కరోనా లో ప్రజలకు తోడు నీడ గా ఆపన్న హస్తం అందిస్తున్న డైనమిక్ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,831; 104 తత్వాలు (Tatvaalu) and views 225,104.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నాయకులు అంటే, ఎక్కడ నుంచో ఓ పూట, వచ్చి వెళ్ళేవారు కాదు. వారానికి ఒకసారి, నాలుగు ఫోటోల కోసము, ఓ గంట తిరగడము కాదు. ఈ చిత్ర సమాహారము చూడండి, ఈ కరోనా సమయములో అలుపెరగక తిరుగుతున్న, ప్రజలకు తోడు నీడ గా ఆపన్న హస్తం అందిస్తున్న డైనమిక్ యువ, బీసీ మహిళా నాయకురాలు. మొదటిసారిగా చిలకలూరిపేట కు దక్కిన, మహిళా ఆణి ముత్యము, శాస‌న‌స‌భ్యురాలు (ఎమ్మెల్యే) విడ‌ద‌ల ర‌జిని.

శ్రమ అనుకోకుండా, ఎండలో వీధుల్లో, కార్యక్రమాలలో, పొలాలలో కూడా తిరుగుతూ, ప్రజలకు నేనున్నాను నేను వింటున్నాను నేను చూస్తున్నాను అంటూ, సేవ చేసేందుకు ఉత్సాహముతో, చిరునవ్వుతో ముందుకు దూకుతున్నారు.

అద్రుష్టము వెన్నుతట్టితే, మొదటిసారే జగనన్న చేతినుంచి మంత్రి పదవి అందుకోనున్న చెల్లెమ్మ. జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలతో మమేకమై, కదము తొక్కుతూ తిరుగుతున్న పల్నాడు బిడ్డ. తాను ఏపని చేస్తుంది, ఎవరిని కలిసింది, ఎక్కడకు వెళ్ళింది అన్ని వివరాలను ఫోటోలు వీడియోలతో, తమ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ పేజీ ల లో, ప్రతి రోజు ఉంచి, ప్రజలకు తమ అభివ్రుద్ది పనుల నడకను ( ప్రోగ్రెస్స్ రిపోర్ట్ ) ను సవినయముగా తెలియచేస్తున్నారు. కొన్ని, వివరాలను చూడండి.

* ఈ కరోనా యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అందరం ఒక్కటిగా ఉండాలి అని నినదించారు, ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.

* చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి, ఒకే ఒక క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైన, విష‌యం తెలిసిందే. అది కూడా న‌ర‌స‌రావుపేటలో ప‌నిచేసే, ఒక వైద్యురాలికి కోవిడ్ వ్యాధి సోకింది. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు, గురువారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ధర్యము చెప్పారు. ఆమె కు అందుతున్న వైద్య‌సేవ‌లు, క్వారంటైన్ సెంట‌ర్‌లో ఉన్న వ‌స‌తులు, అందుతున్న ఆహారం, పొందుతున్న సేవ‌ల గురించి తెలుసుకున్నారు.

* రెడ్ జోన్ లోని ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం కంట్రోల్ రూమ్, స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని ఎమ్మెల్యే సూచించారు. వీధుల్లో అన‌వ‌స‌రంగా ఎవ‌రైనా తిరిగితే, ఉపేక్షించొద్ద‌ని పోలీసుల‌కు చెప్పారు. అధికారులంతా స్వేచ్ఛ‌గా వారి విధులు వారు నిర్వ‌ర్తించవ‌చ్చ‌ని, ఎలాంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌బోద‌ని స్ప‌ష్టంచేశారు.

* మెప్మా ఆధ్య‌ర్యంలో త‌యారుచేసిన మాస్కుల‌ను గురువారం ఎమ్మెల్యే గారు మున్సిప‌ల్ సిబ్బందికి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావు గారు, సీఐ సూర్య‌నారాయ‌ణ‌ గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మున్సిప‌ల్‌, వైద్య ఆరోగ్య‌శాఖ‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

* ప‌సుమ‌ర్రు గ్రామం ఎస్టీ కాల‌నీలో 170 కుటుంబాల‌కు, మంగ‌ళ‌వారం మ‌ల్లెల ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌లు, బియ్యం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

* చిల‌క‌లూరిపేట ర‌హ‌దారి వెంబ‌డి సుమారు 750 కుటుంబాల‌కు మంగ‌ళ‌వారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, మ‌ల్లెల ఫౌండేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లెల రాజేష్‌నాయుడు ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌లు, బియ్యం పంపిణీ చేశారు.

* శ‌న‌గ‌ల కొనుగోలులో ఏ మాత్రం పార్టీ వివ‌క్ష‌ చూపొద్ద‌ని మార్క్‌ఫెడ్‌, స‌హ‌కార బ్యాంకు అధికారులకు చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు సూచించారు. మండ‌ల కేంద్రం య‌డ్ల‌పాడులోని శ‌న‌గ‌ల కొనుగోలు కేంద్రాన్ని మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.

* త‌న సొంత వీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సుమారు వెయ్యి మంది ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల కుటుంబాల‌కు బియ్యం, నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ

* క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల అన్న‌దాత‌లు, రైతు కూలీలు ప‌లు ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పొలంలోకి వెళ్లి, రైతులు, కూలీల‌తో మ‌మేమ‌క‌మ‌వడం జరిగింది.
సామాజిక దూరం పాటిస్తూ రైతన్నలు పొలం పనులు చేసుకోవచ్చు.

* లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌ను క‌డిగేసిన ఎమ్మెల్యే - జగనన్న పాలనలో ఎవరు అవనీతికి పాల్పడిన సహించేది లేదు, ప్రభుత్వానికి మరక అంటిచే పనులు ఎవరు చేసినా ఊరుకునేది లేదు. చర్యలు చాలా కఠినంగా ఉంటాయ్!

Chilakaluripeta Assembly constituency is a constituency in Guntur district of Andhra Pradesh. It is one of the 7 assembly segments of Narasaraopet Lok Sabha constituency, along with Pedakurapadu, Narasaraopet, Sattenapalle, Vinukonda, Gurazala, and Macherla. Vidadala Rajini is the present MLA of the constituency, who won the 2019 Andhra Pradesh Legislative Assembly election (on TDP Prathipati Pulla Rao), from YSRCP PARTY. Before political debut, she worked as an IT employee in a US based company. Her VR foundation is a social service enterprise.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,831; 104 తత్వాలు (Tatvaalu) and views 225,104
Dt : 30-Apr-2020, Upd Dt : 30-Apr-2020, Category : News
Views : 1314 ( + More Social Media views ), Id : 526 , City/ Town/ Village : Chilakaluripeta , State : AP , Country : India
Tags : corona difficult situation , support help people , chilakaluripeta mla , vidadala rajini

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content