బర్రె చేనులో మేసిన, పిల్ల గట్టు న? పెద్ద గొర్రెలు ప్రాపంచిక మోహం లో, ఇంట్లో మిగతా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1545 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1580 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*బర్రె చేనులో మేసిన, దాని పిల్ల గట్టు న మేస్తుందా? పెద్ద గొర్రెలు ప్రాపంచిక మోహం లో ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి అదే విధంగా ఉంటాయి కదా? అందుకే పెద్దలు చెప్పింది, చెడపకురా చెడేవు. చేసుకున్న వారికి చేసుకున్నంత.*

శిష్యా, మీరు పంపేది ఒక్కటి కూడా చదవము, ఆచరించము, పాట వినము, మెచ్చము, ఇతరుల కు పంపము. మేము కూడా సొంత గా తెలుగు రాయము, సాధన చేయము, ఆరోగ్యం అని తెలిసినా పాడము, ఇంట్లో వారితో పాడించము, మీకు లేదా ఇతరులకు పంపము పంచుకోము. క్షణం తీరిక లేదు, రోజంతా బిజీ బిజీ, ఆసుపత్రిలో చేరిందాక, సంపాదించినవి వదిలిందాక, ఎవరో పోటు తో లాక్కున్నదాకా, అన్ని బంధాలు చీదరించినదాకా - కొందరి స్పందన మర్యాద తో, వాస్తవం ఒప్పుకుంటూ.

శిష్యుని జవాబు - తప్పు లేదు గురువు గారు, మీరు పలికినది అక్షర సత్యం, మీకు చాలా అనుభవం ఉంది, ప్రాపంచికములో. అదె ఇటు వైపు తిరిగితే, మీరు మేము ఒకటే.

దేవునికి మానసిక దైవ నైవేద్యం పెట్టిన తర్వాత, మీ లాంటి మంచి ఆత్మ బంధువులు ఉండటం భాగ్యం అనుకుంటూ తలచుకుంటూ, అందరికీ పంచాము/ పంచుతున్నాము. దైవ ప్రసాదాన్ని, స్వీకరించడం తిరస్కరించడం మీ ఇష్టం మీ హక్కు, అది మీ మంచితనం, దాని ఫలితము కూడా మీకే. ఎందుకంటే, ఎవరికో ఉపయోగము కాబట్టి, ఆ తలంపు వచ్చింది, వారికి చేరుతుంది, సందేహము లేదు.

పాండవుల మనస్తత్వమా, కౌరవులమా మనసా, మన ఇష్టం. అందుకే విధిరాత తప్పు, మనము అహంకారములో, స్వయముగా రాసుకునేదే మనిషిరాత. మనము చెప్పినా, 20 ఏళ్ళు గా నమ్మరు, నమ్మలేరు, తర్వాత వారు లేరు, ఇక ముందు ఉండరు, బాధలతో ఆ పతనము ఆగదు. మేము ఉండము కాకపోతే బాధ ఉండదు దేనిమీద మక్కువ ఉండదు నవ్వుతూ వెళతాము, కానీ మాలాగా చెప్పేవారు వస్తూనే ఉంటారు, జరిగేదానికి సాక్షీభూతులం.

మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని తలచిన పంపిన క్షణమే, దానికి తగిన పుణ్యం మాకు జమ అయిపోయింది. గురువులు, కరుడు గట్టిన అరిషడ్వర్గాల అష్ట వ్యసనాల బానిసలైతే, ఇంకొంచెం ఎక్కువ పుణ్యం జమ అవుతుంది. ఎందుకంటే, వారి పతనం ఆపే ప్రయత్నం ఏళ్ళు గా గట్టిగా చేస్తున్నందుకు. దైవ బిడ్డలుగా ఆత్మబంధువులు గా భావించి, వారి సేవ చేస్తున్నట్లే గదా, రోజు మేల్కొలుపుతూ?

భగవద్గీత లో చెప్పిన, సమతాస్తితి నిరూపణ అయ్యింది కదా, మీరే ప్రత్యక్ష సాక్ష్యం, సంస్కారం ఉన్నవారితో పాటు గా లేని వారిని (తెలిసిన వారిని తెలియని వారిని, దగ్గర వారిని దూరం వారిని, అభిమానించే వారిని ద్వేషించే వారిని, మెచ్చే వారిని తిట్టే వారిని, పలికే వారిని పలకని వారిని, మన వారిని పరాయి వారిని, కోటీశ్వరుని బీదవారిని, అధికారం ఉన్నవారిని ప్రతిపక్షం/ అనామకుని, ఆ పార్టీని ఈ పార్టీని, నమ్మే వారిని నమ్మని వారిని, ఆత్మశుద్ది ఉన్నవారిని లేనివారిని) కూడా 5 ఏళ్ళు పై గా తలచాము పంచుకున్నాము వారి బాగుకు ప్రాధేయపడ్డాము కదా, నిస్వార్ధముగా, ఏమీ అడగకుండానే?

