20 నెలల ప్రేమ కోసం, ఇంటి నుంచి క్రుతజ్ఞత లేకుండా పారిపోయి, పెళ్ళి చేసుకున్న వాళ్ళు గొప్పవారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,438; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*20 నెలల ప్రేమ కోసం, ఇంటి నుంచి విశ్వసనీయత క్రుతజ్ఞత లేకుండా పారిపోయి, పెళ్ళి చేసుకున్న వాళ్ళు గొప్పవారా? 20 ఏళ్ళ ప్రేమ కోసం, సంస్కార గుణముల పెళ్ళితో, బాధ్యత గా ఇంట్లో నిలబడ్డవారు గొప్పవారా?*

*For 20 months of love, those who ran away from home without any gratitude Credibility and got married are great? For 20 years of love, with cultured marriages, those who stay at home as a responsibility are great?*

ఎప్పుడైనా ఒక మాట, ఒక మంచి కోసం, నిలబడాలి అంటే, వారిలో పెంపక సంస్కారం, నర నరాన ఉండాలి. అది ముందు పెద్దలకు ఉండాలి, వారికే లేనిది, పిల్లలకు రాదు. తల్లి సోషల్మీడియా ఆడంబరాలు సీరియల్ సినిమాల పిచ్చిలో, తండ్రి 2 ఇళ్ళు లేదా బార్ ఇంట్లో సరదాగా బాధ్యత లేని జీవితం నడుపుతుంటే, పిల్లలు నీతి గా ఉంటారా?

ఇంట్లో పెద్దలు మాటలు ఇలా ఉంటాయి - వారేమన్నా మన కన్నా పెద్దా, మనకు లేనిది ఏమిటి, మనకు తిండి పెడుతున్నారా, వారి మాట ఎందుకు వినాలి అని, తమకు మంచి చెప్పిన ఇతరులను గేళి చేస్తారు, అవమానిస్తారు.

పై మాటలలో, నీతి నియమము, పెద్దతనము, సంస్కారము ఉందా? లేదు, కేవలం అవసరం అవకాశం అహంకారం మాత్రమే ఉంది. మరి అలాంటి పెంపకములో పెరిగిన పిల్లలు, ఏమి చేస్తారు?

తాము అలా ఎందుకు అంటున్నామో, ఎవరిది నీతి నియమమో, పిల్లలకు అర్ధము అయ్యేలా చెప్పరు.

ఆ మాటలే పిల్లలు పట్టుకుంటారు, వంట పట్టించుకుంటారు, వారికి అవే మంచి అవకాశ అవసర మాటలు, మంచి చెప్పే వారిని తూలనాడటం, వదిలివేయడం, చెడు చెప్పే వారిని, పొగిడేవారిని, దొంగ దోవలో స్వర్గం చూపే వారిని, ముందు చూపు లేకుండా పతనం అయ్యే వారి మాటలు, వారికి బాగా రుచిస్తాయి, వారితో కలసి తానా తందానా అంటారు, తమ పెద్దలు లాగనే, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలకు బానిసలై, తమ 10 వ తరగతి నుంచే.

మన చుట్టూ ఉన్న వారిలోనే, 50 మంది వెన్నుపోటు తప్పు కాదు అంటున్నారు. ఇంకో 50 మంది కేసులు ఫాక్షన్ లేని వాడిని, ఎలా సీయెం గా ఎన్నుకుంటాము అంటున్నారు. వీరిలో 40 మంది, కనీసం 300 కోట్లు ఆస్తి లేని వారిని, జన ధనంతో నడిచే ప్రజా పధకాలకు తమ వంశ పేర్లు పెట్టని వారిని, సీయెం గా ఎలా చేస్తాం అంటున్నారు.

