సప్త వ్యసనాలు విన్నాము, కానీ అష్టవ్యసనాలు? ఏమిటా కొత్తది 8 వది, దాని విషవలయ పరిధి ఫలితాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,157; 104 తత్వాలు (Tatvaalu) and views 225,963.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఏమండీ సప్త వ్యసనాలు విన్నాము, కానీ అష్టవ్యసనాలు ఏమిటి? ఏమిటా కొత్తది 8 వది, దాని విషవలయ పరిధి మరియు ఫలితాలు ఎన్ని?* లింక్ లో 7 వీడియోలు చూడగలరు.

We've heard of Sapta Vyasan, but what are Ashta vyasan? What's new in 8th, what is its Vicious cycle range and results? Please watch 7 videos attached in link.

Ans జవాబు -

అష్ట వ్యసనాలు Ashta Vyasan - ముక్క లేదా మజ్జిగ ఫలితం - పంచరు పడ్డ సైకిల్ #ashtavyasan #saptavyasan

ఉపోద్ఘాతం : మన చుట్టూ, మిత్రులు చుట్టాలు ఎంతో మంది, గతంలో ఈ అష్ట వ్యసనాలకు బలి అయ్యారు. ఇంకొందరు బలి అవ్వడానికి, సిద్ధంగా ఉన్నారు.

కానీ అప్పటికీ ఇప్పటికీ మారనిది, వారి కుటుంబ సభ్యులకు జరిగే అన్యాయం. భర్త పోతే భార్యకు, సొంత వాళ్లే విలువ ఇవ్వరు. అలాగే భర్త కు కూడా. తండ్రి లేకపోతే పిల్లల కు, ప్రపంచ మార్గం సరిగ్గ ఉండదు, అదుపులో ఉండకపోవచ్చు. వారి కి వ్యాపారం ఉంటే అది ముగిసి, వారిపై ఆధారపడిన వారు కూడా, వీధిన పడతారు.

కానీ వీరు మారరు, తమ అలవాట్లు మార్చుకోరు. ఇంకా గొప్పగా చెపుతారు నలుగురు తో, 4 సీసాల మజ్జిగ, 4 కుటీరాలు, 4 పందాలు అని.

దాని బదులు గొప్పగా, మా ఆయువు తగ్గించుకుంటున్నాం, మా శారీక వ్యవస్థ ను చెడగొట్టుకుంటున్నాము, మా కుటుంబం మీదే మాకే జాలి ప్రేమ లేదు, మా పిల్లల కు స్వయంగా చెడు నేర్పుతున్నాము, మా కుటుంబం ను మేమే రోడ్డు న వేసుకుంటాం, అంటే బాగుంటుంది గదా.

ప్రతి వారు అంటారు బతికిన నాలుగు రోజులు, అన్ని తినమని, అన్ని చేయమని. మరి ఆ 3 రోజుల తర్వాత పోతే పర్లేదు, కానీ రోగం తో ఆసుపత్రి లో చేసే వారు లేకుండా ఉండాలి కదా 4 వ రోజు. అందుకే ఈ జాగ్రత్తలు.

మీరు చెప్పలేని ఈ మాటలు, మీ మిత్రులు అలా కాకుండా, ఇంకా ఉండాలి అని అనుకుంటే, వారితో పంచుకోవచ్చు.

No Devotee will do these ఏ భక్తుడు ఇవి చేయరు

ఇవి రజో, తమో గుణ లక్షణాలు These are the qualities of Rajo and Tamo Guna.

వివరణ :

గోపి, రాముతో ఇలా చెపుతున్నాడు తమ మిత్రుడు సూర్యం తాగడం మానాలి అని, అలాగే ధూమపానం కు, ముక్కలకు కూడా దూరంగా ఉండాలి అని. చిన్న కుటీరం(ఇల్లు) ఉంటే, దానికి దూరంగా ఉంటే మంచిది. అన్నిటి ఫలితం ఒక్కటే. అబ్బాయి, మన వాడి ని మార్చే బాధ్యత మీదే మజ్జిగ నుండి.

