దేవుని నమ్ముతా, పూజలు చేస్తా. దేవుడు ఎందుకు నిర్దయ? నా పైనే దేవునికి, కోపము నిర్లక్ష్యము? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,621; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, నేను దేవుని నమ్ముతా, పూజలు చేస్తా, గుడికి వెళతా. కానీ సంవత్సరముగా ఎన్నో ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు, దేవుడు ఎందుకు ఇంత నిర్దయగా ఉన్నారో, దయ చూపడము లేదో పరిస్తితులు మారడం లేదో తెలియడము లేదు. చాలా అసహనము గా బాధ గా ఉంది. నా పైనే దేవునికి, కోపము నిర్లక్ష్యము ఎందుకు? ఇక పూజలు మానేద్దామా అనేంత గా ఉంది.

జవాబు - విలేఖరి అంటే, కేవలం రాజకీయాలు, సినిమా కధలు రాయడమే కాదు, ఏ విషయాన్ని అయినా, అందరికీ అర్ధమయే భాషలో, వివరముగా ఉదాహరణ లతో రాయగలిగి ఉండాలి.

తెలుగు లో రాద్దాం. క్రిష్ణ జన్మాష్టమికి, జగద్గురువు క్రిష్ణయ్యను స్మరిద్దాం.

సాధారణము గా, పై పైన తూతూ మంత్రము గా, దేవుని గురించి అర్ధము చేసుకోకుండా, ఏదో మొక్కు బడిగా పూజలు చేసే వారి లాగా, మాట్లాడుతున్నారు. 80 శాతం ఇలాగే ఉంటారు. ఎందుకు పూజ చేయాలి, ఎలా మనసు తో రూపాయ ఖర్చు లేకుండా చేయాలి, మనసుతో నైవేద్యం ఎలా చేయాలో చాలా మందికి తెలీదు.

మన సొంత తల్లి కి తండ్రికి మన మీద కోపము వస్తుందా? ఒకవేళ వచ్చినా, మనకు కీడు చేస్తారా? కష్టం లో, మనకు సహాయం చేయరా? చేయలేదు అంటే, దాని వేనుక ఏదో కధ, అర్ధం పరమార్ధం ఉంటుంది కదా?

కొడుకుకి కూతురికి ధనము ఇస్తే, దుబారాతో అహంకారముతో నిర్లక్ష్యముతో తమను నాశనం చేసుకుంటూ తమ పెద్దలకే కీడు చేస్తూ, ఇతరులకు కూడా కష్టం కలిగిస్తారు అని, మన తల్లి దండ్రులే మనకు ఆస్తి ఇవ్వరు.

అది తప్పా? నేరమా? వాళ్ళ కష్టార్జితము వారిది, దానికి మనము వాళ్ళని నిందిస్తామా? లేక మనము బుద్ది మంతులమని నిరూపిస్తామా? ఏది మన ముఖ్య బాధ్యత?

రావణుడు కూడా, చివరలో రాముడు చంపుతాడు అని, శివ ధ్యానం చేసాడు. శివుడు కాపాడాలా, అతని గొప్ప చెడు గుణాలకు, పనులకు?

ధుర్యోధనుడు, చివరలో పాండవులు చంపుతారని, మడుగులో ధ్యానం తో ఉంటాడు? దేవుడు కాపాడాలా, కాపాడతాడా?

కర్మ ఫలము వదలదు, అనేది ఇందుకే. అది ఇప్పటిది కావచ్చు లేదా గత జన్మ ది కావచ్చు, మనకు నెల ముందు వే గుర్తు ఉండవు కదా?

సరే దేవుడు మన కష్టాలు తీర్చలేదని కోపమా?

కరోనాకు ఎంతో మంది వేలు లక్షలు వదిలించుకున్నారు. పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి మీకు ఆ ఇబ్బంది లేదు కదా? దేవుడు కాపాడాడా, ఆ బాధ పడకుండా?

మనకు నోటి మాట వస్తుంది, కాళ్ళు చేతులు కదులుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి. మరి అవి లేని వారి బాధలు మీకు తెలుసా?

మరి అవి మనకు ఇచ్చినందుకు, దేవునికి ఏమి క్రుతజ్ఞత చూపారు?

సూర్యోదయం ముందు లెగిచి, కనీసం స్నానం తో చెతులు జోడించి నమస్కరించారా? లేదే.. కనీసం తల్లి దండ్రుల పాదాలకు రోజూ నమస్కారం చేసారా? అదీ లేదే . . .

మన పూజ ఎవరి కోసం? దేవుని కోసమా? మన కోసమా? కేవలం మన మనశ్శాంతి కోసం. దేవునికి మన పూజ ప్రసాదం అవసరం లేదు.

మన తల్లి తండ్రి, మనల్ని పూజ చేయమని అడుగుతారా, అడిగారా? కేవలం, క్రుతజ్ఞలతో మనము చేస్తాము. అన్ని మనకు ఇచ్చిన వారు, మన నుంచి ఏదైనా ఆశిస్తారా?

బ్రహ్మాండాన్నేలే దేవునికి, ఏమి ఇవ్వగలము? ఒక ఊరా? జిల్లానా? అంత శక్తి మనకు ఉందా?

