లక్ష్మీ గారిని అవమానించేవారు, ఎన్టీఆర్‌ కు ద్రోహులా లేదా క్షేమం కోరేవారా/ అవకాశవాదులా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,776; 104 తత్వాలు (Tatvaalu) and views 225,934.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ లక్ష్మీ పార్వతి గారిని ప్రశ్నించేవారు/ అవమానించేవారు/ అనుమానించేవారు, ఎన్టీఆర్‌ కు ద్రోహులా/ అభిమానులా/ క్షేమం కోరేవారా/ అవకాశవాదులా? లేదా

మన ఇంటికి వచ్చిన పరాయి వారిని తప్పుడు వారిగా చెప్పాము అంటే, మన కొడుకు/ కుతురు కు అంతే ద్రోహుల/ క్షేమం కోరేవారా?

వీరు అవమానిస్తున్నది, బయటవారినా, మన సొంత వారినా? ఎవరిది మొదటి తప్పు? ఏది ధర్మం/ అధర్మం?*

జవాబు - ఇది పెద్ద సామాజిక ప్రశ్న. ప్రతి ఇంటిలోనూ ఈ సమస్య ఉంది. ఇది ఒక్క లక్ష్మీ గారికే కాదు, మన ఇంటికి వచ్చిన, ప్రతి కోడలు/ అల్లుడుకి చెందిన ప్రశ్న.

ఇక్కడ 100 కి 75 మంది మోహం లో ఉంటారు, 2 నాల్కలు అవసర అవకాశవాదులు కాబట్టి, పప్పులో కాలు వేస్తారు. ఈ జవాబు ఒప్పుకోరు, తమకు అనుభవం అయ్యి, బుద్ది వచ్చిన దాకా.

అసలు మూల సమస్య వదిలేసి, పైన సమస్య గురించి మాట్లాడతారు. కేవలం ఇతరుల తప్పు గురించి మాత్రమే తమ జీవితాంతం ఆడిపోసుకుంటూనే ఉంటారు. అలాగే భర్త/ భార్య తప్పులు వదిలిపెట్టి, అత్త మామల మీద పడి తిడుతూ ఉంటారు. కొడుకు/ కూతురు తప్పులు వదిలిపెట్టి, భాగస్వామి మీద పడతారు. ఆత్మ విమర్శ చేసుకోరు. వారికి, వీరికి ఇద్దరికి మనశ్శాంతి ఉండదు, ఉండనీయరు, పాపము తగ్గదు, పిల్లలు చెడిపోతారు తప్పుదోవ పడతారు.

అది ఒక నిరంతర రగిలే కుంపటి. తల నొప్పికి మందు, మోకాలి చిప్పకు రాసినట్లు గా ఉంటుంది, వీరి మాటలు చేష్టలు.

ఆడలేక మద్దెల ఓడు అన్నారు అంట, అంటే, మనకు డాన్స్ రాక, ఎగరలేను శక్తి లేదు చేతకాదు అని నేరుగా ధైర్యంగా చెప్పలేక, చవట సన్నాసి వలె, ఇతరుల మీద గుడ్డ కాల్చి వేయడం లాగా, వారు సరిగ్గా సంగీతం పలికించడం లేదు, పాట పాడటం లేదు అని అన్నారు అంట, అవ్వ.

ఒక ఉదాహరణతో, అసలు విషయానికి వద్దాము. మన పిల్లవాడి/ పిల్ల కి, పెళ్ళి చేసాము, లేదా వారే మోహముతో ప్రేమించి, వీరి అంత సుగుణవంతులు ఇంకొకరు భూమిపై లేరు మాతో నడవడానికి అని పెళ్ళి చేసుకున్నారు.

ఇప్పుడు మనము 6 నెలల తర్వాత, పిల్లాడి ఇంటికి వెళితే, ఆ కోడలు పిల్ల, తన భర్త కళ్ళ ఎదురుగానే, మనల్ని బయటనే ఆపి, ఇంట్లోకి రానీయకుండా తలుపు వేసింది లేదా ఇంకో అవమానం చేసింది. మన స్నేహితులు బంధువులు అందరూ చూసారు.

ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది ఈ మొత్తము విషయములో? బానిస కొడుకును అమ్మిన మనదా అంటే పెళ్ళి చేసిన పెద్దలుదా? తలుపు వేసిన లేదా అవమానం చేసిన, బానిసను కొన్న కోడలు దా? ఆమె చేసింది తప్పు కాదని చూస్తూ ప్రశాంతముగా ఉన్న, అమ్ముడుబోయిన ఆత్మాభిమానంలేని మన కొడుకుదా?

