హనుమాన్ జయంతి - సముద్రం దాటి, రాక్షసుల ఎదుర్కొని, సీతా రాములను కలిపింది - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1208 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1238 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

గురువు లందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

రామ మరియు ఆంజనేయుని శ్లోకాలు, మీరూ మీ పిల్లలు, నోటి తో పలికే ప్రయత్నం చేస్తారు కదూ.

శివ తత్వ ఆత్మ హనుమ, నారాయణ అంశం అయిన రాముని శక్తి కి తోడైతే, అదీ నిస్వార్థంగా కేవలం సేవకునిగా, ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధం లో కూడా, ఆంజనేయుడు లాంటి బలవంతుడైన నమ్మకమైన నిస్వార్ధ సేవకుడు లేడు.

సూర్యుని గురువు గా చేసుకుని, ఆగ కుండా 24 గంటలు తిరిగే సూర్యుని పాఠాలు వినడానికి, తూర్పు పడమర కొండలపై స్ధిరంగా నిలబడి, శ్రద్ధగా చదువు వేదాలు నేర్చుకున్నారు.

సూర్యుని పండు గా తలచి, సహస్ర యోజనాలు ఆకాశం వైపు ప్రయాణించి, సూర్యునే మింగ బోయారు.

సీతారాముల కళ్యాణం చేసింది విశ్వామిత్రుడు. విడిపోయిన దంపతులను కలిపింది లవకుశల జననం తర్వాత, వాల్మీకి.

కానీ రాక్షసుడు రావణుడు అపహరించిన సీతమ్మ తల్లి ని, ఎక్కడ ఉందో తెలియని సీతా మహాలక్ష్మీ ని, హోరెత్తె భయంకర సముద్రం ను అవలీల గా దాటి, రాక్షసులను ఎదుర్కొని, అంగుళం అంగుళం వెతికి పట్టుకుంది, కష్టాలు నష్టాలు పడి, కేవలం హనుమనే.

లంకను నాశనం చేసి, సీతమ్మ ను వెనక్కి తేవడం, క్షణంలో పని అయినా, సీతమ్మ మాట గౌరవించి, చూసి రమ్మంటే కాల్చి వచ్చి, తన శక్తిని ఓపిక సహనం ను నిరూపించారు.

ఇలా ఎన్నో ఆయన గొప్పతనాలు, పేజీలకు పేజీలు రాయాలి. తెలివి గా గౌరవము గా వ్యాకరణ బద్దముగా, మనిషిని బట్టి మాట్లాడటము కూడా ఆయనకు ఉన్న గొప్ప విద్య.

యయాతి ని కాపాడడానికి అలాగే రామ నామ మహిమను తెలియజేయడానికి, రాముని తోనే యుద్ధం కు సిద్దం అయి, చేతులు జోడించి కేవలం రామ నామం తోనే ఎదుర్కొని, అభయాంజనేయస్వామి అయ్యారు.

సీతమ్మ తలపై చిన్న సింధూరం చుక్క పెట్టూకుంటేనే, రాముడు సంతోషంగా ఉంటే, రాముని ఇంకా సంతోషపెట్టాలని, తాను ఓళ్ళంతా పూసుకుని, ఆనంద పడ్డారు.

రామ లక్ష్మణులను బ్రతికించడానికి, సంజీవీని పర్వతాన్నే తెచ్చి, జాంబవంత తాతా, నాకెందుకు వచ్చిన గొడవ మూలికల తో, అది కాదు ఇది ఇంతే తెచ్చావు అనడం, ఇదుగో మొత్తం పర్వతాన్నే తెచ్చిన, ఏది కావాలో ఎన్ని కావాలో, మీరే తీసుకోండి అన్నారు.

ఎక్కడ రామ నామం భజన వినపడితే, అక్కడ ఆంజనేయులు పరవశించి పోతారు.

ఏ లేఖ రాసినా ముందుగా శ్రీరామ నామాన్ని రాసి, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు, రామ రామ, అంటూ చెవులు మూసుకోవటం కూడా చూస్తుంటాం.

ఆకలి వేస్తే అన్నమో రామచంద్రా అంటారని తెలుగువారి నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం ఇచ్చినా, శ్రీరామ రక్ష అనడం అలవాటు.

మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా? అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది. దానికి శివుడు... లేకేం పార్వతీ...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

శ్రీరామ రామ రామ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్ర నామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు.

హనుమంతుని ఈ శ్లోకాలు తో తలుద్దాం

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం!
దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్!!
సకలగుణనిదానం వానరాణామధీశం!
రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి!!

గోష్పధీకృతవారాశిం మశకీకృత రాక్షసం!
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం!!

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్!
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్!!
భాష్పవారిపరిపూర్ణలోచనమ్!
మారుతిం నమత రాక్షసాంతకమ్!!

ముందు అమ్మ నాన్న పాదదాసుడు, తర్వాత నే హరిహర ఆచరణ సేవా దాసుడు, ఈ అజ్ఞాన శిష్యుడు శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1238 General Articles, 47 Tatvaalu
Dt : 03-Jun-2021, Upd Dt : 04-Jun-2021, Category : Devotional
Views : 111 ( + More Social Media views ), Id : 1190 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hanuman , jayanti , lanka , sea , confronted , demons , rakshasa , sita , rama
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content