తల్లి దండ్రులు ఉంటే వారికి సేవ చేయండి, లేకపోతే కనీసం పశ్చాత్తాపం తో దగ్గర వారికి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,435; 104 తత్వాలు (Tatvaalu) and views 224,962.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పత్రం పుష్పం ఫలం తోయం అని, గీతా చార్యుడు అన్నట్లు గా, నీళ్ల తో అభిషేకం చేసినా చాలు శివయ్య కు అని చెప్పినట్టు గా, తల్లి దండ్రులకు కూడా ఏ చిన్న పూజ చేసినా, అది పుణ్య ఫలమే. అయినా లక్షోవంతు కూడా, రుణం తీరదు, తీర్చుకోలేము.

ఈరోజు ఉదయం కూడా, లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ ధామేశ్వరీ, అంటూ మంత్రాలతో అక్షింతలు చల్లి, అమ్మ పాదాలకు దొరికిన పూలు ఆకులతో పూజ చేసి, కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుని, ఇంకొన్ని రోజులు అమ్మ చేతి భిక్ష తినే భాగ్యం ఇవ్వమని, దేవుని ప్రార్ధించడం జరిగింది.

మరలా అమ్మను కారులో కూర్చోపెట్టుకుని, కూరల షాపు లోకి మాత్రం ఒక్కడినే వెళ్లి వచ్చాను, ఇక్కడ ఉన్న కరోనా పరిస్తితులను బట్టి.

ఏదైనా ఫోటో లేదా మంచి వివరణలు వచ్చినప్పుడు, నన్ను పొగడటమో తెగడటమో కాకుండా, ఇంటి పెద్దలు లేదా ఇంట్లో తిండి పెట్టే జీవిత భాగస్వామి కైనా, పూజ చేసి గౌరవించిన, మనకు వచ్చే ఇబ్బంది లేదు. కనీసం పిల్లల కు అయినా తల్లి లేదా తండ్రి కి, అలాగే చేయమని నేర్పినా, కరోనా వచ్చి, కనీసం ఒక మంచి బుద్ధి, పిల్లల కు నేర్పింది అని అనుకోవచ్చు కదా.

టీవీల్లో గత రెండు రోజులు గా చూస్తున్నారు కదా. రియల్ మాన్ చ్చాలెంజ్ సవాల్అ ని, ఒక రోజు లో ఒక గంట లో అట్టుపోసి, తల్లి కో భార్యకో సహాయం చేస్తున్నారు అని, మన హీరోలు దర్శకుల ఫోటోలు వీడియో లు. అయినా గొప్ప లు చెపుతున్నారు, అని వాళ్ళ నూ అనవద్దు.

ఆ గంట, అలా నటించడం కూడా చాత కాని, మనుషులు ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు తల్లి దండ్రులు కు లేదా జీవిత భాగస్వామి కి, కనీసం ఒక నిమిషం కూడా సహాయం చేయరు. కనీసం వారి అభిమాన హీరోలను చూసైనా, ఒక గంట ఇంట్లో నటించినా, ఆ ఇంట వాళ్ళు ఆనంద పడతారు కదా.

మరి వీళ్లంతా, ఒకరోజు ఒక గంటకే ఇలా తమ ఫోటోలు వీడియో లు, సోషల్ మీడియా లో పెడితే, మరి మనం 6 ఏళ్లుగా అమ్మకు చేస్తున్న పనుల కు, ఎన్ని ఫోటోలు వీడియో లు పెట్టాలి. తల దువ్వడం, జుట్టు రంగు వేయడం, కూరలు కోసివ్వడం, ఇల్లు చిమ్మడం , అంట్లు కడగడం, వేప కాకర రసాలు, బిళ్ళలు సమయానికి వేయడం, చేయి పట్టి మైలు నడిపించడం, కాళ్ళు చేతులు గోళ్లు తీయడం, కాళ్ళు వత్తడం, ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడము, ఎమర్జెన్సి, . . . .

మరి మనకు తల్లి దండ్రులు, ఎన్ని చేసి ఉంటారు, మన చిన్నప్పుడు ఆలోచన చెయ్యండి? వీటికి లక్ష రెట్లు. మరి మనం ఎంత చేసినా, వారు మనకు చేసిన దాంట్లో, ఒక వంతు రుణం కూడా తీర్చుకోలేము.

తల్లి దండ్రులు ఉంటే వారికి సేవ చేయండి. లేకపోతే కనీసం పశ్చాత్తాపం తో దగ్గర వారికి, ఇంట్లో జీవిత భాగస్వామి కి సేవ చేయడం, కనీసం పిల్లల కు నేర్పే ప్రయత్నం చేస్తే మంచిది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,435; 104 తత్వాలు (Tatvaalu) and views 224,962
Dt : 25-Apr-2020, Upd Dt : 25-Apr-2020, Category : General
Views : 1138 ( + More Social Media views ), Id : 515 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : real Man challenge , helping mom , pada puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content