భళి భళి దేవా బాగున్నదయా మాయా, సుందరి నీవంటి - మాయాబజార్ - ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,328; 104 తత్వాలు (Tatvaalu) and views 224,880.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

20 ఏళ్ళు గా ఎంతో మంది తో మాట్లాడుతూ, వారి అమాయకపు ముందుచూపు లేని మోహ సమాధానాలు అబద్దాలు మోసాలు మాయలు కపటం చూస్తుంటే వింటుంటే, అలాగే పేపర్లో మన నాయకుల మరియు ఓటర్ల, మాటలు చేష్టలు చూస్తుంటే, వీరి తప్పులు మనుషులను తేలికగా ఏమార్చినట్లుగా, పంచభూతాలను కాలాన్ని ఏమార్చలేవు అని వీరికి తెలీదా? దేవుని ధనముతో కానుకలతో ఇతర అన్ని వస్తు సామగ్రితో పూజిస్తారు ఆర్భాటముగా, మనసుతో తప్ప.

వీరి రాతను వీరే ఎంత అమాయకముగా రాసుకుంటున్నారు, కళ్ళు నెత్తిపై కెక్కి అని జాలిగా బాధగా అనిపిస్తుంది. కానీ వారు పట్టించుకోరు, ఇంకా మనల్నే ద్వేషిస్తారు, మా ఆనందము అధికారముకు ఐశ్వర్యము ఓర్చుకోలేక మీరు అలా చెపుతున్నారు అని, మనము చాప మీద నిద్రపోతామని తెలిసి కూడా, పాపం.

ఇది వీరి అభ్యున్నతికి లేదా పతనానికి దారి తీస్తున్నది అని, వారి తో ఉండే వారు స్వార్ధం వీడి ఒకరూ చెప్పరా? వారూ అందులోనే ఆహూతి అవుతారా, శకునిలా? అంత వయస్సు లో అనుభవము లో వారికి తెలీదా అనిపిస్తుంది. ఇవన్నీ మన పురాణాలలో మన హైందవ కధలలో చెప్పిన సంగతులే, ఆకలింపు చేసుకుంటే అర్ధము చేసుకుంటే ఆచరిస్తే.

అప్పుడు మనకు అర్ధము అవుతుంది, వారు ప్రాపంచిక మాయలో ఉన్నారు, అహంకార మోహములో ఉన్నారు, అరిషడ్వర్గాలకు బానిసలై ఉన్నారు అని. మోహం అనే డిప్పలో జొరబడిన తాబేలు లా, బావిలో కప్ప లా, వారు బయట పరిస్థితి గమనించరు.

ఎవరు నీ మంచి కోరే వారు, ఎవరు నీ పతనం కోరుతూ, నీ వెంట స్వార్ధము తో ఉన్నారో కూడా తెలీదు.

అందుకే, మనము అనుకోవాలి - భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా

గత పుణ్య ఫలముతో, మన చేతికి ధనము పదవి అధికారం ఇచ్చి, ఆ జగన్నాటక సూత్రధారి గమనిస్తున్నారు, నిజముగా దేవునికి లేదా కుటుంబానికి లేదా బంధువులకు లేదా ప్రజలకు మంచి చేయగలడా, కనీసం మంచి మాట చెప్ప గలడా, మోసము కుట్ర అబద్దాలు లేకుండా? లేదా తన స్వార్ధానికి తన ప్రచారానికి మాత్రమే ఆ శక్తిని వాడుకుంటూ, పుణ్య క్షయం పొందుతూ, తన పతనానికి తాను బాటలు వేసుకుంటున్నాడా? అని పిస్తుంది.

సరిగ్గా వారి బొమ్మలాటను చూస్తూ, జీవితల నాటకం, ఆ దేవుని ఆటగా స్తుతిస్తూ సాగే ఈ పాట లో ప్రతి పదము అర్ధాన్ని చూడండి. ఇవి పాటల కోసమే కాదు, దేవుని కీర్తన కోసము, మనకు జ్ఞాన జ్యోతి వెలగడం కోసము, మన శ్వాస పెరిగి మానసిక బలం కోసం.

ఒకరు ఆనందము గా ఉంటే, ఇంకొకరు ఖేదములో, ఒకరు అనుకూలం ఇంకొకరు ప్రతికూలం లో ఉంటారు. ఒకరు ధనం లేదని బాధలో ఉంటే, ధనం పూర్తి గా ఉండి కూడా బాధలో ఉంటారు మనశ్శాంతి లేకుండా. ఇంకోకరు ధనం ఉన్నా లేకపోయినా, ఎప్పుడు ఆనందముగా ఉంటారు. ఎందుకు ఈ తేడా? దేవుని లీల నా? కాదు, మనిషి బలహీన మనసు లీల మాత్రమే. దేవుని పరీక్షకు నిలబడలేని మనిషి లీల ఇది.

ఆ తర్వాత కాసేపు నవ్వుకోవడానికి, రేలంగి పాట సావిత్రమ్మతో, సుందరి నీ వంటి దివ్య స్వరూపం, కూడా మనసారా పాడుకుని సంతోషపడగలరు.

1) పల్లవి:
భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా 2
బహు బాగున్నదయా నీ మాయా

చరణం 1:
ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో... 2
ఆ విధికైనను తెలియదయా .. బాగున్నదయా నీ మాయా

చరణం 2:
సుఖదుఃఖాలతో గుంజాటనబడు, లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలూ..2
తెలిసినవారే ధన్యులయా .. బాగున్నదయా నీ మాయా

భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా 2
బహు బాగున్నదయా నీ మాయా

2) లక్ష్మణ కుమారుడు : సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదు కదా 2
నీ అందచందాలింక నా వే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి

మాయాశశి : దూరం దూరం
లక్ష్మణ కుమారుడు : aa , దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా ఆ ఆ - 2
మన పెళ్ళివేడుకలింక రేపేగదా ||సుందరి ||

మాయాశశి : రేపటిదాకా ఆగాలి, ఆ

లక్ష్మణ కుమారుడు : ఆగుమంచు సఖియ అరమరలెందుకే, సొగుసులన్నీ నాకు నచ్చేగదా - 2
నీ వగలా నా విరహము హెచ్చేగదా ||సుందరి||

మాయాశశి : హెచ్చితే ఎలా? పెద్దలున్నారు

లక్ష్మణ కుమారుడు : పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి హూ ఆ 2
వద్దకు చేరిన పతినే కదా
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా ||సుందరి ||

భళి భళి భళి భళి దేవా, చిత్రం : మాయాబజార్ (1957), సంగీతం : ఘంటసాల, గీతరచయిత : పింగళి, నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ & సావిత్రి
Maya Bazar Bhali Bhali Deva Song in Colour - NTR, ANR, SVR & Savithri (1957)  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,328; 104 తత్వాలు (Tatvaalu) and views 224,880
Dt : 05-May-2022, Upd Dt : 05-May-2022, Category : Songs
Views : 643 ( + More Social Media views ), Id : 1380 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhali , deva , bagunnadaya , sundari , neevanti , maya , bazar , ntr , anr , svr , savithri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content