ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకి యోగా - Yoga for Health and Mental Peace - Health - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,790; 104 తత్వాలు (Tatvaalu) and views 224,915.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదు
There is nothing like yoga for Health and Mental peace (Peace of mind)

యోగం వందే విశ్వ మాతరం Yoagam vandea viswa maataram
International Yoga Day అంతార్జతీయ యోగా దినోత్సవం

యోగాసనాలు వేయడం వలన కలిగే లాభాలు అనంతం. ముఖ్యంగా మనోజ్ఞానశక్తి పొందుతుంది. అనేక మానసిక బలహీనతలు తగ్గుతాయి.

The benefits of doing yoga asanas are endless. Especially the psychic power is gained. Many mental disorders are reduced.

ఏకాగ్రత పెరుగుతుంది. క్రమబద్ధమైన ఆలోచనాసరళి ఏర్పడుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సృజనాత్మకత, విశ్లేషణ, ఆధ్యాత్మికత అలవడుతాయి. మన శరీరంలో వున్న సర్వరోగములు, రుగ్మతలు మటుమాయమవుతాయి. యోగా వలన రక్తపోటు తగ్గుతుంది. యోగా స్వయం నియంత్రత నాడీ వ్యవస్థలో సమతుల్యతను పాటింపజేస్తుంది. తలనొప్పి, జలుబు, అజీర్ణం మొదలైన వ్యాధులు దూరమవుతాయి.

Concentration increases. A systematic thinking pattern is formed. Increases immunity. Memory increases. Creativity, analysis and spirituality are practiced. All diseases and disorders in our body will disappear. Yoga lowers blood pressure. Yoga self-control maintains balance in the nervous system. Diseases like headache, cold, indigestion etc. will go away.

ఆందోళన, భయం, ఒత్తిడిల నుండి దూరమౌతారు. ఆత్మనిగ్రహశక్తి పెంపొందుతుంది. తమపై తమకు నమ్మకం ఏర్పడుతుంది. నేను ఏదైనా చేయగలను అనే ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. కోరికలపై, ఇంద్రియాలపై నిగ్రహశక్తి ఏర్పడుతుంది. శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. సృష్టి విచిత్రాలను గురించి తెలుసుకోగలుగుతారు. మన గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను యోగా ద్వారా తెలుసుకోవచ్చు.

Get away from anxiety, fear and stress. Self-control increases. They believe in themselves. Confidence that, I can do anything, builds. Restraint over desires and senses. The body relaxes. Learn about the wonders of creation. Through yoga we can learn many things about ourselves that we do not know.

యాంత్రిక జీవనంలో మనమెంత కోల్పోతున్నామో ఇప్పటికైనా అర్థమైందా!

Do you still understand how much we are losing in mechanical life!

పెరిగే ఆదాయంతో పాటు పెరుగుతున్న మానసిక ఒత్తిడులు మనల్ని తేలికగా వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కాస్త సమయం మన సంప్రదాయ ఆరోగ్య పద్ధతులకు కేటాయిస్తే, ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా మన సొంతమవుతుంది. అలాంటి పద్ధతుల్లో మనం మొట్ట మొదటగా పేర్కొనవలసింది యోగా.

Increasing income along with increasing mental stress makes us susceptible to diseases. If we devote some time to our traditional health practices during such times, we will have health and mental peace as well. Yoga is the first among such methods that we should mention.

యోగాసనాలు చేయాలంటే ఖర్చు ఏమి లేదు, మీ ఇంట్లోనే చెయవచ్చు. దీనికి కావలసినవి మంచి గాలి వచ్చే గది/ప్రదేశం, ఒక చాప, తేలికపాటి బట్టలు మాత్రమే.

There is no cost to do yogasanas, you can do them at your home. All it needs is a well ventilated room/place, a mat, light clothes.

యోగాభ్యాసమన్నది మన పూర్వీకులు మనకందించిన అమూల్యమైన ఆరోగ్య విజ్ఞానం. దీనిని చేయడానికి వయసు పరిమితి లేదు. పిల్లలు, పెద్దలు, అందరూ యోగాసనాలు వేయవచ్చు. ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు, ఆపరేషన్లు జరిగినవారు మాత్రం డాక్టర్ ను సంప్రదించి మొదలుపెట్టడం మంచిది.

The practice of yoga is a precious health science passed down to us by our ancestors. There is no age limit to do this. Children, adults, everyone can do yogasanas. It is better to consult a doctor for those who have serious health problems and those who have undergone operations.

పతంజలి అనే ఋషిని యోగశాస్త్ర పితామహుడు. ఆధునిక వ్యాయామ పద్ధతులు శరీరానికి కొంత మేలు చేయగలుగుతున్నా, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదు.

Sage Patanjali is the father of Yoga. While modern exercise methods can do some good for the body, nothing compares to yoga for health and mental peace.

ప్రతి రోజూ ఉదయం 5 కి, ఇక్కడ బొమ్మలలో చూపిన అన్ని ఆసనాలను మనము, 20 ఏళ్ళకు పైగా సాధన చేస్తున్నాము.

Every morning at 5 am, we have been practicing all the asanas shown in the figures here, for over 20 years.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,790; 104 తత్వాలు (Tatvaalu) and views 224,915
Dt : 04-Oct-2017, Upd Dt : 09-Aug-2019, Category : Health
Views : 2865 ( + More Social Media views ), Id : 20 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు


Link