సాత్వికులు ఎటూ 5 ఏళ్లుగా జవాబు ఇస్తున్నారు, తాము సాధనలో పరిపక్వత సాధించాలని. ఎవరి పనిలో భవిష్యత్తు లో వారు ముందడుగు వేయాలి కదా, తర్వాత అంకానికి. సాత్వికులు వలన మనకు పుణ్య జమ, పెద్దగా ఉండదు. ఎందుకంటే, నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారానికి ప్రతిసంస్కారం చెల్లు, అంటే వారి ఆత్మ మన ఆత్మ ఒకటే, ప్రతిస్పందన ఒకటే. వారూ జరిగేదానికి, సాక్షీభూతులు గా ఉంటారు, తప్పులో వెళ్ళు కాళ్ళు పెట్టరు, తప్పు జరిగితే పస్చాత్తపపడి క్షమాపణ చెప్పి మరలా చేయరు.

నిర్లక్ష్యం బద్దకం కుసంస్కారం లాంటి మంచి మనసుల కు దైవ ప్రతిస్పందన- వారి కుటుంబ సభ్యుల మాటలు అక్షరాల జరుగుతున్నాయి జరుగుతాయి జరిగాయి - పిల్లలు భాగస్వామి మాటలు వారిని - మీరు చెప్పే ది సోది, తలనొప్పి, వినము చేయము సహకరించము మెచ్చము. మా జీవితం మా ఇష్టం, మా ఆనందం మాకు ముఖ్యం. మేము ఎలా నాశనం అయితే మీకెందుకు, మీరు ఎవరిని గౌరవించరు, మేము అంతే. ఎవరి మాట మీరు వినరు, మేము అంతే. నచ్చని బంధువులు స్నేహితులు ఇతరుల గురించి సోది మాకొద్దు. మాకు బయట సినిమా రాజకీయ పెళ్ళి మోహవశులు అరిషడ్ వర్గాల అష్ట వ్యసనాల బానిసల మాటలే తీపి ఆనందం. మిమ్మల్ని మా దగ్గర ఉంచం, చేయి పట్టి తిప్పం, రోజూ పలకరించం, కావాలంటే ధనం ఇస్తాం, దరిదాపుల ఉంచం.

అందుకే పెద్దలు చెప్పింది, చెడపకురా చెడేవు. చేసుకున్న వారికి చేసుకున్నంత. వాళ్ళు లోలోపల కన్నీరు మున్నీరుగా, మరలా మనతో చెప్పుకుని, మనసు భారం దించుకోవడం. కష్టాలు కన్నీళ్ళు పంచుకోకపోతే ఎవరితోనైనా, పిచ్చి ఎక్కి మైండ్ పోతుంది. ఇప్పుడు చెప్పండి, మనది ఎన్ని కోట్ల రూపాయల మాట విలువ? ధనం పెరిగేకొద్ది, సంస్కారం తగ్గుతుంది. ధనం, ప్రేమను ఇవ్వదు, దూరం చేస్తుంది.

మన మానసిక ఫలమే, మన కుటుంబ సభ్యుల ప్రతిస్పందన. అందుకే మంచి చెయ్యి, విను, మాట్లాడు, ఆలోచన చెయ్యి, ప్రోత్సాహం చెయ్యి, ప్రచారం చెయ్యి. మన కుటుంబ సభ్యులు అదే చేస్తారు. ఒకరో ఇద్దరో తప్పు చేస్తారు, వారిని దూరం పెడతాము.

విభీషుణుడు అన్నను వదిలాడు కదా? పాండవులు కౌరవులను వదిలారు కదా? ప్రహ్లాదుడు తండ్రినే వదిలాడు, వారికి బంధాల విలువలు తెలీవా? హిరణ్యకశిపుడు, రాక్షస ధర్మం లేదని, కన్న కొడుకునే వదిలేయబోయాడు. బంధం కన్నా, ధర్మం ఎక్కువ. మరి మనం అరిషడ్వర్గాలను అష్ట వ్యసనాలను వదల లేమా? అణుకువగా ఉండలేమా, మనసు నియంత్రణ చేయలేమా, ఎవరినో ఒకరిని నమ్మి?

బర్రె చేనులో మేసిన, దాని పిల్ల గట్టు న మేస్తుందా? పెద్ద గొర్రెలు ప్రాపంచిక మోహం లో ఉంటే, ఇంట్లో ఉన్న మిగతావి అదేవిధంగా పతన మార్గము లో ఉంటాయి కదా? ఎవరి మీద ఎవరికీ అభిమానం ఉండదు, కేవలం అవసరం అవకాశం స్వార్ధం.

మనం మారందే మన ఇల్లు మారదు, సమాజం మారదు, కష్టాలు తగ్గవు. మన మంచి చెడు పనులు వాటి ఫలితాలు, మనకు వెనక్కు వస్తాయి. చివరలో భీష్ముడు, కర్ణుని కే తప్పలేదు, పాప ఫలితము. నేడు మన రామన్న, రాజన్నకే తప్పలేదు ఖర్మ ఫలితము. అవయవాలు చచ్చుపడ్డాక, మనసు మాట వినదు, నిలబడదు గురువు గారు.

barre chenuloa mesina pilla gattuna pedda gorrellu prapanchika moham loa, intloa migataa  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1580 General Articles, 54 Tatvaalu
Dt : 13-Sep-2022, Upd Dt : 13-Sep-2022, Category : General
Views : 53 ( + More Social Media views ), Id : 1515 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : barre , chenuloa , mesina , pilla , gattuna , pedda , gorrellu , prapanchika , moham , intloa , migataa , guru sishya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content