రిటైలర్ డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ వ్యవస్థాపకులు - చార్లెస్ చక్ ఫీనీ - 8 బిలియన్ విరాళం - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,695; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జనం దగ్గర నుంచి దోచుకుని లేదా భగవంతుడు ఇచ్చిన దానిని, స్వార్థం కోసం దాచుకుని, చివరలో పరాయి వారి చేతిలో పెట్టి, వారి చేతే ఛీత్కరించుకుని పోయేవారు, చదవ వలసిన వార్త.

పిల్లికి బిచ్చము పెట్టని వారు మన చుట్టూ, ఎంత ఉన్నా, ఇంకా ఎవరిదన్నా వస్తుందా అని చూసే వారు ఇంకో వైపు, కేవలం అప్పుల మీద బతికే వారు ఇంకొందరు.

చదివేది భగవద్గీత లేదా ఇతర మత గ్రంధమైనా అయినా, ఆచరణ మాత్రం సాధ్యము కాని మనసులు మనవి.

ఒక్క సారి, ఆయన మాటలను వినండి వీడియోలో, మొఖం చూసినా పుణ్య మే అనుకోవాలి మరి.

మరి ఈ గొప్ప వ్యక్తిని చూడండి, కలియుగ దాన కర్ణుడు అందామా? మిగతా వారి లాగా, తన సొంత చారిటీకి ఇవ్వలేదు, అంతా బయటవారికే. జీవితాంతమూ ఇస్తూనే ఉన్నారు.

వేల కోట్ల డబ్బు సంపాదించిన ఆనందం కంటే, ఆ సంపాదించిన మొత్తం దానం చేసినప్పుడు కలిగిన సంతృప్తి వెలకట్టలేనిది అని, అంటున్నారు ఛార్ట్స్ ఛక్ ఫినీ.

అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన విమానాశ్రయ రిటైలర్ డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ వ్యవస్థాపకులు ఛక్ ఫినీ. 1960లో రాబర్ట్ మిల్లర్ తో కలిసి వ్యాపారం ప్రారంభించారు.

సంపాదన బాగానే ఉన్నా మితంగా ఖర్చుపెట్టేవారు. వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరింపజేసి బిలియన్ల సంపదన కూడ బెట్టారు.

పుడుతూ ఏమీ తీసుకురాలేదు .. వెళ్లేటప్పుడు మాత్రం ఇవన్నీ ఎందుకు.. దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు అని తన సంపాదన మొత్తం దానం చేయ సంకల్పించారు.

తాను, తన భార్య బ్రతకడానికి కొంత మొత్తం రూ.14 కోట్లను ఉంచుకుని, మిగిలిన 58 వేల కోట్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.

నా ప్రయాణంలో, నేను చాలా నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో మాతో చేరిన అందరికీ, నా కృతజ్ఞతలు..

జీవించి ఉండగానే, ఇవ్వడంలోని ఆనందం గురించి తెలుసుకోండి, అని అంటున్నారు.

ఫినీ ఇప్పుడు తన భార్యతో కలిసి, ఓ అపార్ట్ మెంట్ లో సాధారణ జీవితాన్ని, గడుపుతూ ప్రశాంతంగా ఉన్నారు.

Billionaire Duty Free Shoppers Chuck Feeney 8 billion donation

Chuck Feeney, 89, gives his $8 billion fortune to charity - and says he is happier than ever (but has kept $2m for himself).

Former billionaire Charles Chuck Feeney has fulfilled his four-decade mission of giving away his $8 billion fortune to charity.

The 89-year-old gained his wealth by creating airport retailer Duty Free Shoppers with Robert Miller in 1960.

On September 14 he dissvolved his foundation Atlantic Philanthropies.

Through the group he gave $3.7 billion to education – including nearly $1billion to his alma mater Cornell and $270 million to improve healthcare in Vietnam.

One of his final gifts was a $350 million donation for Cornell to build a technology campus on New York Citys Roosevelt Island.

We learned a lot. We would do some things differently, but I am very satisfied. I feel very good about completing this on my watch - Feeney said.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,695; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 17-Sep-2020, Upd Dt : 17-Sep-2020, Category : America
Views : 729 ( + More Social Media views ), Id : 704 , Country : USA
Tags : billionaire , duty free shoppers , chuck feeney , 8 billion donation

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content