టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు - కరోనా నిబంధనల్ని 100 శాతం పాటిస్తూ, జూన్ 11 వ తేదీ నుంచి - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1725 General Articles, 84 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరోనా జాగ్రత్తలతో, పరిమిత సంఖ్యలో, ప్రజలకు దర్శనం ఇవ్వడానికి, దేవ దేవుడు తిరుమల తిరుపతి వెంకన్న, షుమారు 80 రోజుల తర్వాత ,జూన్ 11 వ తేదీ నుంచి సిద్ధంగా ఉన్నారు, అని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు తెలిపారు.

ఏవిధంగా తగు జాగ్రత్తలు తో అనుమతి ఇచ్చారు, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు మాత్రమే రావాలి, లాంటి అన్ని విషయాలు, వీడియోలో వారి మాటలలో నే వినండి.

ఉద‌యం 6:30 గంట‌ల నుంచి రాత్రి 7:30 లోపే శ్రీ‌వారి ద‌ర్శ‌నం. 65 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు, 10 ఏళ్ల‌లోపు చిన్నారుల‌కు అనుమ‌తి లేదు.

కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడానికి 2 రోజుల ముందే, పాలక మండలి తిరుమలలో భక్తులకు దర్శనాలను ఆపివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పాలక మండలి, దేవస్థానం కార్యనిర్వాహక వ్యవస్థ, ఇక్కడ లాభ నష్టాల గురించి ఆలోచించకుండా, భక్తుల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చిన విషయం, అందరికీ తెలిసినదే.

ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల్ని 100 శాతం పాటిస్తూ ఎట్టకేలకు ఈ నెల 11వ తేదీ నుంచి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నందుకు ఒక భక్తుడిగా చాలా సంతోషంగా ఉంది.

ఇదే సందర్భంలో భక్తులందరూ నిబంధనలు, ముందు జాగ్రత చర్యలు పాటించి టీటీడీ కి సహకరించాలి. ప్రస్తుతానికి గంటకు 500 మందితో రోజుకు 6 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశాం.

పరిస్థితులు చక్కబడి భక్తుల ఆరోగ్యం పట్ల భరోసా కలిగితే ఈ సంఖ్యను క్రమంగా పెంచుకుని పోయేలా నిర్ణయాలు తీసుకుంటాము. ఆన్ లైన్ ద్వారా దర్సనం టికెట్ తీసుకునే అవకాశం, అవగాహన లేని వారి కోసం, తిరుపతిలో కౌంటర్ల ద్వారా టికెట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం.

తిరుమలలో వసతి, అన్న దానం, కళ్యాణ కట్ట, క్యూ కాంప్లెక్స్ లో ప్రతి క్షణం జాగ్రత్తతో ఉండేలా చర్యలు తీసుకున్నాం. అలిపిరి లో అన్ని రకాల తనిఖీలు అయ్యాకే భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. స్వామి వారి దయ వల్ల కరోనా పూర్తిగా తొలగిపోయి, సర్వమానవాళి ఆరోగ్యంతో ఉండాలని, అంతామేలే జరగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను అని టీటీడీ వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు.

Note : ఛైర్మన్ గారు, గతంలో ఒంగోలు నుంచే పార్లమెంటు కు పోటీ చేసారు, తర్వాత ముందే రాజీనామా కూడా చేసారు. దైవ పూజలలో ముందు ఉంటారు. ప్రకాశం జిల్లా కు, ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి హయాంలో, రాజకీయంగా పెద్ద దిక్కు కూడా.

ఇక నుండి, తిరుమల శ్రీవారి కి సంబంధించిన ఆస్తులు అమ్మకూడదని, చరిత్ర లో మొదటిసారి గా, చట్టం తెచ్చి, ఎనలేని కీర్తిని సంపాదించి, ప్రతిపక్షాల ఆరోపణలకు, వారి నోటినుంచి ఎదురు మాట రాకుండా, మంచి ముగింపు నిచ్చారు.  

Photo/ Video/ Text Credit : Prakasam and Chirala Police
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 84 Tatvaalu
Dt : 06-Jun-2020, Upd Dt : 06-Jun-2020, Category : News
Views : 1057 ( + More Social Media views ), Id : 14 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devotees , ttd , thirumala , srivari darshan , corona precautions , june 11th , YV Subba reddy , TTD chairman

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content