నెలా పది రోజుల కు ఠంచను గా, తలపని తప్పదు. ఇతరులకు చెప్పినప్పుడు, మనం కూడా చేయాలి కదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,283; 104 తత్వాలు (Tatvaalu) and views 224,661.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా కష్ట సమయంలో, మంగలి అన్న (అక్క) దగ్గరకు వెళడం కష్టం. ఇంకో నెల దాకా లేదా ఆ పైన కూడా, బయటకు కష్టం. ఒకవేళ వెళ్ళినా, ఆ కుర్చీలు కత్తులు వాడితే, అందరికీ వాడినవి ఏమౌతుందో అని భయం. వారు ఎంత శుభ్రం చేసినా, ఇంకొంత కాలం ఆ భయము ఉంటుంది.

అందరికీ మనం చెపుతూ ఉంటాం, ఎక్కువ జుట్టు అరిష్టం, తక్కువగా ఉండాలని, ఆరోగ్యానికి మంచిది అని. అలాగే మిలటరీ కట్ ఉత్తమం అని. శ్రమ, సమయం, నూనె, షాంపూ, రుద్దడము, తుడవడం, ఆరడం అంతా మిగులు.

ఈ విషయంలో బట్టి నెత్తి వారు, అదృష్ట వంతులు. వారు రోజూ తల స్నానం చేయవచ్చు. ఏ విధమైన ఇబ్బందులు ఉండవు.

మరి ఇప్పుడు కరోనా వలన, మనకూ ఆ ఇబ్బందులు వచ్చాయి. నెలా పది రోజుల కు ఠంచను గా, తలపని తప్పదు. ఇతరులకు చెప్పినప్పుడు, మనం కూడా చేయాలి కదా, వీలుగా ఉంటే.

డిస్కౌంట్ లో చిన్న ఫిలిప్స్ నోరెల్కో మెషిన్ వస్తే, ఓ అరగంట కష్టాలు పడితే, దేవాలయం సినిమాలో, పంతులు గారు గా, శోభన్ బాబు జట్టు అంత చిన్న గా వచ్చింది. అంటే, ఇంచె ఉంటుంది ఏమో. గుర్తు పట్టరు ఏమో అని ముందే చెప్తున్నా.

సింక్ పైన, నేల మీద చుట్టు పేపర్లు పరిస్తే, ఎక్కువ ఊడవడము తుడవకుండా లేకుండా, తేలికగా శుభ్రము చేయవచ్చు.

ఇంకో రెండు నెలలు దాకా ఇబ్బంది ఉండదు. దూరం నుంచే తిరుపతి దేవుని మొక్కు తీర్చినట్టే. మీరూ సొంత ప్రయత్నం మంచిది ఏమో అలోచన చేయండి, ఈ కష్ట కాలంలో, ఆరోగ్యము ముఖ్యము కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,283; 104 తత్వాలు (Tatvaalu) and views 224,661
Dt : 04-Apr-2020, Upd Dt : 04-Apr-2020, Category : General
Views : 878 ( + More Social Media views ), Id : 469 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hair cut , milatary cut , philips norelco
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content