వాట్సాప్ లో వేరే వాళ్ళు పంపే వాటి కన్నా, చిన్నవైనా సొంతవి పంపుకుంటే బాగుంటుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,862,957; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మిత్రమా , ఇకనుంచి మనం అందరం వాట్సాప్ లో, వేరే వాళ్ళు పంపే, మంచి అయినా చెత్త అయినా, మరలా వేరే వాళ్ళ కు పంపి, పంపిన వాళ్ళ కు పుణ్యం లేక పాపమో వచ్చే టట్టు చేయకుండా , ఇంటర్నెట్ ట్రాఫిక్, రేట్లు పెంచకుండా, వైరస్ రాకుండా, మెమోరి నిండకుండా , మనం రాసిన వాటినే లేదా ఆచరించిన లేదా చేసినవాటినే, పంపుకుంటే బాగుంటుంది కదా.

ఉదాహరణకు

1. శుభోదయం, శుభాకాంక్షలు అని మనమే రాద్దాం , ఎవరో పంపిన రంగుల ఫోటో , వీడియో ఎందుకు

2. గుడి కి మనం వెళ్లి తే లేదా మన ఇంట్లో దేవుని ఫోటో మాత్రమే

3. మనం చేసిన మంచి పనులు మాత్రమే పంపుదాం.

4. పది పేజీల నీతి వాక్యాలో, గీతో , నగల ఫోటో/వీడియోనో నో ,ఆర్భాటాల పూజ ఫోటో/వీడియోనో నో, పంపే బదులు మన ఇంటి దేవుని కి, వేసిన తులసి దండ ఫోటో/వీడియో నో పంపుకుందాం , నేర్చుకున్న పద్యాన్ని పంపుదాం.

5. మనము చేసినవి, చూసినవి చెపితేనే మన వాళ్ళు వినరు. ఇంక ఎవరో పంపిన దాన్ని, ఏమి చదువుతారు ఆచరిస్తారు.

మొత్తం పుణ్యం మనమే సంపాదిద్దాం , మన సొంత వ్యక్తిత్వం తో ఒక జ్ఞాన మనే దీపాన్ని వెలిగిద్దాం. అది వీలుకాకపోతే ,వేరే వాళ్లు స్వయంగా ఆచరించి చెప్పిన దాన్ని, ఆచరిద్దాం గమ్ముగా. మిత్రమా. అర్దము చేసుకొంటావు గదా మంచి మనసుతో.

చిన్నవి అయినా, మన సొంతవి పంపుకుంటే నే బాగుంటుంది. మనవాళ్లు ఒకరు అయినా వింటారేమో, ఆచరిస్తారేమో. ఉదాహరణకు, పిల్లల భగవద్గీత పద్యం, పేరెంట్స్ కాళ్ళ కి నమస్కారం, మైలు నడక , 10 నిమిషాలు ఈత , పిల్లలు వేసిన బొమ్మ , . . . ఇలాంటి చిన్న వి ఎన్నో ఉంటాయి. మీరూ, మనందరం హీరోలమే. మీ సొంత మాటలు, ఫోటో లు , వీడియో లు, మీ వ్యక్తిత్వం ను తెలియజేస్తాయి.

మా క్లాస్ మేట్ ఎన్నో పరుగులు చేస్తాడు. ఫేస్ బుక్ లో ఫోటోలు పెడతారు. నాకూ ఆ శక్తి ఉందని ఉత్సాహం వస్తుంది.

అమ్మ కు కూడా చూపించి , తనే అన్ని మైళ్ళు పరుగెడితే , మనం అరమైలు నడవలేమా అంటా. అంతే రోషం తో కర్ర తో అరమైలు మొదలు. నిజంగా అయితే, రాను పోను మైలు.

కాబట్టి, ఏమో ఎవరు ఎవరు ఉత్సాహం పొందుతారో. ఇంక ఏమీ పెట్టని వారి గురించి ఆలోచన వద్దు , వారు పంచుకోరు.

Even though they are small or little works, our own are best to send. Our folks may listen and try. Example, kids bhagavat geeta poem, namskar to parents feet, mile walk, 10 min swim, kids drawing, . . . So many like this. You(everyone) are also a Hero. Your own words, photos, videos will show your character.

My classmate runs many miles and keep photos on Facebook. I will feel energetic by seeing them.

By showing them to mom, I will tell if he is running this much, why can't we walk half mile? She will activate and starts walking along stick. Fact, it is 1 mile to come back. We don't know who will get inspire. If someone don't put anything, don't worry about them, they won't share.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,862,957; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622
Dt : 30-Dec-2018, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 1854 ( + More Social Media views ), Id : 7 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : whatsapp , memory full , virus , send own typed messages
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content