ఇంకో 40 మంది, మా పిల్లలు ఏ డ్రెస్స్ లు వేస్తే, ఎవరితో తిరిగితే, మీకు నెప్పి ఏమిటి అంటున్నారు. సహజీవనం తప్పు కాదు, స్నేహం తో ఎంత మందితో తిరిగినా, ఇంటికి ఎంత అర్ధరాత్రి వచ్చినా నష్టం లేదు అంటున్నారు. గుణం కూడు పెట్టదు, రీచార్జ్ చెయ్యదు, బైక్ మీద షికార్లు సినిమాలు తిప్పదు, ధనం మాత్రమే, మా కుటుంబం ను త్వరగా నాశనం చేస్తుంది అని గుడ్డి గా నమ్మి, అదే దోవలో నడిపిస్తున్నారు. మరి వీరి పిల్లల పరిస్తితి ఏమిటి?

ఈ రోజుల్లో ఇదొక ఫాషన్ అయిపోయింది. 20 ఏళ్ళు ఈ శరీరాలు పెంచి పోషించిన, ఇంట్లో అమ్మ అయ్య మీద లేని, ప్రేమ, 20 నెలలు గా తిరిగిన, తమ స్నేహితుల మీద వస్తుంది.

చేతిలో రూపాయ సొంత సంపాదన లేక పోగా, అడిగినంత ఇచ్చి, రాత్రి సినిమాలు క్లబ్ లకు పంపి, బలాదూర్ తిరగమని బండి కొని ఇచ్చి టాంక్ నింపి, బాధ్యత లేకుండా పెంచిన తల్లి దండ్రులకు, బుద్ది చెప్పే మంచి ఉద్దేశ్యముతో, కొంత మంది యువకులు, తప్పు దారి పడుతున్నారేమో అనిపిస్తుంది.

ఎందుకంటే, పిల్లలకు రామాయణ భారతాలు చెప్పరు. మంచి వాడు కర్ణుడు ఎలా ధనం ఆస్తి పదవి రాజ్యం కోసం, తప్పుడు వారితో కలసి పతనము అయ్యారో చెప్పరు.

కైక మోహము లో పడి, దశరధుడు, ఎలా దారి తప్పాడో, రామునికి ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టాడో చెప్పరు. శూర్ఫణఖ మోహములో పడి, మంచి వాడైన లక్ష్మణుని చేత, పరావింపబడి, తన అన్న రాజ్యాన్నే సర్వ నాశనం చేసిన కధలు చెప్పరు.

ఈ యువత కూడా, కనీసం రాక్షస స్వభావం గల రావణ దుర్యోధనులు లాగా, ధైర్యముగా నీతి నిజాయితీతో, మేము మోహములో పడి, తాపం తగ్గించుకోవడానికి, ఇల్లు విడిచి పారిపోతున్నాము, ఇంత బలహీన మనస్కులను పెంచిన, మానసిక నియంత్రణ లేని మా బుద్దిమాలిన పెద్దలకు, తగిన శిక్ష ఇదే అని కూడా, బహిరంగముగా చెప్పకుండా దొంగలు లాగా పిరికి వాళ్ళుగా పారిపోతున్నారు.

పారిపోయిందే గాక, కపట నాటక మనసులతో, మేము 20 నెలల కొత్త అవసర ప్రేమ కోసము, 20 ఏళ్ళ ప్రేమ వదిలేసి, బాధ్యత సంపాదన లేకుండా, ఎవరో ఒకరి దయా భిక్షతో బతికి, సంసారం చేసి పిల్లలను కని, మరలా ఇలాంటి నీతి నియమము లేని, బలహీన భవిష్యత్ తరాలను తయారు చేస్తున్నామని గొప్పగా చాటుగా చెబుతున్నారు.

వీటినే కధలు గా తీసుకుని, తమ పిల్లల చేతిలో బలైపోయిన, సంస్కారం లేని, ధన స్వభావం గల నిర్మాతలు దర్శకులు, సినిమాలు తీసి, ఇతరుల పిల్లలను కూడా, తమ పిల్లలు లాగనే పాడు చేసి, సంపాదన బాధ్యతకు ముందే, ప్రేమ పిచ్చితో ఊగిపోయి, శరీర పటుత్వం తప్పే విధముగా బలహీన సమాజాన్ని తయారు చేస్తున్నారు. మన మానసిక నియంత్రణ లేని పిల్లలు, ఆ సినిమాలు వందలు ఖర్చు బెట్టి, మొదటి 2 నెలలలోనే చూసి తరించి, త్వరగా పతనం అవుతున్నారు.

