Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
సరిగ్గా 25 ఏళ్ళ క్రితం, 1995 సెప్టెంబర్ 1 న, ఉమ్మడి ఆంధ్రా ముఖ్యమంత్రిగా, నందమూరి వారి అల్లుడు గా, పార్టీ కి అధికారాని కి వారసత్వం గా, అందరూ గర్వించ తగ్గ ఉత్తమ రాజ బాటలో పార్టీ పగ్గాలు చేపట్టి న, ప్రియతమ నాయకులు, అనుభవజ్ఞులైన చంద్రన్న ప్రమాణస్వీకారం చేసారు.
నవతరానికి అభివృద్ధి అన్న మాటను పరిచయం చేసారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలిపారు. అదొక చరిత్ర, అని వారంటున్నారు, తెదేపా ఫేస్బుక్ పేజీ లో. అందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
ఇంకా వాస్తవానికి రావడం లేదనడానికి లేదా అన్నంలో ఓ గింజ ఉడికిందా అని చూడడానికి, చీరాల చుట్టుపక్కల మండలాల ప్రాంతం, ఉదాహరణకు తీసుకుందాం. ఎందుకంటే, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉండవచ్చు. హైదరాబాద్, అమరావతి కాకుండా, మిగతా వెనుక బడిన, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతంలో, అభివృద్ధి లిస్టు వేయండి.
మరి చీరాల మండల చుట్టుపక్కల గంటదూరంలో, ఈ క్రిందివి ఏవీ జరగలేదు కదా. ఒకవేళ జరిగి ఉంటే, ఫోటోలు పంపగలరు, ఎలుగెత్తి చాటగలరు. అంటే మన పాలనలో అభివృద్ధి లేదు చీరాల ప్రాంతంలో అని ఒప్పుకుందామా, చంద్రన్నా, లోకేషన్నా?
వస్త్ర సామ్రాజ్య చిన బొంబాయి, క్షీరపురి, చీరాల పేరాల పన్ను నిరాకరణ స్వాతంత్ర్య ఉద్యమ కీర్తి గాంచిన, చీరాల అంటే కారంచేడు, పర్చూరు, వేటపాలెం, ఇతర చుట్టుపక్కల మండలాలకు మూలం. ఏవీ ఈ క్రింది అభివృద్ధి పనులు?
1. చీరాల జిల్లా 2. చీరాల పార్లమెంటు స్ధానం 3. ఫిషింగ్ హార్బర్ 4. చేనేత పార్కు 5. స్మార్ట్ సిటీ 6. స్మార్ట్ బీచ్ 7. గంట దూరంలో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, గుంటూర్ స్ధాయిలో 8. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, నేటి కొత్త హంగులు తో కోర్సులు తో 9. వేటపాలెం జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి 10. ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర కొత్త పరిశ్రమ లు.
వీటిని ఎక్కడ ఉన్నాయో చూపించి, మా కళ్ళు తెరిపించగలరు.
జగనన్న అయినా సానుభూతి తో వీటిని పరిశీలించాలి అని, మనం అడగని మంత్రులు, పార్టీ పెద్దలు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. చూద్దాం, రాబోయే రోజుల్లో, మంచి మార్పులు ఉంటాయేమో.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,601; 104 తత్వాలు (Tatvaalu) and views 221,536
Dt : 01-Sep-2020, Upd Dt : 01-Sep-2020, Category : Politics
Views : 693
( + More Social Media views ), Id : 672
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
25 years ago ,
andhra cm ,
chandranna ,
state ,
district ,
chirala ,
development
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments