APLatestNews.com top Banner
బయో(భయో)పిక్, ఏమిటో ఈ మాయ - నిజ కల్పిత ఆముదం - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నాగయ్య, సోమయ్య ను అడిగాడు తెలుగు బయోపిక్ లు వరుసగా వస్తున్నాయి, వెళుతున్నావా చూడటానికి అని. సోమయ్య అన్నాడు, ఏముంది అందులో అసలు విషయం తప్ప , అన్ని కల్పితాలే గదా అన్నాడు.

నిజం చెపితే అభిమానులు ఊరుకోరు హీరో పరువు తీసారని, అబద్దం చెప్పకపోతే నిర్మాత కు నష్టం జనం రాకపోతే. భయోపిక్ అంటేనే, ముందు నుయ్యి వెనక గొయ్యి. ప్రతి ఒక్కరి జీవితములో ఎదో ఒక విషాద సంఘటనే చివరకి. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, చివరకు విషాదము, ఆవేదన తప్ప.

అన్న గారికి జీవితం చివరలో జరిగిన సంఘటనలు, అవమానము ప్రతి ఒక్కరికి బాధ, ఆవేదన కలిగిస్తాయి, అవి చూపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. రామన్న లేదా రాజన్న, చరమాంకములో మనలను ఎలా వీడి స్వర్గానికి తరలిపోయారో, మరలా చూసి నిజమైన అభిమాని తట్టుకో గలడా. కేవలం మేము మెచ్చిన, గొప్ప విషయాల, అభూత కల్పన అంటే సరిపోతుంది, టాగ్ లేన్ లో, ఎవరి బయోపిక్ అయినా. అన్న, రాజన్న, లక్ష్మీ స్, మహనటి లేదా ఎవరి గొప్ప కధైనా అంతే. మా ఆలోచన ను, మా వాళ్ళ గొప్పను, మాకు నచ్చినట్లు తీస్తే, మీ డబ్బు సమయం ఖర్చు పెట్టి , మీ కళ్ళ తో చూడండి, మా వ్యాపార లాభం కోసం అని చెప్పడమే.

టిక్కెట్లు అందటం లేదంటా, అన్నాడు నాగయ్య. సోమయ్య, అదే నాకూ అర్థం కావడం లేదు, వాళ్ళ కధ లేదా ఏ కొత్త సినిమా అయినా చూడటానికి 500 ఖర్చు(ఆముదం) పెట్టి, బ్లాకు లో మనం ఎందుకు చూడాలి, అధిక ఖర్చు తో వెంటనే వెర్రి నాగన్న లా. 3 వారాల తర్వాత మామూలు రేటుకు చూడొచ్చు. సినిమా లో కధేమి మారదు గదా లేటుగా చూసినా, వీలైతే ఇంకొన్ని బిట్లు కలుపుతారు. ఇంకో నెల తర్వాత ఎటూ టీవీల్లో వస్తుంది.

ఇంతకీ మహనటి చూసావా, ఏమి అర్థం అయింది అని అడిగాడు నాగయ్య. అబ్బో, ఆమె వేసిన పాత్రలు, హీరో లతో పాటలు బాగా నచ్చినాయి అన్నాడు సోమయ్య. మరి నీకు, అన్నాడు.

నాగయ్య అన్నాడు ఇలా , తల్లి దండ్రులు వద్దు అనే కొద్దీ, ఇల్లు వదలి , భార్యా పిల్లలు ఇంట్లోనే ఉన్న రెండవ పెళ్ళి వాడిని చేసుకొని , రంగు ల ప్రపంచంలో ఏమి చెస్తున్నానో తెలీక, చితికిపోయిన వ్యక్తి కనపడింది. సినిమా గొప్పతనమే అది, రంగులలో చూపించి అసలు విషయాన్ని మరుగు పరచడమే. అది చూసైనా జనం మారతారేమో, వాస్తవ పరిస్తితులు తెలుసుకొని, పెద్దల మాట విని, మోహం లో పడకుండా.
 
Dt : 30-Dec-2018, Upd Dt : 12-Apr-2019 , Category : Movie
Views : 705 ( + More Social Media views ) ( id : 6 )
Tags : biopic , telugu , ntr , mahanati , ysr , lakshmis ntr

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content