తంలో సప్త వ్యసనాలు అంటే 7 దుర్వ్యసనాలు అంటారు, వీటికి బానిస అయినవారు జీవితం మీద ఆశ వదులుకోవచ్చు. ఈనాడు బాగున్నా, ఏనాటికైనా అవి ముప్పు తెచ్చిపెడతాయి, ఆ కుటుంబ బతుకులను బజారు కు ఈడుస్తాయి.

అష్ట వ్యసనాలు - అవేమిటంటే 1) (పర) స్త్రీ/ పురుష మోహం, కేవలం ఆలోచన కూడా తప్పే 2) జూదం - పేకాట, లాటరీ, షేర్లు, ఇతర పందాలు 3) మద్యపానం, ధూమపానం, మత్తుపానం లేదా డ్రగ్స్ 4) వేట/ చంపడం - అతి జీవ హింస, ముక్క 5) కఠినంగా, పరుషంగా మాట్లాడటం, దూషించడం, చాడీలు, అబద్దాలు, కపటం, నాటకం 6) అపరాధాన్ని మించి దండించే స్వభావం 7) డబ్బు - దుబారా ఖర్చు, అప్పులు, జనం డబ్బుతో ఆస్తులు, బినామీ, ఆక్రమణ, నల్లధనం.

Ashta Vyasan 8 Addictions – They are 1) Lust for (other) women/ men, thought is also wrong 2) Gambling – Poker, Lottery, Shares, other bets 3) Drinking, smoking, intoxicating or drugs 4) Hunting/ killing – Biological violence, Meat 5) Harsh speaking, abuse, lies, Hypocrisy, drama 6) Punishment beyond guilt Nature 7) Money – extravagant spending, debts, assets with people's money, Benami, occupation, Black money.

ఇప్పుడు అష్ట వ్యసనాలు. ఇంటర్నెట్ (8 వ వ్యసనం) సౌలభ్యం వల్ల, ఇవి రూపాంతరం చెంది మరీ చేరువ అయ్యి, జీవితాలను తేలికగా సర్వ నాశనం చేస్తున్నాయి. మిగతా 7 ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు, సర్వ నాశనం చేయడానికి/ చేసుకోవడానికి తప్పుగా వాడితే. పై 7 వ్యసనాలు కి కూడా, మొదటి మార్గము మూలము 8 వదే అవుతున్నది ఇప్పుడు.

Now the 8 addictions. With the convenience of the Internet (8th Addiction), these have transformed and become more accessible, destroying lives with ease. The other 7 are one side, this alone is other side, if used wrongly to destroy/make everything. Also for above 7 addictions, the first path root is now 8th.

ఈ ఒక్క 8 వ ఇంటర్నెట్ వ్యసనములోనే వందల మోహాలు, మాయలు, మోసాలు ఉంటాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేంస్, సినిమాలు, సీరియల్, టీవీ, చెత్త సాహిత్యం, చాట్, మొబైల్, ఆన్లైన్ మోసాలు, . . . పై వ్యసనాలలో 2 వ మనిషి లేదా వయస్సు కావాలేమో కాని, ఈ 8 వ వ్యసనములో, మనకు మనమే ఇంట్లో కుర్చీలో కూర్చోని, ఏ వయస్సు లో నైనా ఒంటరిగా తేలికగా అధోగతిని పొందవచ్చు.

There are hundreds of delusions, tricks and deceptions in this 8th addiction alone. Internet, Social Media, Games, Movies, Serial, TV, Garbage Literature, Chat, Mobile, Online scams, . . . The above addictions may need 2nd person or age, but in this 8th addiction, we ourselves can easily get degenerate at any age by sitting in a chair at home.

అందరూ అష్ట వ్యసనాలు లేదా ఏదో ఒక వ్యసనం పరిమితి(కొంచెము) లో పర్లేదు అని లేదా స్నేహితుల ప్రొద్బలముతో లేదా సొంతము గా, గొప్ప గా మొదలు పెట్టి, ఏదో ఒక బాధలో లేదా బలహీన క్షణంలో, వాటికే నిత్యము బానిసలు అవుతారు.