ఇలా పారిపోయిన లేదా అమాయకపు ప్రేమ పెళ్ళి అన్న వారిలో 75 శాతం, శారీరక అవసరాలు తీరాక, మరలా వారిద్దరూ పోట్లాడుకుని, పోలీసులకు లాయర్లకు చేతినిండా సంపాదన పని కల్పిస్తున్నారు. తమ పెద్దలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.

ఇంకా ఫాషన్ ముదిరి, ఇతర మతాల వారిని కూడా, తమ అవసర అవకాశాలకు పెళ్ళి చేసుకుని, ఘోరముగా నశించిన వార్తలు కూడా పేపర్లో చూస్తున్నాము.

Those who ran away from home as cowards without proper responsibility and income and got married, are not great folks...

20 ఏళ్ళ పైన సంస్కార పెంపక తల్లి దండ్రుల అంగీకారముతో, ధనం పదవి వీసా అవసరం అవకాశాలకు ఆత్మను అమ్ముకోకుండా, గుణవంతుల పిల్లతో పెళ్ళి అయ్యాక కూడా, భాగస్వామి నుంచి, బాధ్యత ల నుంచి, ముదుసలి తల్లి తండ్రులు మరియు అత్తమామలు ను దగ్గర ఉంచి సేవ చేయడం నుంచి, సంస్కార పిల్లల పెంపకం నుంచి, తప్పించుకోవడం కోసం, ఇంట్లో నుంచి పారిపోకుండా ధైర్యంగా, ఉండే వాళ్ళేరా నిజమైన గొప్పోళ్ళు.

With the consent of the parents, who gave everything for 20 years, without selling the soul for the opportunities money job position visa, even after getting married with a good person, without escaping from the partner, from the responsibilities, from serving the elderly parents and in-laws, from raising the samskar children, , these are real great folks.

అలా లేని వారికి, జంతువుల పెళ్ళికి, జంతువుల సంతానానికి తేడా ఏముంది అని పెద్దలు అంటారు.

సంస్కార పెంపకానికి గుర్తు, ముదుసలి తల్లి దండ్రులు/ అత్త మామలు, తమ సంస్కార పిల్లలతో, హాయిగా చివరి దశలో ఇంట్లో ఉంటారు సుమీ.

A symbol of Samskara upbringing, elderly parents/in-laws, with their Samskara children, stay comfortably at home in the final stages.

ఈ సంస్కారం గుణం బాధ్యతలు, భరించలేక విడిగా దూరం గా ఉంటూ తిరుగుతూ, ఏవో కారణాలు చూపుతూ, ఆత్మ ద్రోహం తో, ఉండే జీవాలు జీవచ్చవాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి, తమ అరిషడ్ వర్గాలు అష్ట వ్యసనాల బానిసత్వం లో.

There are many living beings around us who are unable to cope with the responsibilities of this samskara gunam, wandering apart, giving reasons, betraying their soul, in their arishadvarg ashTavyasan slavery.

వారి ఉద్దేశ్యం ఒకటే, తమ లాగే, ఇతరుల జీవితాలు నాశనం కావాలి, అందుకే మనకు నీతి నియమాలు సంస్కారం వద్దు, దుర్యోధన రావణుని లా అవన్నీ గాలి మాటలు అంటారు, పంచభూతాల శిక్షకు మనల్ని ఎర వేస్తారు, తస్మాత్ జాగ్రత్తలు సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,438; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067
Dt : 20-Nov-2022, Upd Dt : 20-Nov-2022, Category : General
Views : 348 ( + More Social Media views ), Id : 1617 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 20 , months , love , lovers , ran , away , gratitude , credibility , married , great , parents , samskara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content