మనకు తెలిసి, అరిషడ్వర్గాల బానిసత్వము లో 100 కి 75 మంది, మా ఇంటివి బంగారాలు సంస్కార గనులు, బయటనుంచి వచ్చిన కోడలు/ అల్లుడు ది మాత్రమే తప్పు అంటారు. మందు మాకు పెట్టి మాయచేసింది అంటారు, అవునా?

అది అధర్మం, కేవలం కళ్ళ ఎదురు చూసిన సంఘటన బట్టి లేదా విన్న మాటలను బట్టి లేదా తప్పుడు సాక్ష్యం బట్టి, మనం తప్పులు ఒప్పులు నిర్ణయం చేయకూడదు. ఆమె బయట ఆమె. ఆమె గుణం, తప్పు ఒప్పు అసలు, మనకు అవసరమా? మనము ఎన్ని అన్నా, లాభం ఉందా, ఆమె వింటుందా, మారుతుందా, మనల్ని క్షమిస్తుందా?

ఎందుకంటే భర్త చూస్తూ, ఎదురుగా మౌనముగా ఉన్నాడు, వారిద్దరికి ఇష్టమే కదా, అసలు గొడవలేదు, అది మరువద్దు. వారు ఇద్దరికి గొడవలేనప్పుడు, వారిని మనమెలా మధ్యలో దూరి తప్పు పడతాము?

మూలానికి వెళ్ళాలి. 1. అసలు ఆ కోడలు/ అల్లు ని ఎన్నికుని, మాట్లాడి తెచ్చినది ఎవరు? మనము లేదా మన అబ్బాయి/ అమ్మాయి, అంతేనా? 2. పెళ్ళి ఏ విధముగా జరిగింది - గుణము/ మంచి అనేది వదిలేసి, లక్షల కట్నము ఆస్తులు అవకాశ అవసరము హోదా అధికారం వీసా తో, అంటే మోహపు మోసపు పెళ్ళి, ముందు మనమే తప్పుడు వారము, ఇంక అవతలి వారి గురించి, ధర్మం అధర్మం మనకెందుకు.

అంటే, వెనకా ముందు ఆలోచన లేకుండా, మనము సంబంధము తెచ్చి చేస్తే, మొదటి తప్పు మనదే, కాబట్టి శిక్ష మనకే, కదా? ఒకవేళ మన పిల్లలు, వెనకా ముందు ఆలోచన లేకుండా, ప్రేమించి తెచ్చి చేసుకుంటే, తప్పు వారిది, వారు శిక్ష అబుభవిస్తూ, మనకూ శిక్ష వేస్తారు సంస్కార పెంపకము కు.

ఇక్కడ మన పిల్లలు, ప్రేమించి చేసుకున్నారు అనుకుందాము.

మన పిల్లవాడు, మోహములో పడి, ఆ పిల్ల గుణ గణాలను చూడకుండా చేసుకున్నాడు లేదా మన పిల్లవాడు తప్పుడు కపటం వాడు అయి ఉంటాడు. అంటే, మన పెంపక సంస్కార లోపం, ఏది పాలో ఏది నీళ్ళో తెలియని మూర్ఖపు స్తితిలో ఉంది, మన పిల్లలు మరియు మన పెంపకం కాదా? ఈ నిజం ఎందుకు ఒప్పుకోలేము? మనము ఒప్పుకోనంత మాత్రాన, మనకు శిక్ష తప్పుతుందా?

కాబట్టి, మనల్ని బయటనే ఆపి, కోడలు/ అల్లుడు తలుపు వేసినప్పుడు, మన అబ్బాయి/ అమ్మాయి ఇది తప్పు అన్యాయం అని చెప్పకుండా, నోరుమూసుకుని కూర్చుని ఉంటే, మనము తప్పు పట్టాల్సింది, మన బిడ్డనే కదా?

ఇక్కడ చవట, తప్పుడు వాడు, ఎవరు? మన బిడ్డ. కాబట్టి, మన కొడుకునే తిట్టుకోవాలి తప్పుపట్టాలి, వారినే సరిచేసుకోవాలి. అంతే కానీ, ఇతరుల పిల్లల గురించి, అంటే అల్లుడు/ కోడలు గురించి, మనకు అనవసరం - వారు తప్పు గానీ, ఒప్పు గానీ.

