తెలుగు లో శుభాకాంక్షలు, చుట్టుపక్కల సంస్కారం సంస్కృతి పెంచుదాం, మనశ్శాంతి గా ఉందాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,033; 104 తత్వాలు (Tatvaalu) and views 225,950.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ (ఆ) రోజు, మా పసుపు బుజ్జి గణపతి కి, ఇంట్లో గణేష్ పూజ ఓ పర్యాయం అయింది. ఆవాహన, షోడశోపచారాలతో, అష్టోత్తరం, వినాయక కధ, నీరాజన మంగళం.

పూజ చివర లో, అమ్మ పాదాలకు నమస్కారం తో కూడా. వినాయకుడు కూడా, తల్లి దండ్రుల చుట్టూ ప్రదక్షిణలు తిరిగే, గణాధిపతి పదవి పొందారు, తెలివిగా.

ఇప్పుడు దేవుడు కూడా, అమ్మ కోసం అయినా, మనల్ని మనశ్శాంతి గా ఉంచాలి, ఉంచుతున్నారు.

అన్ని మంత్రాలు నోటితోనే చదవడం సుమా, మాట స్పష్టం వాక్ శుద్ధి వస్తుంది. అగౌరవంగా అమర్యాదగా పూజలో ఆడియో లు వాడ కూడదు. మీరూ గొంతు తోనే ప్రయత్నం చేయండి. తర్వాత గొంతు మూగబోయినా, చూపు మసకబారినా, ఎటూ చేయలేము, మనకే కష్టం నష్టం.

కలెక్టర్ మన ఇంటికి వస్తే, నేరుగా గొంతు తో నమస్కారం ధన్యవాదాలు చెపుతామా, లేక టేప్ లో ఆడియో లో చెపుతామా? దేవుడు ఇంకా ఎక్కువ కదా?

గురువారం రెండు హారతులు జరిపే మరియు పాడే అవకాశం కూడా ఇచ్చారు దేవుడు.

దేవుని కి కృతజ్ఞతలు మనసున్న ప్రతి మనిషి చూపాలి, లేదంటే మన పిల్లలు కూడా మనకు చూపరు, చూపలేరు. భవిష్యత్తు గందరగోళం సుమా, మన నిర్లక్ష్యం బద్దకం లెక్క లేని తనం వలన.

మన మతాన్ని, సనాతన ధర్మం ను, సాంప్రదాయం ను మనం గౌరవించకపోతే ఆచరణలో చూపకపోతే, మన తర్వాత తరాలు నిబద్ధతతో చేయలేవు. వారిలో మానసిక బలం నశించి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి లేదా గతంలో ఆంగ్లేయులు ఇతర దేశస్తుల పాలనలో పడిన కష్టాలు కు మరలా మనం దగ్గర బాట వేస్తున్నాము, మన నిర్లక్ష్యం తో.

కరోనా దెబ్బకి, తెలుగు రాసి చదవలేని స్ధితిలో ఉన్నారు కొందరు పిల్లలు. పదవులు ఉద్యోగాలలో ఉన్నవారు, వాట్సాప్ లో తెలుగు రాయలేని, దౌర్భాగ్య స్ధితిలో ఉన్నారు, మరి వీరినేమీ అనలేము, జాలి పడటం తప్ప, మాతృమూర్తి కి మాతృభాష కు ద్రోహం చేస్తున్నారు అని.

మన గురువులు చాలామంది, తెలుగు ప్రయత్నం చేసి, మనకు జవాబు లలో చూపారు. ధన్యవాదాలు.

మరలా ఇంకోసారి పునః పూజా ప్రయత్నం చేయాలి, ఓం గం గణపతి యే నమః.

శుభాకాంక్షలు మరియు తమ గొంతు మంత్రాలు నీరాజనం ఆడియో పంపిన, గురువులకు నమస్కారములు. మన ఇంటికి మనమే, బాలు సుశీల.

కరోనా మరియు దేవుని ముందు, అందరమూ ఒకటే, హోదా అధికారం ఐశ్వర్యం పని చేయదు.

భక్తి మాత్రమే ముఖ్యం. మీ చిత్తశుద్ధి కి, ప్రతి నమస్కార సంస్కారం కు, శిష్యుల ఎడ, ప్రేమకు దేవుడు తప్పక, మిమ్మల్ని కరుణిస్తారు.

గురువు గ్రహం, ఈ నెలలో వక్రం లో వెనక్కి వచ్చి, మరలా శని తో కలుసుకుంటున్నారు, మకరం లో అనుకుంటా. మీకు అన్ని వివరాలు, బొమ్మలు మన వాట్సప్ స్టేటస్ లో పెడుతున్న, గమనిస్తూ ఉండాలి మరి. బొమ్మలు పంపి, మెమరీ సమస్యలు వద్దు అని పంపడం లేదు, మన్నించాలి.

మన అందరికీ దైవ గురు బృహస్పతి దీవెనలు కావాలి. ఇంట్లో మొదటి గురువులు, మన మంచి బుద్ధి గల తల్లి దండ్రులే. వారి దీవెనలు ఉండి, మన పక్కన ఉంటే, గురు గ్రహ బలం లేని లోపం లేదా ఇప్పటి వక్రగతి పయనం లో, దైవ బలం తగ్గదు. ఏళ్లుగా ఈ విషయం గురువులకు గుర్తు చేస్తున్న.

