గౌరవనీయులు తిరుపతి అర్బన్ ఎస్పీ, ఏ రమేష్ రెడ్డి గారికి, - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,090; 104 తత్వాలు (Tatvaalu) and views 225,559.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నమస్కారములు, మీరు సోషల్ మీడియా లో పెడుతున్న, తిరుపతి పోలీసు సేవల ఫోటోలు మరియు వీడియో లు చూసాము. చాలా బాగా అప్డేట్స్ ఇస్తున్నారు రోజూ. మేమూ మా సోషల్ మీడియా లో షేర్ కూడా చేస్తున్నాము. ప్రజలలో బాగా కలసి తిరుగుతూ కష్టపడుతున్నారు. అలాగే కరోనా సమయంలో, జాగ్రత్తలు చర్యలు కూడా బాగున్నాయి. మీ గురించి, గతంలో ఆర్టికల్ కూడా రాశాము.

ఓ మంచి కలెక్టర్ మరియు ఓ మంచి ఎస్పీ ని చూడాలి అనుకుంటున్నారా , అయితే చిత్తూరు జిల్లా లో తిరుపతి లో చూడవచ్చు. కలెక్టర్ గారి గురించి కూడా, త్వరలో మంచి ఆర్టికల్ పెడతాము.

ఈ వారంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త గారు, మిమ్మల్ని పొగడటం మన పాలన మీ సూచన కార్యక్రమములో, అదే మీటింగ్ లో, మీరు తర్వాత మాట్లాడుతూ చెప్పిన మాటలు, చాలా విజ్ఞత తో అనుభవం తో ఉన్నాయి, చాలా సంతోషం కలిగించింది.

ఎస్పీ, కలెక్టరు, ఆర్డీవో ఇలా ప్రతి ఒక్కరు ఒక పాఠశాల బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్పిన మాటలు చాలా గొప్పవి. కోఆపరేటివ్ స్కూల్ గురించి బాగా చెప్పారు. లాక్ డౌన్, స్లో డౌన్, బ్రేక్ డౌన్ స్కూల్ గురించి చాలా బాగుంది. మిగతా చాలా మంచి విషయాలు వీడియోలో ఉన్నాయి.

చిరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ మంచి చదువుకునే పుస్తకము కొనుక్కో - చాలా విలువ గలిగిన మాట. బడిలో చదువు కన్నా, జీవితము లో చదువు మిన్న అని నొక్కి చెప్పారు. మీరు ఉద్యోగ జీతములో చాలా భాగము, ఇతరుల చదువుకు ఖర్చు చేస్తానని చెప్పారు, అని కూడా వార్తలలో చూసాము.

ఎంత ఎదిగినా, ఒదిగి ఉండాలి, మనం మారాలి, ఇంకొకరికి చదువు చెప్పించాలి అన్నవి బాగున్నాయి. మిగతా, అధికారులు మరియు పోలీసులు కు ఇవి ఆదర్శం. మీరు మా ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారే. పొలములో దిగి ఒక రైతు బిడ్డ లాగా పని చేస్తూ తిరిగారు.

విలేఖరి గా, డిజిటల్ పోలీసు గురించి, ఒక ప్రశ్న అడగాలని, మీకు ఈ ఉత్తరం లేదా మెసేజ్ పంపుతున్నాము. ఎందుకంటే కొత్త మార్పులు చేర్పులు, మీ లాంటి మంచి ఉత్సాహము ఉన్న వారి వల్లే రావాలి, మొదలు కావాలి. నిజాన్ని నిర్భయముగా చెప్పగలరు, వాస్తవ ద్రుష్టితో ఆలోచన చేయగలరు. తప్పులు ఉంటే మన్నించాలి.

అర్బన్ డిస్ట్రిక్ స్ధాయిలో పోలీసు సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీలు ఉన్న విధంగా, మీ నాయకత్వం లో పని చేసే, మిగతా డీఎస్పీ లకు మరియు సీఐ గార్ల కు, సోషల్ మీడియా పేజీ లు ఉన్నాయా? ఉంటే, ఆ వెబ్సైట్ లింకు లు ఇవ్వగలరు. కనీసం ఒక డీఎస్పీ మరియు ఒక సీఐ గారికి, సోషల్ మీడియా పేజీ ఉన్నా చాలు. అలాగే డీఐజీ ఏటీపీ గారికి, సోషల్ మీడియా పేజీ ఉంటే లింకు ఇవ్వగలరు.

ఎందుకంటే ప్రకాశం జిల్లాలో, డీఎస్పీ మరియు సీఐలకు ఉన్నట్లు గా తెలియరాలేదు. రాష్ట్ర డీజీపీ గారికి కూడా, విన్నపము పెట్టాము, అన్ని స్ధాయిల లో అంటే డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయిలలో సోషల్ మీడియా ఉంటే బాగుంటుంది అని.

జిల్లా స్థాయి సోషల్ మీడియా లో, ప్రతి పోలీసు స్టేషన్ పోలీసు సోదరుల సేవలు త్యాగాల ఫోటోలు రోజూ పెట్టాలి, అన్నా కష్టం కదా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము, ఒకవేళ డీఎస్పీ మరియు సీఐ గార్ల కు సోషల్ మీడియా పేజీలు ఉంటే, గొప్పగా ఆర్టికల్ రాయవచ్చు అని.

సోషల్ మీడియా ఉచితం, తేలికగా ఎవరైనా వాడవచ్చు. ఎవరైనా ఫోటోలు ఫోన్ నుంచి అప్లోడ్ చేయవచ్చు, నాలుగు మాటలు రాసి. సమాచారం నేరుగా ప్రజలకు చేరుతుంది. ఒకవేళ వారికి సోషల్ పేజీలు లేకపోతే, ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడు వరకు లేకపోవడానికి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? దయచేసి తెలుపగలరు.

మీకు కంట్రొల్ రూం నంబర్ ద్వారా, ఈ మెస్సేజ్ పంపాము, చేరింది లేనిది తెలీదు. ఇట్లు మీ అభిమాని.  


Photo/ Video/ Text Credit : Tirupati Police, Chittoor District Collector
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,090; 104 తత్వాలు (Tatvaalu) and views 225,559
Dt : 06-Jun-2020, Upd Dt : 06-Jun-2020, Category : Request
Views : 1257 ( + More Social Media views ), Id : 577 , City/ Town/ Village : Tirupati , State : AP , Country : India
Tags : Tirupati urban sp , A Ramesh Reddy , Question on digital police , social media , dsp , ci , Chittoor District Collector
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content