రాజకీయ నాయకులు, రాష్ట్రాన్నే తాకట్టు పెడతారు, తమ అవసరాల కోసం, కదూ. వారికి మనమే అండగా ఉంటాము కదూ, వారితో పాటుగా మన పాపం పెంచుకుంటూ.

అలాగే, మన చుట్టూ జరిగే ఎన్నో చెడు పనులలో, మన హస్తము కూడా ఉండవచ్చు. చూస్తూ గమ్మున ఉన్నా, పాపమే. మరి అవి ఆపగలమా?

చెడుకు దూరం గా ఉండ గలమా? లేదు కదూ, మన స్వార్ధ అవసర అవకాశాల కోసం, మరి తప్పు ఎవరిది?

కాబట్టి, దేవుని మీద కాదు కోపం, అసహనం చూపాల్సింది, మన మీద, మన స్వార్ధం మీద.

ఇన్నేళ్ళు వచ్చి కూడా, ఇంకా అరిషడ్ వర్గాలకు బానిసలమై, చెడు సావాసాలతో చెడు తిరుగుళ్ళతో చెడు పనులతో ఆలోచనలతో, మనసులో నే దేవుని ధ్యానం లో పట్టుకునే దోవ మరచి పోయాం. బయట వెతుకుతున్నాము.

అయితే, మన మనసు ఎప్పుడూ నిర్మలము గా ధర్మముగా ఉండాలి. అప్పుడు అన్ని అవే సమకూరతాయి, తప్పక సహాయం అందుతుంది.

ఒక సంవత్సరం కే మీరు ఇలా అంటే, 3 ఏళ్ళు గా మన పరిస్థితి మొత్తము సున్నా అయింది, ప్రభుత్వ ఉద్యోగం ఆదాయ వదలాల్సి వచ్చింది. అవన్నీ వదిలినా, కానీ ముదుసలి తల్లి చేయి సేవ, అలాగే నీతి ధర్మం మాత్రం వదలలేదు. గురువులైన మీ అందరి క్షేమం వదల లేదు, పలికినా పలకక పోయినా తిట్టినా తిట్టుకున్నా.

అయినా, దేవునికి నేను క్రుతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నా. ఎందుకంటే, ఈ స్థితిని ఎదుర్కునే ధైర్యం, దానికి కావలసిన సహాయాన్ని, 20 ఏళ్ళు పై గా, ఆయనే నాకు నేర్పి, సిద్దం చేసారు.

చెడుకు దూరం గా ఉంచారు. ఎన్నో సార్లు కాపాడారు. చేయి చాచే అవసరం ఇవ్వలేదు. మితము గా తినడం మితము గా సౌకర్యాలను అనుభవించడం ఆయనే నేర్పారు. శాఖాహారం చాప నిద్ర కూడా.

కాబట్టి, మనకు దేవుడు ఇచ్చిన దానికి, మనము ఏమి చేసినా రుణం తీర్చుకోలేము. ఇంకో 3 ఏళ్ళు కు మన పరిస్థితి మారకపోయినా, పచ్చడి వేసుకుని తిన్నా, నారాయణ దైవ నామ స్మరణ, మానము.

98 వారాలు 108 ప్రదక్షిణలు, 29 వారాల ఉపవాసం, 7 ఏళ్ళు గా దేవాలయ దీపారాధన మారలేదు, ఏలినాటి శని ఉన్నా కూడా. కరోనా నుంచి కాపాడినవి అవి కూడా.

చిత్తశుద్ది ఉంటే, మీరు లేదా ఏ సాత్విక మనసు అయినా, దేవుని మీద నమ్మకము, ధర్మా ఆచరణ, ఆపదు మానదు. మన లోపాలు పాపాలు, ముందు సరిచేసుకుందాం. దేవుడు పెట్టిన పరీక్షను, ధైర్యముగా ఆయన అండతోనే దాటదాము.

ఆయన మనకు సహాయం చేయడానికి రెడీ గా ఉన్నారు, కానీ అర్హత సాధించి, అందుకునే దిశ లో మనము సిద్దము గా లేక, ఆయనకు దూరము గా వెళుతున్నాము. నమ్మరా?

శని వారం మాటలు చూడండి, నేను గత ఏప్రిల్ నుంచి, మన శక్తి కొలది, ఓ 10 మంది కి సహాయం చేద్దామని ఎదురుచూస్తున్నా లక్షణాలు చెప్పి, మరి ఎవరూ అలాంటి వారి గురించి చెప్పలేదు, నాకు దొరకలేదు.

అలాంటి వారు ఉండరా? ఖచ్చితము గా ఉంటారు. ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలి, వారు మంచి మనసు తో దొరికేది ఎప్పుడో.

దైవ క్రుప తో ఎప్పుడో దొరుకుతారు, వారి మరి మన పుణ్యం కుదిరినప్పుడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,621; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975
Dt : 29-Aug-2021, Upd Dt : 29-Aug-2021, Category : General
Views : 719 ( + More Social Media views ), Id : 1238 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : believe , god , worship , ruthless , anger , negligence
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content