ఏళ్లుగా మన సందేశాలను, ముదుసలి తల్లి దండ్రులు పై బాధ్యత, మంచి రాజకీయాలు, సనాతన ధర్మ ఆచరణ, సంస్కారం, ఆహార నియమాలు, కరోనా జాగ్రత్తలు, మన బాధ్యత గురించి, అందుకుని ఆశీర్వదిస్తున్న గురువులకు వారి కుటుంబాలకు మంచి కలగాలి.

మా (మన) నలుగురు పిల్లలు, బీజేపీ, తెదేపా వైకాపా పార్టీలు నాయకులు, అలాగే అధికారులు కూడా చిత్తశుద్ది తో మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని, దానికి తగిన శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరాము. 

మా రెండో అబ్బాయి తెదేపా కి, మూడో అబ్బాయి వైకాపా కి పెద్ద తేడా లేదని, భావనకు వస్తున్నారు జనం. కొత్త వారు రానిదే, మన బతుకు మారదు అంటున్నారు.

కోప తాపాలు కక్షలు ప్రతీకారం వదలి, మంచి చేసే ప్రయత్నాలు మాత్రమే చేయాలి. తాడెక్కేవాడు ఉంటే, దాని తలదన్నే వాడూ ఉంటాడు. రోజులు అన్ని మనవి కావని గుర్తించాలి.

ఎవరి ఆట వాళ్ళు, గమ్మత్తుగా ఆడుతూ ఉన్నారు. మోసం తో ఏది సాధించినా, దాచినా, బలపరచినా, వారి తర్వాత తరాలు, ఆ ఇబ్బందులు తప్పించుకోలేవని, మా నలుగురు పిల్లల ను అలాగే అధికారులు ను, గత 3 ఏళ్లుగా కోరింది మీకు తెలుసు, జరిగిన చరిత్ర కూడా చెరపలేము మార్చలేము.

అధికారంలో ఉన్న, హైందవ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు, తమ బాధ్యత ను మరుస్తున్నారు, హైందవ కార్యక్రమాలలో. హైందవ దేవాలయాల భక్తుల ధనమే, అన్ని రాష్ట్రాల అవసరాలకు వాడుతున్నాం అంటే, అది హైందవ సోదరుల గొప్పతనం.

ఇతర మతాల వారు, మాకూ హైందవులకు ఉన్న విధంగా, దేవాదాయ శాఖలు పెట్టి, మా ధనం కూడా రాష్ట్రం కోసం ప్రజల క్షేమం కోసం వాడండి, మా మత పూజారులకు మా ధనమే ఇవ్వండి, అని అడగడం లేదు అంటున్నారు, అన్నదాన కార్యక్రమాలు లాంటి అందరికీ పనికివచ్చే పధకాలను నడపడానికి, కోట్ల మతపరమైన ఆస్ధులు, వారికి ఉన్నా కూడా.

మనకన్నా తెలంగాణ లో వినాయక చవితి బాగా చేస్తున్నారు. కేసీఆర్, సంజయ్, ఇతరులు అందరూ.

తిరుమల దేవస్థానం లాంటి ఉత్తమ స్ధాయి కార్యక్రమాలు, ఇతరులు చేయలేరు, చేయరు. అదీ మన హైందవ సంస్కృతి గొప్పతనం. మహిళను దేవతగా కొలిచే సంస్కృతి, కేవలం సనాతన ధర్మం లోనే ఉంది.

బాల్య వివాహం, సతీ సహగమనం వంటి దురాచారాలు, ఎందుకు ఆనాడు మధ్యలో వచ్చిన వో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల ఆందోళన పరిస్థితి చూసాక, అలాగే విమాన రెక్కలు పట్టుకుని ప్రాణ భయం పరుగులు చూసాక, అందరికీ అర్థం అయింది. స్వధర్మం మేలు, పరధర్మం భయంకరమైనది.

పేదవారని, చదువు రాని వారని, ఆస్తులు ఇవ్వలేదని, మోసం చేయడం కు ఒప్పుకోలేదు అని, మన తల్లి దండ్రల ను మారుస్తామా? మతం కూడా అంతే, మారము. బాధలు కష్టాలు లేని మతం ఉందా?

మన భవిష్యత్తు, మన చేతిలో నే ఉంది. అప్పులతో నిర్లక్ష్యం తో బద్దకం తో, మన వారసులను అగమ్యగోచర స్ధితిలో వదలాలో లేదా మంచి స్ధితిలో వదలాలో, మన చేతిలో నే ఉంది.

మన ఇల్లు ఒకటే బాగుండి, చుట్టుపక్కల ఇతర ఇళ్ళు ఏడుస్తూ ఉంటే, మనకూ ఆ ఉసురు తగులుతుంది.

కనుక మన చుట్టుపక్కల మంచి ని పెంచుదాం, మానసిక బలం శక్తిని, రోగనిరోధక శక్తిని పెంపొందించే మా (మన) ప్రయత్నంలో మీ సహకారం సహాయం ఎప్పుడూ ఉంటుంది అని భగవంతుని దయతో ఆశిస్తున్నాము.

తెలుగు లో శుభాకాంక్షలు చెపుదాం, మన చుట్టుపక్కల సంస్కారం సంస్కృతి పెంచుదాం, మనశ్శాంతి గా ఉందాం.

ముందు అమ్మా నాన్న ల పాద దాసుడు, ఆ తర్వాత నే హరిహర దాసుడు, ఈ అజ్ఞాన శిష్యుడు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,033; 104 తత్వాలు (Tatvaalu) and views 225,950
Dt : 09-Sep-2021, Upd Dt : 09-Sep-2021, Category : General
Views : 740 ( + More Social Media views ), Id : 1247 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vinayaka , ganesh , greetings , wishes , telugu , motivate , culture , samskar , peace of mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content