ఆధ్యాత్మికత అంటే బ్రహ్మ పదార్ధం? భ్రమ అంటే ఏమిటి? మన సాధన ఆచరణ ఏది? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,352; 104 తత్వాలు (Tatvaalu) and views 225,145.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*శుభోదయం, శుభదినం, శుభసంకల్పం, గురువులందరికీ, శిరస్సు వంచి నమస్కారములు.*

మనము ఇలా 3 ఏళ్ళు పైగా, దేశ విదేశాల నుంచి, 2 నిమిషాల సత్సంగము లో కలసి ఉన్నాము అంటే, ప్రతి సందేశము లో కూడా, మా మీ జీవిత సమస్యలకు ఏదో సమాధానం ఖచ్చితముగా ఉంటుంది. జాగ్రత్త గా చదివి అర్ధం చేసుకోవాలి. మన సాధన చెప్పకుండా, అర్హత తెలియపరచకుండా, శివయ్య క్రిష్ణయ్య రామయ్య గురించి 100 వ్యాసాలు పేజీలు రాసినా ఉపయోగం ఏమిటి? వారు కూడా, మానవులు గా వచ్చి, సాధన ఆచరణలో చూపించారు కదా?

ఆధ్యాత్మికత అంటే అదేదో బ్రహ్మ పదార్ధం కాదు. 75 శాతం బ్రమలలో ఉంటారు, అరిషడ్వర్గాలకు బానిసలౌతారు. ముందు వాస్తవాన్ని, వారు అర్ధము చేసుకుని గుర్తించాలి. అరిషడ్వర్గాల ను జయించాలి. ఆ తర్వాత మెట్టు ఆధ్యాత్మికత. అంటే, బ్రమకు ఆధ్యాత్మికతకు మధ్య, వాస్తవం అన్న గట్టు ఉంది.

భ్రమ అంటే ఏమిటి, ఇవన్నీ నావి, వీరంతా నావారు, నన్ను రక్షిస్తారు, వారు పరాయి వారు. అది నిజమా? వచ్చింది ఒంటరిగా ఉత్త చెతులతో? పోయేది ఒంటరిగా ఉత్త చేతులతో, ఎవరికి రక్షణ ఉంది? మరి, అవి అబద్దాలు కదా? ఇది ఎంత మంది ఒప్పుకుంటారు, ఆచరణలో చూపిస్తారు? ఒప్పుకుంటే, మోసాలు కుట్రలు తగవులు అలజడి ఉంటాయా?

ఈ వరుసలో సాధన, ఆచరణ ఉన్నదా మనలో? మనసును అదుపు చేయగలమా? ఏది సాక్ష్యం? మనము ఎవరో, మన గుణాలు, మన సాధనా శక్తి, ఆచరణ భక్తి, మనము తెలుసుకోకుండా, ఇతరులకు ఎలా చెబుతాము మంచి చెడు?

Physical Health శారీరక ఆరోగ్యము
Body శరీరము
Mind మనసు
Illusion భ్రమలు
Reality వాస్తవం
Mental Health మానసిక బలం/ ఆరోగ్యము
Spirit ఆత్మ

శివయ్య ఆజ్ఞ లేనిదే, మీరు మేము కలవము, ఇలా పలకరించుకోము, మరువద్దు, ప్రతి రోజూ పంచభూతాల సందేశాన్ని, అరిషడ్వర్గాల బానిసత్వ నిర్మూలన సాధనను.

దయచేసి పెద్ద మనసుతో, మీ సొంత అనుభవాలను కూడా, మనసు విప్పి, మాతృభాష లో, మాలాంటి అజ్ఞాన శిష్యులతో పంచుకుంటే, మీకూ పుణ్యం వస్తుంది. ఇక్కడ తెలుగు రాయడం రాకపోయినా, కాగితం పై రాసి ఫోటో పెట్టవచ్చు. అది అందరికీ ఉపయోగం.

అదే దేవుని పూజ, మానవ సేవయే మాధవసేవ, అదే త్రికరణ శుద్ధిగా చేతలలో. మాలాంటి శిష్యులనే మెప్పించలేకపోతే, ఆ దేవ దేవుని ఎలా మిప్పిస్తావు?

చిన్న మంచిపని చేయడం మొదలు పెడితేనే, మన నిజ సాధన మొదలు అవుతుంది, మనసు వికసిస్తుంది, జగమంతా మనది అనిపిస్తుంది. అందరూ మన ఆత్మ బంధువులే. పుట్టే దగ్గర, కాటి దగ్గర అందరమూ ఒకటే, బేధ భావం ఎకాడా లేదు, స్మశాన శివయ్య ముందు దాకా. కానీ మన కల్మష మనసులో బ్రమలు అలా ఆలోచనలు కలిగిస్తాయి.

చూడండి 1 తో మొదలు పెట్టి, 14 వందల (1400) కధనాలు అయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్ లో, కొన్ని కధనాలకు ఒక్కోదానికి 150-200 మంది దాకా మెచ్చుకుంటున్నారు, తిట్టేవారు ఎటూ తిడుతూనే ఉంటారు, తమ తామస రాజస గుణాల సంఘర్షణ తో. వారి మనసు కదిలితేనే కదా, తిట్ట గలిగింది, అంటే మనకు పుణ్యం ఎక్కువ వస్తున్నట్లే. సాత్వికులు ఎటూ స్పందిస్తారు, మంచికి మంచిగా.

