Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
దివ్యాంగులను చూసారా ఎప్పుడు అయినా? వారితో మాట్లాడారా? వారి కష్టాలు విన్నారా, కనులారా చూసారా? వారికి ఉన్న అమోఘమైన మానసిక బలము చూసారా?
చాలా మంది వారిని, దగ్గర నుండి చూడరు, పట్టించుకోరు. పట్టించుకుంటే, ఇక మనలో అరిషడ్ వర్గాలు ఉండవు, అవి చచ్చి పోతాయి. మొహము నుండి కళ్ళు తెరుచుకుంటాయి.
చేతులు, కాళ్ళు లేని మిలటరీ వీర యోధుల గాధలు టీవీల్లో చూస్తున్నాము. కళ్ళు లేని వారిని, మూగ వారిని కూడా చూసాం. మానసిక అభాగ్యుల ను సినిమాలో లేదా జీవితంలో చూసాము.
చూస్తాం వింటాం వదిలేస్తాం, మోహం లో మన మనసు లోకి ఎక్కుదు. ఆ మనకు ఆ పరిస్తితి రాదు అనుకుంటాము, దైవ మహిమ క్రుతజ్ఞత గుర్తు రాదు. అదే మనిషి మన ఇంట్లో ఉంటే , అదే గొప్పగా చూడగలమా చేయగలమా?
వారి కష్టాలు చూస్తున్నప్పుడు, అన్నీ ఉన్న మనం, దేవునికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి? మన కళ్ళు, కాళ్ళు, నోరు, చేతులు మరి మంచి కార్యాలకు వాడుతున్నామా?
మన నోరు ఎన్ని అబద్ధాలు చెప్పిందో , ఎంత మంది కన్నీళ్ళకు కారణమైందో? మన చేతులు తో కాళ్లు తో ఎన్ని పాపకార్యాలు చేశామో? కళ్ళు తో ఇక ఎన్ని పాపాలో, అనుకోవడం అనవసరం, అవి కామం టీవీ సినిమా ఫోన్ ఇంకా ఎన్నో.
మరి వాటితో , అవి ఇచ్చిన భగవంతుని అర్చిస్తూ ఉన్నామా కృతజ్ఞతతో బాధ్యత గా? తల్లి దండ్రులు నే మోసం చేసే మనము అగౌరవ పరిచి దూరముగా పెట్టే మనము, ఒక రాయి ని గౌరవిస్తామా?
ఆ కళ్ళు, గుడి లో దేవుని తదేకంగా చూస్తుందా? లేదు పక్కన చూపులే, అంతా అర్ధము లేని చూపులు, ఎటు వైపో ఇంకెటు వైపో, దేనికోసమో ఆత్రము వెతుకులాట. కాని దేవుని కోసము మాత్రము కాదు.
ఆ నోరు తో భగవన్నామం అరగంట అనగలమా? సారీ అది తప్ఫ ఏదైనా అంటాము, నోరు రాదు, నోరు పెగలదు. బయట విషయాలు అడుగు, గంటలు గంటలు చెపుతా.
ఆ చేతులు రోజూ దేవుని పూజకు? నాన్సెన్స్ నేను నమ్మను, దేవుడు లేదు దెయ్యము లేదు. చేతులు ఉంది, తినడానికి శుభ్రము చేసుకోవడానికి, ఇతరులను దండించడానికి మాత్రమే.
మరి ఆ కాళ్ళు , దేవుని ప్రదక్షిణ ల కు? నో , కుదరదు అంటే కుదరదు. వారెవరో అమెరికా లో పిచ్చి పట్టి 21 వారాలు 108 తిరిగి తే, అన్నీ ఉన్న గొప్ప వాడిని అయిన నేను, నా సొంత కాళ్ళ తో, ఒక వారమైనా రాయి చుట్టూ తిరుగుతానా? నెవర్ , నా కాళ్ళు నా ఇష్టం నేను చదువుకున్నా అంతా జ్ఞానము సంపద నాతో ఉంది. నేను తిరగను మా వాళ్ళు తిరగరు, మాకు కాళ్ళు నొప్పి.
మరి మనసు దేవుని కి అంకితమా, ధ్యానముతో స్తోత్రమా? నో , ఒప్పకోను, మనసులో ఖాళీ లేదు, కనీసము అరగంట కళ్ళు మూసుకుని కూర్చోను. సంపాదన, విషయ వాసనలు, కోపం, కామం, మోహం, మోసం, పగ, ప్రతీకారం, నిండిన నా మనసులో దేవుని కి స్ధానం లేదు, ఇవ్వను.
కావాలంటే కేవలం, పండక్కి మొక్కుబడిగా యాగం చేస్తా, లక్ష ఖర్చు తో భోజనం పెడతా, ఎన్ని మాలలైనా వేస్తా, ఇంకేదైనా చేస్తా, వీలయినంత నటిస్తా. కానీ నేను మారను నా కుటుంబం మారదు నా పిల్లలు మారరు.
దేవుని కి మా మనసు లో కానీ చేతలలో కానీ స్ధానం ఇవ్వము. కావాలంటే మాయా ప్రపంచం కోసం జనం కోసం నటిస్తాం ఆస్కార్ లెవల్లో, మా సినిమా అభిమాన నటులకన్నా కూడా.
చివరకు ఆ మాయలో చిక్కి, ఆ మాయచే తొక్కి, ఆ మాయా కాలగర్భములో కలసి పోతాం.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,163; 104 తత్వాలు (Tatvaalu) and views 225,822
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments