రాష్ట్ర స్ధాయిలో, అన్ని చూడలేరు కదా. అధికార వికేంద్రీకరణ, ప్రతిపక్షం లో కూడా ఉండాలి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,765; 104 తత్వాలు (Tatvaalu) and views 225,621.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గౌరవ ప్రతిపక్ష నాయకులు, తెదేపా చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్, భాజపా వీర్రాజు గార్లకు నమస్కారములు మరియు విన్నపము.

బాధ్యత గల ప్రతిపక్షాలు గా ఉండి, ప్రజలు కు అందుబాటులో ఉండి ప్రజల కోసం కష్టపడి ఈ 5 ఏళ్లు, తర్వాత కాలంలో అధికారంలోకి రావడానికి, తగిన ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉండాలి. అయినా కొన్ని సార్లు మన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కొన్ని సార్లు కేవలం అధికార పక్షం తప్పిదాలు వలన, ప్రతిపక్షం అత్యధిక సీట్లు తో గెలిచిన వైనం కూడా చూసాము.

సోషల్ మీడియాలో మన పార్టీ తరపున, స్ధానికంగా సరైన పేజీ గాని, రోజూ సమాచారం పెడుతూ, స్ధానిక సమస్యలు గురించి వివరాలు పెడుతూ ఉన్న, జిల్లా మరియు పట్టణ స్ధానిక పేజీలను కనుగొన లేకపోయాము. స్ధానిక నాయకుల, ఫోన్ నంబరు కూడా కనుగొనలేకపోయాము.

ఇంక సామాన్య ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని మరియు స్ధానిక నాయకులు ను చేరుకొనగలరు, తమ సమస్యలు విన్నవించుకోగలరు. రాష్ట్ర స్ధాయిలో, మీరు అన్ని చూడలేరు కదా. అధికార వికేంద్రీకరణ, ప్రతిపక్షం లో కూడా ఉండాలి కదా.

మీకు తెలిసీ రోజూ స్ధానికంగా, మా ప్రాంతంలో మా జిల్లా లో, రోజూ సమాచారం సమస్యలు పెడుతున్న, మన పార్టీ సోషల్ మీడియా పేజీ లింకు లు ఉంటే పంపగలరు. నాయకుల ఫోన్ నంబర్లు తెలుపగలరు, ప్రతి జిల్లా మరియు పట్టణమునకు ఇవి ఉంటే బాగుంటుంది.

కేవలం సోషల్ మీడియా గ్రూపుల వలన ప్రయోజనం లేదు, మన అభిమానులే కాదు బయట ప్రజలు కూడా రావాలి చూడాలి కదా. ప్రజలు మరియు మీడియా ఫాలో లేదా లైక్ అవడానికి, పబ్లిక్ సోషల్ మీడియా పేజీలు ఉండాలి.

ఉదాహరణకు ప్రకాశం జిల్లా స్ధాయిలో, మన మూడు పార్టీల కు చెందిన, రోజూ అప్డేట్స్ ఇచ్చే, అఫీషియల్ సోషల్ పేజీలు మరియు నాయకులు నంబర్లు కనపడలేదు, ఎంత వెతికినా గూగుల్ సెర్చ్ లో.

అలాగే, చీరాల పట్టణ స్ధాయిలో కూడా, రోజూ సమాచారం ఇచ్చే, పేజీలు కనపడలేదు. దయచేసి మీ స్ధానిక నాయకులు తో మాట్లాడి, వారిని ఉత్సాహ పరచి, వచ్చే ఎన్నికల కైనా సిద్ధం చేయాలి కదా. 5 ఏళ్ళు గమ్ముగా ఉండి, జనం తో కలవక, జనములో తాము చేసిన పనులు తెలియక, ఎన్నికల లో నిలబడి తే, ప్రజలు ఎలా గుర్తిస్తారు, ఎలా ఓటు వేస్తారు, ఎప్పుడూ కనపడని వ్యక్తి కి?

ఇన్నాళ్లు చంద్రబాబు గారి నాయకత్వం లో, ప్రకాశం జిల్లా మరియు చీరాల లో స్ధానికంగా, ఓ బలమైన తెదేపా నాయకుడిని తయారు చేసుకోలేకపోయింది అంటే, ఇంతకన్నా అవమానమేముంది. మరి బీజేపీ మరియు జనసేన ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా, బాబు గారి కన్నా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.

ఉదాహరణకు చీరాల ఎమ్మెల్యే ఊళ్ళో ఉండరు, ఫలానా అభివృద్ధి జరగలేదు అని గానీ, జిల్లా కావాలని , హార్బర్ రాలేదని, చేనేత పార్కు రాలేదని, మీ స్ధానిక నాయకులు ధర్నా లు చేయరు, జనాన్ని చైతన్య పరచరు.

ప్రకాశం జిల్లా అధికారులు మరియు స్ధానిక ఎమ్మార్వో పంచాయతీ మున్సిపల్ కూడా, సోషల్ మీడియా లో ప్రజలకు సమాచారం ఇవ్వరు, ఎందుకు అని నిలదీయరు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని తెలిసి, స్ధానిక నాయకులు ప్రశాంతంగా కలుగులో దాంకుంటే నిద్రపోతుంటే, ఇంకో వందేళ్ళ కైనా, మనకు అధికారం వస్తుందా? ప్రజలలో గుర్తింపు వస్తుందా? ఆలోచన చేయండి.

బాధ్యత గల ప్రతిపక్షం ఎలా ఉండాలో, తెలంగాణా బీజేపీ ని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి రోజూ ఎదో ఒక వార్త తో ప్రజల ముందు ఉంటుంది, రోడ్డు మీద పోరాటాలు చేస్తున్నారు. 4 పార్లమెంటు స్ధానాలలో గెలిచి, ప్రజల తో మమేకమై, మోడీ గారి అడుగు జాడలలో నడుస్తున్నారు.

మరి ఆంధ్రా లో, ప్రతిపక్షాల ఆసక్తి అభివ్రుద్ది, అంగుళం ముందుకు కదలడం లేదు, ఎందుకంటే ప్రజలతో 5 ఏళ్ళు కలసి మమేకమై తిరగవు కాబట్టి. ఇప్పుడు అయినా, స్ధానిక నాయకులు ను నిద్ర లేపి, సమస్యలు పై పోరాడి, రాబోయే స్ధానిక ఎన్నికల్లో, కనీసం కొన్ని సీట్లు అయినా తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేద్దాం. అన్యదా భావించవద్దు. మన స్దానిక నాయకులు ను , పార్టీ ని బాగు చేసుకుందాం. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,765; 104 తత్వాలు (Tatvaalu) and views 225,621
Dt : 07-Sep-2020, Upd Dt : 07-Sep-2020, Category : Politics
Views : 727 ( + More Social Media views ), Id : 685 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : state level , tdp , bjp , janasena , babu , pawan , virraju , decentralization , power , opposition
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content