అంటే, ఈ కధలో, మన పిల్లలదే తప్పు, చేతగాని తెలివి తక్కువ దద్దమ్మలు అవసర అవకాశవాదులు, మన పిల్లలు. మంచి చెడు విచారించకుండా, పెళ్ళి చేసుకుని, ఇతరులు మనల్ని మోసము చేసారు, మేము అమాయకులము, నోట్లో వేలు పెట్టినా కొరకలేము, అన్న కపట మోసపు మాటలు వద్దు. ఉపయోగము కూడా లేదు, ఇంకా పరిస్తితి విషమిస్తుంది, ఎందుకంటే మోకాలికి మందు రాస్తున్నాము, తలనొప్పికి.

ఇప్పుడు చెప్పండి, అసలు విషయము. మనము తెదేపా అయ్యి ఉంటే, లేదా సినిమా అభిమానిమి అయ్యి ఉంటే, మన పిల్లవాడు మన అన్న ఎన్టీఆర్‌. లక్ష్మి బయటవారు మనకు.

ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి, సీయెం గా గెలిచిన, అనుభవము ఉన్న, కాషాయము కట్టిన, మన 60 ఏళ్ళ రామన్న, ముదుసలి వయస్సులో నా పిల్లలు నాకు అండగా లేరు, నన్ను చూసే వారు పట్టించుకునే వారు లేరు, ఈమె నన్ను సక్రమముగా చూస్తున్నది, ఈమె పద్దతి నాకు నచ్చింది అని, ఈమె నే నాకు అండ అని, ఆయన ఏరి కోరి చేసుకున్నాడు.

ఎందుకు చేసుకున్నారు అని, బయటవారిగా మనము ఆయనను ప్రశ్నించలేము, అది వారిద్దరి ఇష్టం. మంచి చెడు ఫలితము, వారే పడతారు. వారి పార్టీని వారు నాశనము చేసుకుంటారో బాగుచేసుకుంటారో, ఎవరి చేతిలో ఎవరు ఉంటారో, వారి ఇష్టం.

ఎందుకంటే, ఎంతో మంది చాటు వ్యవహారాలు నడుపుతున్నా దొంగలుగా, రామన్న నిజాయితీగా అందరిముందు, అవతల విడాకులు ఇప్పించి మరీ, లీగల్ గా పెళ్ళి చేసుకున్నారు. ధర్మం, అధర్మం పక్కన పెడితే, చట్టాన్ని గౌరవించారు.

తండ్రి స్వయం సంపాదన ఆస్తులు పార్టీ, అన్నిటి మీద తండ్రికే సర్వ హక్కులు. ఆయన ఎవరికి ఇచ్చుకుంటారో, అనాధాశ్రమానికి రాస్తారో వారి ఇష్టం, ఉత్తమ కోర్ట్ కూడా చెప్పలేదు, మీ స్వార్జితం ను పిల్లలకు అల్లునికి ఇవ్వాలని.

పార్టీ పరముగా ఎదుర్కోవాలి అంటే, పార్టీ సర్వ సభ్య సమావేశము నిర్వహించి, నోటీసులు ఇచ్చి, అందులో తండ్రిని ఎండగట్టి, ఇతర ఎమ్మెల్యే ఎంపీలను నమ్మించి, కొడుకులు/ అల్లుడు స్వాధీనము చేసుకోవచ్చు. అప్పుడు అది వెన్నుపోటు కాదు. పార్టీలో బలాబలాలు.

కానీ వారు అలా ధైర్యముగా నేరుగా చేయలేదు, చేయలేరు దురాశతో. అంతా దొంగ చాటుగా హోటెల్ లో చేసారు, పత్రికలలో అబద్దాలు పంచారు. మొత్తము గందరగోళం చేసి, భూతద్దములో అన్ని బ్రమలు భయం మోహం కల్పించారు. అందరినీ గుప్పెటలో పెట్టుకున్నారు. వ్యవస్థలను కాలరాశారు.

దీనికి సహకరించిన సమర్ధించిన, అందరికీ అంటే ప్రజలమైన మనకు కూడా శిక్షలు తప్పవు. మొన్న కరోనా తట్టుకునే ఆసుపత్రి ఒక్కటి ఆంధ్రాలో లేక ఎంతో మందిమి పోయాము.

తండ్రి తప్పులను ప్రశ్నించకుండా, అసలు తండ్రికే అండగా లేకుండా, తప్పుడు వారి మాటలను నమ్మి, అధికారం చేజారి పోతుందన్న దురాశతో, సొంత తండ్రికే, 6 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం కే, మానసిక వ్యధతో చావుకు కారణం అయ్యారు, క్షమించరాని ద్రోహం చేసారు, ఈ ఇంటి సొంత ఘనులు. ఒక్కరు కూడా, తండ్రితో లేరు, పచ్చి అవకాశవాదులు.