మనల్ని చూపించి చెప్పు, మనల్ని తిట్టిన పర్లేదు. గంట ఎండలో ఉండలేనోడు, 20 ఏళ్లుగా ముక్క మత్తు మజ్జిగ తీసుకోకపోతే, కష్టజీవులం 8 గంటలు ఎండలో తిరిగే మనకు, దమ్ము ధైర్యం ఎంత ఉండాలి? ఛత్, ఈరోజు నుంచి మానేద్దాం మజ్జిగ, ముక్క, చిన్న కుటీరం, ఇంకేమి అయినా వ్యసనాలు ఉంటే.

రేపు వచ్చినప్పుడు చెపుదాం, ఆ రోజు నుండి ఈరోజు వరకు ముక్క మజ్జిగ మానేసాము, ఏమి మేము అంత పట్టుదల లేని వాళ్ళమా అని. అలాగే ఎవరూ లేని వాళ్ళు, మీరే అంత జాగ్రత్త గా ఉన్నప్పుడు, సంసారం కుటుంబం పిల్లలు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం, మాకు మాత్రం లేదా ఏంది, అని చెపుదాము.

మజ్జిగ లేదా ముక్క వలన(ఇతర వ్యసనం వలన) జీర్ణ శక్తి కి , శరీరం దాని వ్యవస్థ ఎక్కువ పని చేయాలి. ఇంక కల్తీ మజ్జిగ లేదా ముక్క తో, ఎక్కువ నాశనం. అంటే ఎక్కువ వాడితే సైకిల్, దాని చైను అరిగినట్టు లేదా తెగినట్లు, ఆయువు ఓ 5 లేదా 10 నిమిషాలు తగ్గింది అనుకో.

అదైతే పర్లేదు, కాని అరిగినట్టు లేదా తెగితే, లివర్ కాలేయం లేదా ఇతర వ్యవస్థలు బందు చేస్తాయి. ఈ రోజుల్లో హస్పటల్ కు వెళ్ళాం అంటే, ఇల్లు గుల్లతో పాటు, కాటికి దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకున్నట్లే. యమలోకానికి అర్జీ పెట్టినట్లే. సర్వీస్ చార్జీ లేకుండా, ఆసుపత్రి వారే రికమెండ్ చేస్తారు ఉచితముగా.

అదే శాఖాహారము తీసుకుంటే, తేలికగా జీర్ణం అవుతుంది. ఈనాడు, శాఖాహారమే రసాయనాలతో కల్తీ అవుతుంది.

ఇంక మందు ముక్క మగువ లేదా మిగతా వాటి కల్తీ గురించి చెప్పాలా, అన్నారు కాకినాడ కామేశ్వర రావు గారు, 1979 లో, చివర దశలో జబ్బుతో మంచం ఎక్కాక, లక్షల ఖర్చుతో, రోడ్ న పడ్డాక. పెద్దాయన మాట కొంచేము గౌరవిస్తే, మన ఇల్లే గుల్ల అవకుండా, మన కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది కదా.

ఏ వ్యసనం వలన అయినా కూడా, మన మైండ్ (మనసు/బుద్ది) మత్తుగా ఉంటే, నాడీ వ్యవస్థ మొద్దు బారుతుంది. పంచరు పడ్డ సైకిల్ లా. దాన్ని తొక్క నూ లేము , ఎత్తు కొని మొయ్యనూ లేము. మన నుంచి ఎవరు డబ్బు కొట్టేసినా, మనకు తెలీదు. సంతకము చేయమన్నా చేసేస్తాము. ఏమి మాట్లాడుతున్నామో కూడా తెలీదు.

ఇంక మనం మత్తులో పడి ఉంటే, భార్య పిల్లల పరిస్తితి ఏమిటి. ఇల్లు(లేదా మనం) తగలబడుతున్నా లేదా దొంగతనం జరుగుతున్న, మనం లేవగలమా, ఆస్తిని బిడ్డలను కాపాడగలమా? అసలు నీకు నువ్వే నిలవలేని పరిస్తితిలో, ఇంకొకరికి ఏమి సాయాం చేయగలవు. నీ కుటుంబానికి కూడా అన్యాయం చేసి పోవడము తప్ప.

పొనీ అవన్నీ అనుకున్న, మనకు సంఘములో లేదా స్నేహితులలో విలువా గౌరవము ఉంటాయా? మన పిల్లలు బయటకు చెప్పకపోయినా, మనసులో బాధపడరా? ఇవే నేర్చుకోరా?

