APLatestNews.com top Banner
         
సత్త్వ, రజో, తామస గుణములు అనగా నేమి? అందరిలో అవి ఉంటాయా? - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణములు ఉంటాయి. సత్త్వగుణము, రజోగుణము, తామస గుణము. మనలో ప్రతి రోజూ, ప్రతి క్షణము ఇవి పోటీ పడుతుంటాయి. ఎక్కువ మంది, సత్వ గుణమును వదలి, విషయ వాసనలో మునిగి తేలుతూ, మిగతా రెంటి వైపు పరుగులు తీసి, చివరకు నానా కష్టాలు పడుతూ, జన్మ చక్రములో చిక్కుకుంటున్నారు.

వాటిలో మనము, సత్వ గుణమును పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ లక్షణాలతో మన చుట్టూ చాలా మంది ఉంటారు, మన గుణాన్ని బట్టి, వారి వారితో స్నేహము చేస్తుంటాము. మన గుణములు మారినపుడు, వారికి దూరము అవుతాము. ప్రతి రోజు పళ్ళు, ఒళ్ళు శుభ్రము చేసుకున్నట్లు గా, మన మన్సును సత్వ గుణములో ఉంచే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండాలి.

ఈ మూడు గుణముల కారణముగ, జీవుడు ఈ దేహమునందు బంధించబడుతున్నాడు, అని భగవద్గీత చెపుతున్నది.

1) సత్త్వగుణము నిర్మలమైనది - ఙ్ఞానమునందు ఆసక్తి కలిగి, చేసే ప్రతిపని ఈశ్వరార్పణ బుద్ధితో చేసే లక్షణం సత్త్వగుణము కలిగినవాని లక్షణం. ఉదాహరణ, రాముడు, క్రిష్ణుడు, మునులు, అరిషడ్వర్గాలను జయించిన మంచి వారు.

2) రజోగుణము - నేను చేస్తున్నాననే అహంకారము, కనపడే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, కలిగిన జీవుడు రజోగుణ లక్షణం కలవానిగా చెప్పబడుతున్నాడు. ఉదాహరణ, దుర్యోధనుడు, రావణాసురుడు.

రజోగుణ కారణముగ లోభత్వము , కార్యములందు ప్రవృత్తి, ( కామ్య , నిషిద్ధ ) కర్మములను ప్రారంభించుట , మనశ్శాంతి లేకుండుట , ( లేక ఇంద్రియనిగ్రహము లేకుండుట ) ఆశ అను నివి పుట్టుచుండును

3) తామస గుణము - మఱపు, నిద్ర, అవివేకము, సోమరితనము తామస గుణము కలవాని లక్షణం. ఉదాహరణ, కుంభకర్ణుడు, ఎటువంటి ఉపయోగము లేకుండా ఉండేవారు.

తమోగుణము అభివృద్ధి కారణముగ మనిషి యందు అవివేకము ( బుద్ధిమాంద్యము ) , సోమరితనము , అజాగ్రత , అజ్ఞానము , మూఢత్వము, ( లేక , విపరీత జ్ఞానము ) అను నవి కలుగుచున్నవి.

నిజానికి ఈ మూడు గుణములు, నిష్పత్తుల బేధముతో, ప్రతివారిలోనూ ఉంటాయి. రావణుడు, స్వతహాగా బ్రహ్మణుడు ఉత్తముడు, పరమేశ్వరుని పొందిన వాడు, కాని మోహం లో చిక్కి, పతనము అయ్యాడు.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, సత్త్వగుణాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి తగిన ఆహారనియమాలు పాటిస్తూ, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ, సాధనలో ప్రగతి సాధించాలి.

సత్వగుణ ప్రధానులే మాత్రమే వేదాంతాన్ని, దాని సారాన్ని, సరిగ్గా విని అర్థం చేసుకోగలుగుతారు. సాధనలు చేయగలుగుతారు. పెద్దలను, గురువులను గౌరవించగలుగుతారు. అణకువతో, వినయంతో ఉండగలుగుతారు.

ఈ లక్షణాలన్నీ బ్రహ్మానుభూతి సాధనలో అవసరమే గనుక ,ఇట్టి విప్రలక్షణాలుండటం గొప్ప అదృష్టమని చెప్పారు. ఇట్టి లక్షణాలు గలవారు, శూద్ర కులంలో జన్మించినా, విప్రులే అవుతారు. ఈ లక్షణాలు లేనివారు, బ్రాహ్మణకులంలో జన్మించినా, వారు శూద్రులే అవుతారు.

మరణానంతరము , సత్త్వగుణము గలవారు ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు ( పాతాళాది ) అధోలోకములకు ( లేక , పశ్వాదిజన్మములకు ) వెళుచున్నారు.

ఎవరు నన్నే అచంచలమైన భక్తియోగముచేత సేవించుచున్నాడో, అతడు ఈ గుణములన్నిటిని దాటి, బ్రహ్మముగానగుటకు ( జీవన్ముక్తుడగుట కొఱకు ) సమర్థుడగుచున్నాడు, అని గీతాచార్యుడు చెప్పారు.

Dt : 12-Aug-2019, Upd Dt : 12-Aug-2019 , Category : Devotional, Views : 95 ( id : 34 )
Tags : satva , rajo , taamasa , gunamulu
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content