సెలవు దినం లేటు లెగవడం, దైవ ఇతర పనులు వదలడం, సబబేనా? మరి మన శరీర భాగాలకు? - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సెలవు దినం రోజు న, లేటుగా లెగవడం, పూజ గుడి దైవ వ్యాయామం యోగా, ఇతర ఇంటి పనులు చేయకుండా వదలడం, తమ బద్దకం నిర్లక్ష్యం తో, రాహు కేతు శని మాయ తో అంధకారంలో మునిగి, తమ కుటుంబ పాప శాతం పెంచుకునే వారిని, మన చుట్టూ చాల మందిని చూస్తూ ఉంటాము.

వారికి, ఓ ఉపశమనం తేలిక మార్గం ఇది.

సెలవు రోజు అవన్నీ మానేసే వారు, కడుపు కు తిండి ఫలహారం కూడా ఆ రోజు మానేస్తే, ఉపవాసం చేసిన వారు, అలాగే నీతి నియమాలు ఆరోగ్యం కలవారు అవుతారు.

మరి మానేస్తే అన్ని మానేయాలి ఆ రోజు, లేదా రోజు చేస్తున్న మంచి పని, సరైన సమయానికి, అన్ని రోజులు చేయాలి కదా.

ఎక్కువ మంది, ఆ సెలవు రోజులలో నే ఎక్కువ తిని, అనారోగ్య పాలు అవుతారు. బద్దకం ఆ పైన అజీర్తి.

మరి రోజూ పని చేసే జీర్ణ వ్యవస్థకు, వారానికి ఒక రోజు ఎందుకు సెలవు ఇవ్వము? ఎందుకంటే, మనకు రోగ నిరోధక శక్తి తగ్గి పోవాలి, రోగాల బారిన పడి పోవాలి, అంతేనా? కరోనా తో బెంబేలు ఎత్తినా కూడా, మారము కదూ?

సెలవు దినం లేదా ఏ రోజైనా, మన బద్దకం నిర్లక్ష్యం లాగా, మన శరీరం లో ఓ భాగం కూడా, విశ్రాంతి తీసుకుంటే లేదా లేటుగా పనిచేస్తే? మనకు జీవితం మరియు ఆరోగ్యం ఉంటుందా?

ప్రతి గంట, అలాగే ప్రతి రోజూ, నీతి నియమాలను కలిగిన భగవంతుని బిడ్డలము అయిన, మనకు బద్దకం కు ఓకే అయినప్పుడు, మన శరీర భాగాలకు ఆ హక్కులు లేవా?

అవి కూడా బద్దకం నిర్లక్ష్యం తో, సెలవు రోజున ఒక గంట అజాగ్రత్త గా లేటు గా ఉంటే, మన బతుకు ఏమిటి? కాసేపు గుండె కాలేయం ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ ఆగితే?

దాని పర్యవసానం, ఖర్చు, బాధ, ఇబ్బందులు ఎంత? దాని ప్రభావం, మన కుటుంబము లో, ఎంత మంది మీద ఉంటుంది?

కాబట్టి, సెలవు దినము నిర్లక్ష్యం బద్దకం, మనకు వద్దు, తప్పుడు వారిలాగా, రాక్షస జాతి లాగా ఉండవద్దు.

సాత్వికులమైన మనకు, 7 రోజులు వారానికి, మనవే, మన దేవునికే మన బాధ్యత, అరిషడ్ వర్గాలతో నిరంతరము పోరాడి, అదుపులోకి తెస్తూ అప్రమత్తము గా ఉండాలి సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 25-Jul-2021, Upd Dt : 25-Jul-2021, Category : Health
Views : 138 ( + More Social Media views ), Id : 1228 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : holidays , weekend , late , leaving , divine , deeds , works , body , parts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content