ముక్కకు కూడా దాసోహం అనే వారు చాలా మంది ఉన్నారు. ఇంక చిన్న కుటీరం సంగతి చెప్పక్కరలేదు.

ఆ, ఇన్ని రోజుల జరగలేదు అంటావా? ప్రతి మనిషి కి రోగ నిరోధక శక్తి అని ఒకటి ఉంటుంది. అది ఒక్కో స్ధాయి లో ఉంటుంది. మన ఖర్మ కాలినపుడు లేదా శనయ్య చూపు పడ్డప్పుడు, అది తగ్గిపోతుంది, మన పతనం మొదలవుతుంది. దానిని మనము ఎందుకు తగ్గించుకోవాలి అనవసరముగా? హస్పిటల్ మందు లు రోజులు పొడిగింపు కు మాత్రమే, జీవితాన్ని నిలబెట్టటానికి కావు.

పోనీ ఈ దుర్వసనాల తో చచ్చినా, ఫలితం ఉంటుందా? అదీ లేదు. అలా పోయిందుకు ఇంకో 100 కేజీల అధిక పాపం. అంతే గాదు, ఈ జన్మలో చెయ్యాల్సిన పనులు చేయడానికి లేదా పడాల్సిన ఇబ్బందులు పడటానికి కుదరలేదు కాబట్టి, అవి తీరడానికి మరలా పుట్టి ఈ దుర్భరమైన బతుకు మరలా మొదలు పెట్టాలి.

అంటే అసలు తో పాటు వడ్డీ పాపం కూడా వస్తుంది. అంటే, నీ రాత నువ్వు రాసుకున్నట్లే గదా. తర్వాత దేవుడిని తిట్టుకుని ఏమి లాభం.

ఇక మనము లేకుండా, మన కుటుంబం మరియు మన పిల్లల బతుకులు ఒక్కసారి ఆలోచన చెయ్యి. తండ్రి లేని పిల్లల పరిస్తితి చూడు బయట లోకములో. నీ పిల్లలు, నీ భార్య మీద నీకు లేని జాలి ప్రేమ, బయటవారికి ఎందుకు ఉంటుంది? వారి అవసరాలకు వాడుకోని, బ్రష్టు పట్టిస్తారు, దానికి కారణం నీవు కాదా?

ఆ వ్రుధా ఖర్చు కన్నా, బయట జనానికి అన్నదానం చెయ్యవచ్చు. మొక్కలు పంచవచ్చు. పిల్లలకు మంచి చదువులు చెప్పవచ్చు. ఇంట్లో మంచి వస్తువులు కొనచ్చు. తోటి స్నేహితులకు సహాయము చేయవచ్చు.

దేశానికి, ఒళ్ళు గుల్ల చేసుకుని మీరు కట్టే టాక్స్ మంచిదే గానీ, మన కుటుంబం నాశనము చేసుకొని, ఇలా దేశానికి సేవ చేయమని ఏ శాస్త్రం లో కూడా చెప్పలేదు మిత్రమా. అంతా నిష్ప్రయోజనం, అంటే బూడిదలో పోసిన పన్నీరే.

అలాగే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంటర్నెట్ వాడేది జాగ్రత్త గా గమనించాలి. చాలా అనర్ధాలు జరుగుతున్నాయి, రోజూ పేపర్లో చూస్తున్నాము.

గోపి, రాముతో ఇలా చెప్పి, ఇక మిత్రుడు సూర్యం బాధ్యత మీదే అన్నాడు. సూర్యం తో తప్పకుండా, చెపుతాను, తను వినాలి మారాలి మరి, తన కుటుంబం మీద ప్రేమ ఉంటే అన్నాడు రాము.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,157; 104 తత్వాలు (Tatvaalu) and views 225,963
Dt : 06-Aug-2019, Upd Dt : 06-Aug-2019, Category : General
Views : 4162 ( + More Social Media views ), Id : 150 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 8 bad habits , drinking , meat , chinna illu , drug , smoking , ashta , vyasanamulu , sapta , ashtavyasan , saptavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content