదిలించుకోవాలి అని?

రేపు మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల లేదా మగపిల్లాడు, ఇంట్లో వారిని గాలికి వదిలేసి, ఇంకొకరితో తిరుగుతున్నారు అంటే, వీరు ఏ మొఖము పెట్టుకుని మంచి చెపుతారు? వీరే పెళ్ళి ఒకరితో, తిరగడం ఇంకొకరితో చేస్తూ?

కాబట్టి వీరు చేసింది, చేస్తున్నది, ముమ్మాటికీ తప్పునే. రాజీనామా చేసి, లేదా విడి గుంపు గా వెళ్ళవచ్చు. కానీ చంద్రన్న తెదేపా, వీరిని పార్టీ ద్రోహులు గా చిత్రీకరిస్తూ కనీసం నటించాలి.

కాబట్టి అసలు తప్పు, గబ్బు మనతో ఉంచుకుని, బీజేపీ ది తప్పు అని ఆలోచన అవసరము లేదు.

*బీజీపీ ది తప్పు ఉందా?*

అందుకే రామాయణం భారతాలు చదవమంది. మోదీ చేస్తున్న ఏ పనుల వలన అయినా, గత 8 ఏళ్ళు గా, ఆయన ఆదాయం, అమాంతం పెరిగిందా? లేదు. అంటే ఆయన చిత్తశుద్దితో మంచి చేస్తున్నారు.

ఇంకా తన ప్రాణాలను పణంగా పెట్టి కాశ్మీర్ సమస్యకు ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేసారు. కాబట్టి, తన గుణము లో ఎటువంటి లోపము లేదు. బీజేపీ ది తప్పు కాదు, తప్పు అంటదు. అశ్వద్దామా అతహ్ కుంజరహ లాగా ఉంటుంది.

ఇంకా ఉదాహరణ కావాలి అంటే, రాముడు, అవసరానికి సుగ్రీవుడు లాంటి కోతుల, మరియు విభీషణుడు లాంటి రాక్షసుల, సహాయం తీసుకున్నారు. మరి వారి లక్షణాలు ఉద్దెశ్యాలు పాపాలు, రామునికి అంటుతాయా? అంటవు కదా? ధర్మ రక్షణ కోసం తప్పలేదు.

మరి ఈ నీతి, 400 కోట్లు పైన ఆస్తి ఉన్న, మన జగనన్న కు వర్తించదు, చీరాల ఎమ్మెల్యేను చేర్చుకున్నందుకు. ఎందుకంటే, జగనన్న మాట, రాజీనామా లేకుండా, ఎవరినీ చేర్చుకోను. మాట తప్పను మడమ తిప్పను. కానీ జిల్లా మంత్రి బాలినేని తిప్పెసారు అన్నిటినీ.

కాబట్టి ధర్మ సూక్ష్మము తేలికగా అర్ధము కాదు సుమా. ఒకే విషయం బీజేపీకి కరెక్ట్, కానీ వైకాపాకు కాదు. ఎందుకంటే, ఇద్దరి లక్ష్యాలు వాసనలు ఆలోచనలు, వేరు వేరు.

if it is wrong for 4 selfless TDP MPs to join BJP opportunistically, isnt it wrong for BJP to allow them?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,964; 104 తత్వాలు (Tatvaalu) and views 225,004
Dt : 22-Jul-2022, Upd Dt : 22-Jul-2022, Category : Politics
Views : 550 ( + More Social Media views ), Id : 1472 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wrong , selfless , tdp , sujana , ramesh , mps , bjp , venkatesh , garikapati
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content