అలాగే మన స్టేటస్ లో సమాచారం రోజు చూసి క్రమం తప్పకుండా, తమ అభిప్రాయాలు చెపుతున్నారు. ఎందుకంటే, వారు మోహం లో లేరు అని, నిరూపణే. మొహములో ఉంటే, అక్కడు వచ్చి చూసే తీరిక మనసే రాదు సుమా. రోజూ 10 నిమిషాల దైవ ధ్యానం, మనందరి కోసం, ఇక్కడ కూడా.

మనము చెప్పినవి అన్ని అంగీకరించాలని లేదు కదా, కానీ తమ మనస్తత్వాన్ని దాచడం తప్పు. కనీసం రాక్షసులు గా నిజాలు చెపుదాము, దుర్యోధనుడు రావణుడు అరిషడ్వర్గాల బానిసలకు కూడా, 2 నాల్కలు 2 మాటలు చాటుదనము అనేవి లేవు. మరి మనము ఎందుకు, అంతకన్నా నీచముగా కపటత్వము తో నటించాలి.

ఇన్ని ఏళ్ళు గా, ఏమీ సొంత స్వార్ధం కు అడగని శిష్యులకే, మంచి మాట చెప్పలేని వారు, సొంత పిల్లలకూ చెప్పలేరని కూడా, దైవ భావన, అదే వారి భవిష్యత్ నిరూపణ ఫలితము.

మాకు మేము తిన్నాము నిద్రపోయాము అంటే, అది దైవ సమతా భావన కాదు. అప్పుడు రాముడు, క్రిష్ణుడు, దత్తాత్రేయుడు, ఆదిశంకరులు, బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన లాంటి వారు మన కోసం రావాల్సిన పనిలేదు కదా? వారు వారి పని చూసుకోవచ్చు.

తమ ఇంట్లో వారికి మంచిగా గైడెన్స్ దోవ చెప్పేవారు చూపేవారు, బయట వారికి కూడా అలాగే చేస్తారు, ఎప్పుడూ దాచరు, చాటున ఉండరు, నటించరు, 2 మాటలు వేషాలు ఉండవు. నిజమైన దైవ భక్తి ఉండి, అందరూ దైవ బిడ్డ లు అని నమ్మి, వారు ఆచరిస్తే. వాట్సాప్ లో దాంక్కోవద్దు రీడ్ రిసీప్ట్ తీసేసి, ప్రొఫైల్ బొమ్మ లేకుండా, మన కుటుంబానికే అవమానం. కపట దొంగ బుద్ది, నిర్లక్ష్యం, బద్దకం, క్లోజుడ్ మైండ్ అని మనంతట మనమెందుకు బయటపడాలి.

అలాగే, బయట మంచి చెప్పేవారు, ఇంట్లో కూడా తప్పక చెప్పాలి, ఆచరణలో చూపాలి. వారి పిల్లల నడవడికలో స్పష్టముగా అది ఎటూ కనపడుతుంది. ఈ రెండూ జరగడం లేదంటే, చిత్తశుద్ధి లేదు అనే కదా?

గురువు లలో ఎవరైనా, కాలంతో పాటు మారి, శని రాహు కేతు గ్రహాల మార్పుతో మనసు వశము తప్పి, ఆలోచనలు గతి తప్పి, ముదుసలి తల్లి దండ్రులు సేవ, అరిషడ్వర్గాలు సాధన, సనాతన ధర్మం ఆచరణ, సంస్కార పెంపకం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, మాతృభూమి భాష  మూర్తి గురించి, మంచి చదవం వినం ఆచరించం ఆదరించం, అది మా దుర్యోధన రావణ వంశ అరిషడ్వర్గాల బానిసత్వ లక్షణం, మా పిల్లలు స్నేహితులు బంధువులు కూడా అంతే, అని ధైర్యంగా చెబితే, ఇక మీకు పంపము వృధా గా. ఇంకొకరి కి పంపుతాము. పంపింది చదవకపోయినా, జవాబు లేకపోయినా పాపమే.

మీరంతా బాగుండాలి, మీ పిల్లలకు మరియు మాకు అండగా ఉండాలి. అందుకనే, వద్దు అనవసరం అనుకుంటూ కూడా, దైవం మాటలు పంపకుండా ఉండలేక పోతున్నాము. మన్నించాలి. ఎందుకంటే, మీతో లోకానికి మంచి జరగాలి అని ఆశిస్తున్నాము కాబట్టి.

ఒక్కసారి, పాత సినిమా గాలి మేడలు సినిమా చూడండి - తల్లి దండ్రుల పిల్ల పెంపకాలు బంధాలు అవసరాలు అవకాశాలు అబద్దాలు మోసాలు, భవిష్యత అర్ధం అవుతుంది. మన పుణ్యం మన పాపం, మన వెంట పడుతుంది, కనుమూసే లోపు.

కాలానికి ధనము నిలువదు, గుణము మాత్రమే నిలుస్తుంది. అదే మనశ్శాంతి, మోక్షాన్ని ఇస్తుంది, దైవాన్ని చూపి.

adhyatmikata ante brahma padardham? Bhrama ante emiti? Mana sadhana acharaṇa edi?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,352; 104 తత్వాలు (Tatvaalu) and views 225,145
Dt : 18-May-2022, Upd Dt : 18-May-2022, Category : General
Views : 678 ( + More Social Media views ), Id : 1398 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : adhyatmikata , spiritual , brahma , illusion , bhrama , practice , sadhana , acharana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content