Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
కోటి పెట్టి, పేద్ద ఇల్లు బంగ్లా కొనవచ్చు, కానీ మంచి సౌఖ్యమైన సంస్కారవంతమైన కుటుంబం ని కొనలేము కదా?
ధనం పెట్టి, విలువైన స్విస్ గడియారం కొనవచ్చు నేమో గానీ, సమయం ను మాత్రం కొనలేము. వెళ్ళిన కాలం వెనక్కి రాదు, పరీక్ష 3 గంటలు 4 గంటలు గా మారదు, రేపు మనది కాదు.
ఎక్కువ ధనం పెట్టి డబల్ కాట్ మంచం మెత్తటి పరుపులు దిండ్లు కొనవచ్చు, కానీ నిద్ర కొనలేము, ఎక్కడా దొరకదు. నిద్ర పట్టక, తాగే వాళ్ళు, నిద్రమాత్రలు వేసుకునే కోటీశ్వరులు కోటి మంది ఉన్నారు సుమా?
ధనం పెట్టి మంచి తిండి కొనవచ్చు, పిజ్జా బర్గర్ హోటల్ భోజనము స్వీట్లు ఇంకా ఎన్నో, కానీ ఆరోగ్యం కొనలేము. ఎందుకంటే కోటీశ్వరులు కూడా కరోనా తో లేదా ఇంకో జబ్బులతో, బతకలేక పోయారు, మనము విన్నాము.
కార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఎక్కువ ధనముతో ఎక్కువ ప్రీమీం లు కట్టి కొనవచ్చు, కానీ రక్షణ కొనలేము. కారు రోడ్ మీద గుద్ది పోయిన వారు ఉన్నారు కదా?
నేడు ఎలెక్షన్ ల లో, గెలుపు కూడా, నమ్మకము లేదు. అమిత ధనము ఖర్చు పెట్టి సీటు తెచ్చుకున్నా కూడా, ప్రచారము చేసినా కూడా, ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రులు పార్టీ, ఓడిన వారూ ఉన్నారు.
ధనము ఖర్చు పెట్టి విమానము టికెట్ కొని, పైకి ఎగర వచ్చును, కానీ ఖచ్చితము గా కిందకు దిగుతామని, గారెంటీ లేదు.
ఇవే గాకుండా, ధనం తో కొనలేనివి ఇంకా చాలా ఉన్నాయి కదూ - ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అభిమానం, మనశ్శాంతి, సంస్కారం, కృతజ్ఞత, ఆయువు లాంటివి.
కాబట్టి ధనవంతులమని అహంకారం వలదు, ధనము పెరిగేకొద్ది గుణము తరుగుతుంది, అంటే పతనము మొదలు అవుతుంది సుమా. ఎంత అవసరమో అంత ధనము చాలు, త్రుప్తి ఉండాలి దేనికైనా.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,063; 104 తత్వాలు (Tatvaalu) and views 224,857
Dt : 16-Mar-2021, Upd Dt : 16-Mar-2021, Category : General
Views : 828
( + More Social Media views ), Id : 1037
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
crazy ,
world ,
bought ,
money ,
buy ,
things ,
sleep ,
mind peace ,
good habits
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments