అన్నమయ్య కీర్తనములు - శ్రీ మత్వదీయ, ఒకపరి కొకపరి, పొడగంటిమయ్యా, బ్రహ్మ కడిగిన - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,550; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అన్నమయ్య గేయాలు గురించి తెలియని వారు ఉండరు. మీరు కూడా, ఈ సేకరించిన పాటలు పాడి, అందరికీ పంపుతారు కదూ. పాడటం, మనలో ఆరోగ్యం ను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, కొన్ని రకాల వ్యాధులను అరికడుతుంది.

మన పాట వీడియోతో ఉన్నప్పుడు జాగ్రత్తలు సుమా, గొంతులో మనిషిలో హావభావాలు లో, భక్తి మర్యాద గౌరవం ఉండాలి. ఇది ఒక భక్తుడు తన్మయత్వములో, ఆ దేవ దేవుని కి పాడిన పాట అని, మరువద్దు. దేవుని గురించి శ్రుంగారము చెప్పారు అని, మనము కూడా, అలాగే పాడకూడదు, భక్తి మర్యాద గౌరవం సంస్కారం, ఇవి తగ్గకూడదు.

సినిమాలలో సంస్కారం లేని వారు అలా తప్పుగా పాడారు చేసారు అన్నది, మనకు ఉదాహరణ కాకూడదు. 100 కి 75 మంది, కోక్, పెప్సి, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బయట తిండి, తిన్నారు అని, అది మంచిది అవుతుందా? ఆరోగ్యానికి ప్రామాణికమా? వారు మరియు వారి పిల్లలు, ఆ తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు రోగాలు పొందారో, మనకు తెలీదు కదా.

మనము గాయకులము కాకపోయినా, మన రాగములో పదాలలో కొన్ని తప్పులు ఉండవచ్చు, మనది ప్రయత్నం కిందకు వస్తుంది. ఎవరైనా ఆక్షేపిస్తే, తప్పక క్షమాపణ చెప్పాలి. ఆ పదాన్ని సరి చేసుకోవాలి. రాగం అందరికీ రాకపోవచ్చు. పిల్లలు తప్పులు తో రాగం తప్పి పాటపాడినా, తల్లి తండ్రి క్షమిస్తారు, నవ్వుకుంటారు. కానీ ఆ పాట ప్రయత్నములో, భక్తి గౌరవం మర్యాద ఉండాలి సుమా.

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (9 మే 1408 - 23 ఫిబ్రవరి 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారులు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది.

దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ, 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే, వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.

అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసారు.

1) అన్నమయ్య స్తుతి-

శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య
పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు
త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం
శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే.....||

అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య ||

అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు- లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అందమైన రామానుజ ఆచార్యమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె అందరిలో తాళ్ళపాక అన్నమయ్య |

2) ఒకపరి కొకపరి కొయ్యారమై..
మొకమున కళలెల్ల మొలచినట్లుం..డె..॥

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్త కొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం!

జగదేకపతిమేన చల్లిన కర్పూ..రధూళి
జిగికొని నలువంక చిందగా..ను..
మొగి చంద్రముఖి...ఈ ఈ , నురమున నిలిపెగాన 2
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూర ధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట.

పొరిమెరుగు చెక్కుల, పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగా.ను.
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి, సామజసిరి, తొలికినట్లుండె॥

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట.

మెరయ శ్రీవేంకటేశుమేన..,2 సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి...., అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో (అలర్ మేల్ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట!

3) పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయగ వైయ కోనేటి రాయడా (పొడగంటి)

చరణం 1 కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా
నేరిచ్చి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి తప్పి తీర్చు కాలమేగమా మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడ (పొడగంటి)

చరణం 2 భావింప కైవసమైన్ పారిజాతమా మమ్ము
చేవదేర గాచినట్లి చింతామణి
కామించి కోరికళిచ్చే కామదేనువ మమ్ము
తావై రక్షించేటి ధరణిదరా (పొడగంటి)

చరణం 3 చెడనీక బ్రతికించే చిత్త మంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషదమా
పడిబాయక తిరిగే ప్రాణబందుడా మమ్ము
గటియించినట్టి శ్రీ వేంకటనాదుడా (పొడగంటి)

4) బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము |

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము |
ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
వర మొసగెడి నీ పాదము |
తిరు వేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

annamayya kirtanalu srimatvadiya okapari kokapari podagantimayya brahma kadigina  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,550; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972
Dt : 22-Jul-2022, Upd Dt : 22-Jul-2022, Category : Songs
Views : 727 ( + More Social Media views ), Id : 1470 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : annamayya , kirtanalu , srimatvadiya , okapari , kokapari , podagantimayya , brahma , kadigina
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content