చచ్చినా తర్వాత, జనమెప్పు కోసమూ, పిండ బంతూ లేల కూతురా, కాటికాడ చెవిలో అరచిన కొడుకా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,254; 104 తత్వాలు (Tatvaalu) and views 224,655.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

After death, for the sake of public appreciation, why Pinda Bantu children (traditional things with meals to the public)? the son who screamed in ear at Katikada (Mahaprasthanam)?

పిత్రు ఋణం అనేది మన పూర్వీకులకు మన ఋణం/ బాకీ, మన తల్లి దండ్రులతో మొదలై, ప్రతి వైపు కొన్ని తరాల వెనుకకు వెళుతుంది - ఇది క్రుతజ్ఞతలు విశ్వసనీయతకు నిదర్శనం - బతికి ఉన్నప్పుడే మన మరియు మన పిల్లల పెంపక సంస్కారం ఎటూ కనపడుతుంది మనకు, మన మిత్రులకు మరియు బంధువులకు.

కపట, నటన, 2 నాల్కల ధోరణి లేని, ఆచరణ ఆధ్యాత్మిక దైవ భక్తులుగా మనము, మన ముదుసలి తల్లి దండ్రులకు ద్రోహం చెయ్యకూడదు, పెళ్ళైతే ముదుసలి అత్త మామలకు కూడా సుమీ.

సంస్కారము ఉన్నత విలువలు గల, గుణము తో పెళ్ళాడిన భాగస్వామి, వారి తల్లి దండ్రులకు మాత్రము సమాన గౌరవం, హోదా, వైద్యం, సౌకర్యాలు ఇవ్వదా, కడుపుకు అన్నము తింటుంటే, పిల్లలను ఉత్తములుగా తీర్చి దిద్దె ఇంగిత జ్ఞానం ఉంటే? అవి ఇవ్వనప్పుడు, ఇక భాగస్వామి, రేపు రోగం తో మంచము ఎక్కితే, నరకము ఇక్కడే కనపడుతుంది కదా?

గతము లో తప్పులు ద్రోహము నిర్లక్ష్యము చేసి ఉంటే, పశ్చాతాపం పడుతూ, కన్నీళ్ళతో ప్రాయశ్చిత్తము చేసుకుంటూ, బతికి ఉన్న, ఇంకొక ముదుసలి తల్లి దండ్రులకైనా సేవ చెయ్యాలి సుమా. మానవ/ నర సేవ మాధవ/ నారాయణ సేవ అని, పురాణాలు వేదాలు నొక్కి వక్కాణించాయి.

బతికి ఉన్నప్పుడే, దగ్గర పెట్టుకుని 60+ ఏళ్ళు దాటిన ముదుసలి లేదా రోగాల బారిన పడిన తల్లి దండ్రులు మరియు అత్త మామల ను, సొంత 6 ఏళ్ళ పిల్లలు గా, మంచి గా సమాన వైద్య మరియు ఇతర సౌకర్యాల తో, దగ్గర ఉంచుకుని చూడమని ప్రార్ధన తో, వారికి అంకితం ఈ పాట.

అనాధలుగా ఒంటరిగా దూరముగా ఉంచి, వారు పోయాక గంధపు చెక్కలతో కాల్చినా, లక్ష మందికి ఆర్భాట దిన భోజనాలు పెట్టినా, కాశీ ప్రయాగ లేదా ఇంక ఏ ఏట్లో కి పోయినా బతికున్నప్పుడు సొంత చేతి ముద్ద ప్రేమ గా నోట్లోకి పోనప్పుడు, అది తల్లి దండ్రుల/ అత్త మామల కు సంతోషము ఇవ్వదు.

అవసర అవకాశాలతో, నటనలు ఎటూ సమాజంలో రోజూ, ప్రతి వ్యక్తి తో చేస్తాం. కానీ సొంత సజీవ గురువులు తల్లి దండ్రుల అత్తమామల దగ్గర కూడా చేసి, పాపం మూటగట్టుకొంటే, నష్టం మనకే, శని రాహు ఇతర పాప గ్రహాల తో మరియు మన పాప ఖర్మతో. మన పిల్లలు, కోడళు, అల్లుడు మనకు తప్పక బుద్ది చెపుతారు, అంత కన్నా ఘోర అవమానాలతో.

అందుకే వేరే వారి మాటలు, ఫోటో లు, వీడియో లు ఫార్వార్డ్ చేయడం, 30 ఏళ్ల లోపు వారు చేస్తారు, సరైన పెంపక సంస్కారం అలాగే అనుభవం లేక, సొంత మాటల తో వాటి గొప్పతనము వివరించలేక.

కానీ 30 దాటిన తర్వాత, అనుభవం నీతి నిజాయితీ మనసు మానవత్వం ఉన్న వారు, ధైర్యంగా తమ మరియు పిల్లల గురించి మంచి, సొంత మాటలు, పాటలు, ఫోటోలు, వీడియో లు పెడతారు పంపుతారు.

మంచి పది మందితో పంచుకోవడానికి, మన నోరు చేతులు కదలి సహకరించాలని, పంచభూతాల శిక్షన తప్పించుకోవాలని, ఆ దేవుని ప్రార్దిస్తూ -

* ప్రేమతో పిలిచినా, పలకరించిన గానీ బ్రతికి ఉన్నప్పుడే కొడుకా,
కాటికాడ చెవిలో, ఎలుగెత్తి అరచినా, లాభమేమున్నది కొడుకా,
జన నటనా, వంశ అవలక్షణాల, ఓ కొడుకా

* బతికి ఉన్నప్పుడు, ప్రేమ చేతి వంటా, మింగ ముద్దా లేదు, కూతురా
చచ్చినా తర్వాత, జనమెప్పు కోసమూ, పిండ బంతూ లేల కూతురా
జన నటనా, వంశ అవలక్షణాల, ఓ కూతురా

* సంపాదనతో మనసులేని బండలై, క్రుతజ్ఞతలేని కొయ్యలుగ పెంచాము, పిల్లలారా
మా అమ్మ అయ్యకు చేసినా ఘనశాస్తి, మీరు మాకూ చేస్తున్నరా, ఓ పిల్లలా
జన నటనా, వంశ అవలక్షణాల, ఓ పిల్లలారా

* అనాధగా ఓంటరైన, బరువు బాధని, దూరం ఉంచేరు, పిల్లలా
పైకి పోయాక, బొట్టు పూలతో, చిత్ర పటం గోడ కా, ఓ పిల్లలా,
జన నటనా, వంశ అవలక్షణాల, ఓ పిల్లలా

* అమ్మ అయ్యా అంటే, జాలి ప్రేమ లేదు, అసంస్కార పిల్లలారా
వారి చెమటా కష్ట, ఆస్తి పాస్తి, మూణ్ణాళ్ళ ముచ్చటే గాదా
జన నటనా, వంశ అవలక్షణాల, పిల్లలారా


మిగతా చరణాలు కాగితం పై మీరూ రాయగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,254; 104 తత్వాలు (Tatvaalu) and views 224,655
Dt : 10-Jan-2021, Upd Dt : 10-Jan-2021, Category : Songs
Views : 803 ( + More Social Media views ), Id : 916 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : after death , public , janam , meppu , pindam , son , daughter , mom , dad , parents , pitrurunam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content