సందట్లో సడేమియా అని, నక్కలా కాసుకుని కూర్చున్న, నాయకత్వ లక్షణాలు లేని అల్లుడు, అధికారం చేజిక్కించుకున్నారు. తెరవెనుక ఆ 4 గురు మూర్ఖులు తమ స్వార్ధం కోసం, అల్లుని ఎక్కించారు, అతని కారక్టరుని కాలరాసి లేదా ప్రోత్సహించి, అని అంటున్నారు. ఇక్కడ అందరూ తప్పుడు వారే.

రామన్న గతము లో అధికారం లో చేసిన అన్ని తప్పులుకు అంటే, వంగవీటి హత్యాకాండ లాంటివి, అల్లుని చే వాటికి శిక్ష ఇప్పించి, వీరు 4 చాటుగా దాంకున్నారు, నీతిగల వారిగా నటిస్తూ, అని అంటున్నారు.

మంచి నాయకుడు ఎప్పుడు నేరుగా నిలబడి పోరాడి, గెలుస్తాడు, చాటుగా వెన్నుపోటు తో గెలవడు, ఆత్మను చంపుకుని అవకాశాన్ని వాడుకోడు, కొడుకును కూడా, పక్క దోవలో నాయకుని చేయరు.

ప్రజలు గెలిపించినా, తప్పు ధర్మం అయిపోదు. లంక ప్రజలే గెలిపించారు వారి నాయకులను, ఆ తర్వాత వారే, ఆహారం దొరక్క రొట్టెలు 1000 కి కొన్నారు కదా?

కాబట్టి, వారు కానీ మనము కానీ, తప్పు ఒప్పు అంటే, ముందు మన రామన్న ను అనాలే కానీ, బయట ఆమెను అనే హక్కు లేదు. ఓకవేళ లక్షీ గారిని, తప్పుడు వారు అని మూర్ఖముగా అవసర అవకాశవాదముతో మనము అంటే, మన రామన్న అంత చేతగాని, తెలివి తక్కువ మనిషి, చెడుని ఎన్నుకున్న మూర్ఖం అని మనము ఇండైరెక్ట్ గా మన రామన్ననే, తిట్టినట్లు. దయచేసి అలా మన సొంత రామన్నను తిట్టవద్దు, అప్పుడు మనము అభిమానులం ఎలా అవుతాము?

లక్ష్మి గారు ఎంత ద్రోహము చేసారో, చేయబోతారో, ఎవరికీ తెలీదు. కానీ సొంత పిల్లలు అలాగే అల్లుడు, నాటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ద్రోహము చేసారో, ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, తెలుగు ప్రజలు అందరూ చూసారు. అవకాస అవసరవాదులు 75 మంది, ఇది తప్పు అని ఒప్పుకోకపోయినా, ధర్మం కాలం విడువదు, ఫలితాలు వెంటపడి మరీ, వారి ఇళ్ళలో వారికి వెన్నుపోటు రుచి చూపించింది, చూపిస్తుంది.

వదినను అంటే, మన అన్నను తిట్టినట్లే. కాబట్టి, తప్పో ఒప్పో ఆయన ఒక పని చేసారు, ఫలితము అనుభవించారు. కాబట్టి, వారిద్దరినీ ఇంక ఏమీ అనకుండా, ఉండడం మంచిది. వదినను తిట్టెవారు, రామన్నకు ద్రోహులు మాత్రమే.

కోడలు, అల్లుడుని మాత్రమే తిట్టేవారు, తమ సొంత కూతురు/ కొడుకుకు కూడా ద్రోహులే. ముందు మన ఇంటి పిల్లలను వారి తప్పులను సరి చేసుకుందాం, లేదంటే సిగ్గుతో తలవంచుకుందాం, మన పాప శాతం తగ్గించుకుందాము.

మీ ఆలోచనలు కూడా నిష్పక్షపాతముగా పంచుకోండి, మీకు తగిన రాత మరియు అరిషడ్వర్గాల అనుభవం ఉంటెనే, తెలుగు లో ఉదాహరణ సాక్ష్యము తో. వితండవాదం వద్దు.

Any questioners insults doubters of Lakshmi Parvati are NTR traitors or fans well-wishers opportunists  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,776; 104 తత్వాలు (Tatvaalu) and views 225,934
Dt : 02-Oct-2022, Upd Dt : 02-Oct-2022, Category : Politics
Views : 412 ( + More Social Media views ), Id : 1551 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : questioners , insults , doubters , lakshmi , parvati , ntr , traitors , fans , well-wishers , opportunists
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content